Vemireddy Prabhakar Reddy (@vpr_official_) header
Vemireddy Prabhakar Reddy (@vpr_official_) profile picture

Member of the Lok Sabha - Nellore | Member, Committee on Public Undertakings Member | Standing Committee on Finance | Ex Rajya Sabha MP

Joined August 2018
Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)
కావలి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని నిధులు, పెట్టుబడులు -కావలిలో కూటమి నేతల మీడియా సమావేశంలో నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు -బీపీసీఎల్ రిఫైనరీతో పారిశ్రామికంగా కనకపట్నంగా రూపుదిద్దుకోనున్న కావలి -గత రెండున్నరేళ్లలో కావలి పట్టణంలో రూ.450 కోట్లతో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి -మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు -సీఎం శ్రీ చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషితో పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ కావలికి బీపీసీఎల్ రిఫైనరీ రావడంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ పాత్ర ఎంతో ఉందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు. ఈ భారీ పరిశ్రమతో కావలి ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరిగి కనకపట్నంగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. కావలిలో మంగళవారం నిర్వహించిన కూటమి నేతల మీడియా సమావేశంలో ఎంపీగారు పాల్గొన్నారు. #VemireddyPrabhakarReddy #NelloreMP #IdhiManchiPrabhutvam #NelloreDevelopment
1
7
218
చదువుకున్నవాళ్లకు, సేవ చేసేవాళ్లకు కూటమి అవకాశం.. గెలిపించండి. -చదువుకున్నవాళ్లకు, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నవాళ్లకు కూటమి ప్రభుత్వం రాజకీయంగా అవకాశాలు ఇస్తోందన్న ఎంపీ గారు -కావలి 26, 27 వార్డుల్లో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి ప్రచారం.. కౌన్సిలర్ అభ్యర్థులు కోట సురేంద్ర రెడ్డి, మంద కిరణ్ కుమార్‌లను ప్రజలకు పరిచయం చేసిన ఎంపీ గారు -చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల్లో కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు చదువుకున్నవాళ్లకు, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నవాళ్లకు కూటమి ప్రభుత్వం రాజకీయంగా అవకాశాలు ఇస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం కావలి పట్టణంలో పర్యటించిన ఎంపీ గారు, కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి 26, 27 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట సురేంద్ర రెడ్డి, 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మంద కిరణ్ కుమార్‌లను ప్రజలకు పరిచయం చేసిన ఎంపీ గారు, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లలో కావలి పట్టణంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఎంపీ గారు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కావలిని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు పట్టుదల ఉన్న నాయకుడని, ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరని ప్రశంసించారు. అదే పట్టుదలతో కావలిని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. పట్టణ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా సమర్థులైన ప్రజాప్రతినిధులు ఉండాలని ఎంపీ గారు అన్నారు. అందుకోసం కూటమి తరఫున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రజలు అండగా నిలవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, కావలి మరింత అభివృద్ధి చెందేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. #VemireddyPrabhakarReddy #NelloreMP
1
23
309
అన్ని మతాలను సమదృష్టితో చూడాలన్న సిక్కుల ఆరాధ్య దైవం, గురునానక్ బోధనలు స్మరించుకుంటూ.. ప్రజలందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు. #GuruNanakJayanthi #GuruNanak
3
17
283
కార్తీక పౌర్ణమి దీపాల వెలుగులు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, ఆ శివపార్వతుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. #KarthikaPournami #HarHarMahadev #OmNamahShivaya
3
27
403
మున్సిపాలిటీలో చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లనూ గెలిపిస్తేనే కావలి అభివృద్ధి మరింత ముందుకు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు -కావలిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు.. అభివృద్ధి పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి -ప్రస్తుతం కావలిలో సుమారు రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు.. భవిష్యత్తులో మరో రూ.450 కోట్లతో పనులు చేపట్టేందుకు కృషి -మొత్తం 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులనూ కూటమి గుర్తులపై గెలిపించాలని విజ్ఞప్తి కావలి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సోమవారం 15, 20 వార్డుల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారితో కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్, 15వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మేడికొండ సుజిత, 20వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జ్యోతి బాబురావు పాల్గొన్నారు. #VemireddyPrabhakarReddy #NelloreMP
