My heartfelt gratitude to the State Bank of India for its generous contribution of ₹5 crore to the Chief Minister’s Relief Fund to support our people affected by Cyclone Arnab.
I also deeply appreciate all SBI employees across Andhra Pradesh for their commitment to contribute one day’s salary towards the relief efforts.
This gesture of solidarity will strengthen our efforts to provide relief and restore normalcy in the lives of affected families. Together, we will rebuild a stronger Andhra Pradesh.
#TogetherAgainstCycloneArnab
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society.
I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.
Heartiest congratulations to @isro on the successful launch of GSLV-F18 carrying the NVS-03 satellite from Sriharikota!
This landmark mission marks another major leap forward in strengthening India’s indigenous NavIC navigation system, furthering our journey toward self-reliance in space technology.
A truly proud moment for the nation! Gratitude and respect to our brilliant scientists and engineers for continuously elevating India's stature in space exploration.
#GSLVF18 #NVS03
భారతదేశాన్ని ఏకం చేసి, అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాలను పరిరక్షించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అసమాన కృషికి గుర్తుగా, ఆయన ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ప్రతి ఏటా అక్టోబర్ 31న 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, ఉక్కు సంకల్పం యావత్ జాతికి సదా స్ఫూర్తిదాయకం. దేశ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత, సంకల్పం కావాలి.
అందరికీ ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ శుభాకాంక్షలు.
అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరులో తుఫాను నష్టాన్ని పరిశీలించాను. తుఫాను బాధితులు, రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుకున్నాను. కష్ట సమయంలో ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి సాధారణ పరిస్థితి వచ్చే వరకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది.
#TogetherAgainstCycloneArnab
Deeply saddened by the passing of retired DGP Shri N. Balasubramanyam garu. An officer of uncompromising integrity, he earned respect for his firm decisions, progressive ideas and unwavering commitment to public service.
Throughout his distinguished career in policing, intelligence, transport and public administration, he championed reform, innovation and the use of technology to serve people better. He encouraged out-of-the-box thinking and involved his team in decision-making, fostering a spirit of shared responsibility. Andhra Pradesh continued to benefit from his experience and dedication until just a few months ago.
He fought his illness with extraordinary courage and determination. His passing is a profound loss, but his contributions and the inspiration he gave the police force will endure. My heartfelt condolences to his family, friends and colleagues. Om Shanti.
Today, I visited cyclone-affected areas to oversee relief operations on the ground. In Cheyyeru, Vetlapalem and Gachakayalapora villages in Mummidivaram, Konaseema district, I spoke with farmers, displaced families and affected residents. I inspected submerged fields and damaged coconut trees, and met families at a relief camp to understand their needs.
Despite the hardships caused by Cyclone Arnab, their resilience and positive response reflected their trust in our Government. We will honour that trust. The entire State administration stands with every person affected by the cyclone. We will work tirelessly until normalcy is restored across all affected areas.
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించాను. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని చెయ్యేరు, వేట్లపాలెం, గచ్చకాయలపొర గ్రామాల్లో రైతులు, నిర్వాసితులు, బాధిత ప్రజలతో మాట్లాడాను. నీట మునిగిన పొలాలను, దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించాను. తుఫాను సహాయక శిబిరంలో పునరావాసం పొందుతున్న తుఫాన్ బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నాను. తుఫానుతో అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా బాధితులు సానుకూలంగా స్పందించిన విధానం.. రాష్ట్ర ప్రభుత్వంపై వారికున్న నమ్మకాన్ని తెలియచేసింది. వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ప్రతి తుఫాను బాధితుడికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలుస్తుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు ప్రభుత్వం విశ్రమించకుండా పనిచేస్తుంది.
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
I spoke with Union Home Minister Shri @AmitShah Ji and briefed him on the impact of #CycloneArnab across Andhra Pradesh.
I explained the extensive damage caused by the cyclone, particularly to agricultural and horticultural crops, power infrastructure, roads and other public assets. I also apprised him of the ongoing heavy rainfall in cyclone-affected districts, the prevailing ground situation, and the extensive relief and restoration operations being undertaken by the State Government.
In view of the widespread damage, I requested the Union Home Minister to depute Central teams at the earliest to assess the losses and extend financial assistance from the Government of India to support relief, rehabilitation and restoration efforts.