1
7
38
389
నెల్లూరు నగర పాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై, నూతన మేయర్‌ శ్రీ పోలుబోయిన రూప్‌కుమార్‌ యాదవ్‌ గారికి, డిప్యూటీ మేయర్‌ శ్రీ రఘునాథరాజు గారికి, 72 మంది నూతన కార్పొరేటర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. నగరంలోని అన్ని డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశాను. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీ హిమాన్షు శుక్ల గారు,మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, రూరల్‌ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు. #VemireddyPrabhakarReddy #NelloreCorporation #NDAsweepsAP #APLocalBodyElections #VPR
1
7
84
998
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచసూత్రాలతో ప్రపంచానికి మానవతా సందేశాన్ని అందించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. #SriSathyaSaiBabajayanthi #SriSathyaSaiBaba
3
37
359
కావలిలో రూ.900 కోట్లతో అభివృద్ధి.. త్వరలో బీపీసీఎల్‌కు శంకుస్థాపన. -కూటమిని గెలిపిస్తే యువతకు స్థానికంగానే ఉద్యోగాలు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు - 5వ వార్డులో ఎన్నికల ప్రచారం.. కావలి ఛైర్మన్ పీఠాన్ని కూటమికి అందించాలని విజ్ఞప్తి -ఇప్పటికే కావలిలో రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు.. మరో రూ.450 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి -సుమారు 100 ఎకరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు.. యువతకు ఉపాధి కల్పించేలా ప్రాజెక్టులు -కావలి షాదీ మంజిల్‌ను నెల్లూరు తరహాలో అభివృద్ధి చేసేందుకు సొంత నిధులు కేటాయిస్తానని హామీ -డిసెంబర్‌లో జరిగే జిల్లా స్థాయి ఇస్తిమాకు సహకారం.. ముస్లిం సోదరులకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా -అల్లూరు తన అమ్మమ్మగారి ఊరు.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఎంపీ గారు కావలిలో ఇప్పటికే రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.450 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెల్లడించారు. త్వరలో బీపీసీఎల్ కంపెనీకి పునాది వేయనున్నామని, సుమారు 100 ఎకరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పలు ప్రాజెక్టులు చేపట్టనున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన అల్లూరు, కావలిలో పర్యటించారు. #VemireddyPrabhakarReddy #NelloreMP
6
31
465
కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayPrashanthamma #VemireddyPrashanthiReddy #KovurMLA
1
8
1
96
1,166
కావలి మున్సిపాలిటీలోనూ కూటమి జెండాలు ఎగరాలి - జడ్పీటీసీ, ఎంపీటీసీ తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించండి - 42, 43, 44 వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఎంపీ, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం - అభివృద్ధి కొనసాగాలంటే ఛైర్మన్‌తో పాటు అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించాలని పిలుపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచినట్లే, కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు. కావలి శాసనసభ్యులు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి శనివారం సాయంత్రం ఆయన మున్సిపాలిటీలోని 42, 43, 44 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి తరఫున 42వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు మన్నేపల్లి తులసి, 43వ వార్డు అభ్యర్థి తెలుగుదేశం నాయకులు కొమరా రమణయ్య, 44వ వార్డు అభ్యర్థి జనసేన నాయకురాలు తిరువీధుల శ్యామల గారి తరఫున ఎంపీ గారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి, పట్టణాభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి హయాంలో కావలిలో స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానంతో పాటు అన్ని వార్డుల్లో కూటమి కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. #VemireddyPrabhakarReddy #NelloreMP #VPR
5
32
476
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లా పరిషత్ నూతన చైర్మన్ శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారు, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచి, విజయానికి సహకరించినందుకు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. #VemireddyPrabhakarReddy #NelloreMp #Nellore #NDASweepsAP
9
106
1,059
ప్రతి రోజు కడలికి ఎదురిగి, ప్రాణాలకు తెగించి సముద్ర ఆటు పోటులను ఎదుర్కొంటు దేశ సంపదకు సహాయపడుతు కుటుంబాన్ని కాపాడుకునే ప్రతి మత్స్యకార సోదరుడికి హృదయపూర్వక ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. #WorldFisheriesDay #FishermensDay #MatsyakaraDinotsavam
3
11
208
Vemireddy Prabhakar Reddy retweeted
అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు సంపూర్ణ మద్దతు: వీపీఆర్‌ దంపతులు. - జడ్పీ నూతన ఛైర్మన్‌ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ పొట్టేళ్ల ప్రసాద్‌కు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి శుభాకాంక్షలు - కూటమి నేతల ఐక్యతకు, టీడీపీ బలానికి జడ్పీ ఛైర్మన్‌ ఏకగ్రీవ ఎన్నిక నిదర్శనమని వెల్లడి నెల్లూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (ఇందుకూరుపేట జడ్పీటీసీ సభ్యులు) గారికి, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన పొట్టేళ్ల ప్రసాద్‌ (మనుబోలు జడ్పీటీసీ సభ్యులు) గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంపూర్ణ మద్దతు, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరగడం ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులోని జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నూతన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం జడ్పీ ఛైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని, వైస్‌ ఛైర్మన్‌గా పొట్టేళ్ల ప్రసాద్‌ను జడ్పీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్‌, ప్రిసైడింగ్‌ అధికారి హిమాన్షు శుక్లా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు.. జడ్పీ నూతన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ప్రశాంతి రెడ్డిగారు కోవూరు జడ్పీటీసీలను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. #VemireddyPrashanthiReddy #VemireddyPrabhakarReddy #Nellore #TeluguDesamParty
9
21
469
దాదాపు 25 ఏళ్ల తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉంది. జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాలకు గాను 33 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ప్రజలు మనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. ఈరోజు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి. ఇప్పటి నుంచే ప్రజలకు మరింత చేరువవుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని, 2029లోనూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. #VemireddyPrabhakarReddy #NelloreMP #TeluguDesamParty
1
10
81
1,294
కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిదే విజయం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు. - కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీగారు - చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు - రెండున్నరేళ్లలో కావలి అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు వెచ్చించినట్లు వెల్లడి - ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని విశ్వాసం - భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేయాలని కూటమి శ్రేణులకు ఎంపీ గారు పిలుపు కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం కావలి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కావలి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో రోడ్లు, బైపాస్‌లు, తాగునీటి పథకాలు తదితర అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.450 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కావలిలో వైసీపీది నామమాత్రపు పోటీ మాత్రమేనని, ప్రజల మద్దతు కూటమి వైపు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు.. కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని, ప్రతి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. #VemireddyPrabhakarReddy #NelloreMP
7
28
496
భారత మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం, మాతృభూమి స్వేచ్ఛ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. #JhansiLakshmiBai #JhansiLakshmiBaiJayanthi
5
17
235
సింహపురిలో ఆధ్యాత్మిక శోభ.. 11వ కార్తీక మాస లక్ష దీపోత్సవానికి శ్రీకారం. నెల్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 11వ కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు దంపతులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో వీఆర్సీ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు భక్తిభావంతో సాగే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని, పరమశివుని కృపకు పాత్రులు కావాలని వీపీఆర్ దంపతులు ఆహ్వానించారు. #VPRLakshaDeepotsavam #LakshaDeepotsavam #VPRFoundation #KarthikaMasam #Nellore
8
19
415
సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ, ప్రజల్లో చైతన్యం నింపుతూ, సామాజిక మార్పులో భాగస్వాములవుతున్న పత్రికా రంగానికి జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభినందనలు. #NationalPressDay #PowerOfPen #JournalismForSociety
5
20
439
Heartiest congratulations to Team India U-19 on a spectacular victory in the #AsiaCupU19Final Our young champions showcased exceptional skill, grit and team spirit to defeat Pakistan in a thrilling final. A proud moment for Indian cricket. #INDvsPAK #TeamIndia #U19AsiaCup
6
40
554
నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశ తొలి ప్రధాని, భారతరత్న శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay #HappyChildrensDay
3
1
10
352