#TogetherAgainstCycloneArnab
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you.
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
Our government stands firmly with the people of Andhra Pradesh as we face the challenges posed by #CycloneArnab. We are making every possible effort to minimise the impact of the cyclone, protect lives and restore normalcy at the earliest.
I have been continuously monitoring the situation, reviewing developments throughout the night and staying in constant touch with District Collectors, senior officials and field-level teams. Our Ministers are on the ground, personally supervising relief and restoration operations.
Thousands of officials, emergency response teams and frontline personnel have been working tirelessly, even through the night and in heavy rainfall, to clear roads, restore power, address public grievances and ensure essential services. Their dedication and commitment are truly commendable.
Our advance preparedness and coordinated response are yielding positive results. I am relieved that no loss of life has been reported so far. Our priority remains the safety of every citizen and providing immediate relief to those affected.
I assure the people that the entire government machinery is fully mobilised and will continue working round the clock until normalcy is restored.
I appeal to everyone in the cyclone-affected areas to remain alert, stay safe, follow official advisories and avoid unnecessary travel until the cyclone's impact subsides. Please remain calm and courageous. The government is with you at every step. Together, we will overcome this challenge.
Protecting every life is our foremost priority as Andhra Pradesh prepares to face #CycloneArnab.
I have reviewed the situation four times since this morning and remain in constant contact with District Collectors and senior officials. Through continuous reviews, I am monitoring evacuations and ensuring that personnel, equipment and essential supplies reach vulnerable areas promptly.
We have identified 2,199 cyclone shelters and prepared evacuation plans, prioritising the elderly, children, persons with disabilities and pregnant women. Already, 2,360 pregnant women have been shifted to medical facilities.
Twelve NDRF and ten SDRF teams have been assigned to the districts, with deployment underway. Police, Fire Services and medical teams are mobilised, while the Navy and Coast Guard are ready to assist. Food, drinking water, medicines and generators are being arranged, and over 8,400 power restoration personnel have been mobilised. Control rooms are functioning round the clock.
I appeal to everyone to remain calm, stay alert and cooperate with the authorities. Move immediately to designated shelters when advised. Fishermen must not venture into the sea until official clearance is given.
Keep essential supplies and charged phones ready. Avoid unnecessary travel, beaches, riverbanks, floodwaters and fallen power lines. Remain in safe shelter until authorities confirm that the danger has passed.
Follow official updates and government precautions. Do not circulate rumours. Please check on vulnerable neighbours and inform local officials of anyone needing assistance.
The government machinery is working continuously for your safety. Your timely cooperation will help us protect lives. Together, we will face this challenge.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మన ఆధ్యాత్మిక విశ్వాసానికి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు, విజయనగరం సాంస్కృతిక వైభవానికి ప్రతీక. భక్తి పారవశ్యంతో లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవం మన వారసత్వ సంపద. అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
Kadapa’s startup scene is getting a serious upgrade - and the new vibe is undeniably cool. @naralokesh
@R_Madhavi_Reddy
Video Courtesy: kadapasmartcity
600 MW commissioned, in 2400 acres in Kurnool, supplying clean energy from AP to other states. SAEL’s solar plant is a testimony to AP’s revival as a clean energy major. We said it, and we did it!
#CheppaamChestunnaam #ChooseSpeedChooseAP
@followCII
రామాయణ మహాకావ్యం ద్వారా ధర్మం, సత్యం, కర్తవ్యం, మానవీయ విలువలతో కూడిన ఆదర్శ జీవితానికి మార్గదర్శనం చేసిన ఆదికవి మహర్షి వాల్మీకి.
వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన అందించిన అమూల్య సందేశాలను స్మరించుకుందాం. వ్యక్తిగత జీవితంతో పాటు... పాలనలోనూ ధర్మబద్ధత, న్యాయం, ప్రజా సంక్షేమం ప్రాధాన్యతను చాటిచెప్పిన మహనీయుడాయన.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న ఈ శుభవేళ.. ఆ మహర్షి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన ధర్మమార్గంలో పయనిద్దాం.
This is not Switzerland. This is Andhra Pradesh.
Thank you instagram.com/kondadoraraju for capturing this.





























