KTR (@KTRBRS) header
KTR (@KTRBRS) profile picture

Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked

Hyderabad, Telangana
Joined March 2010
Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)
Pinned Tweet
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!! జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇 🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను.. 🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను.. దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని.. గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు. ఎల్ నినో వస్తున్నదని.. ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే.. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను.. పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది #CongressBetrayedTelangana #CongressFailedTelangana
130
390
19
1,573
147,574
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ? కరువులు..కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా? నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ..నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా? జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది? నిన్న సిరిసిల్లో..నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు ..పిచ్చి ప్రేలాపనలు! నాలుగు మంచి పనులు..మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల్ల ముఖ్యమంత్రి ఎవరైనా! పథకాలకు పాతరేసి..అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ ! కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు .. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్ధిపేట ..సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం! ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ..ఉద్యమ శిఖరం కేసీఆర్ ను దూషించి పైశాచిక ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు? కేసీఆర్ ఒక కల్పవృక్షం..నువ్వొక కలుపు మొక్క!
16
150
3
538
19,127
KTR retweeted
శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కానీ పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో కూడా లేని పాలమూరు మాత్రం ఎండిపోతోంది. కరువు పరిస్థితుల్లోనూ ఒక్క మల్యాల పంప్‌హౌస్ నుంచే 23 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయింది. కుప్పానికి నీళ్లు తరలించడానికి లేని కరువు, పాలమూరుకు నీళ్లిచ్చే విషయంలోనే ఎందుకు వచ్చింది రేవంత్? తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? అందుకే మళ్లీ చెప్తున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువని! #CongressFailedTelangana
1
54
179
7,261
KTR retweeted
పెన్షన్లలో 4.70 లక్షల కోతలు విధించి, కొత్త పెన్షన్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 44 లక్షల 70 వేల పెన్షన్లు ఉండేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 4 లక్షల 70 వేల పెన్షన్లకు కోత పెట్టి, కొత్తగా 4 లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే మంజూరు చేసింది. తొలగించిన పెన్షన్లతో పోలిస్తే కొత్తగా ఇచ్చినవి 7 వేలు తక్కువ. ఉన్న పెన్షన్లను తొలగించి, అంతకంటే తక్కువ మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోంది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
20
70
3,595
KTR retweeted
అధికారంలోకి రావడం కోసం వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని భట్టి విక్రమార్క అఫిడవిట్‌తో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశాడు. గ్యారంటీ కార్డులను క్రెడిట్ కార్డుల్లా భద్రంగా దాచి పెట్టుకోవాలని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, మూడేళ్లు కావస్తున్నా హామీలను అమలు చేయలేకపోయారు. మరిప్పుడు ఆ గ్యారంటీ కార్డులను ప్రజలు ఎక్కడ పెట్టుకోవాలి? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
28
69
3,453
ఇంజనీర్లు చెప్పలేదా? చెప్పినా పై స్థాయిలో తొక్కి పెట్టారా? ఇరిగేషన్ మంత్రి బాధ్యతవహించడా? ఆంధ్ర దాసుడు ఆదిత్యనాథ్ కు నోటీసు ఇవ్వరా? 8 నెలల నుంచి పనులు జరుగుతుంటే ఏమీ తెలియనట్టుగా నిద్ర నటించారు! సాగర్ లో ఏం జరుగుతుందో తెలియకుండా ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తున్నారో?
1
25
80
3,783
Stark reality of the drought that Congress thrust on Telangana
ఈరోజు కూడా శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి మల్యాల పంప్‌హౌస్‌ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. తెలంగాణకు మాత్రం కరువు వచ్చింది నీళ్లు లేవంటూ రైతులను కరువులోకి నెట్టారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది కాంగ్రెస్ పనికట్టుకుని తెచ్చిన కరువని నిరూపించడానికి.
10
113
2
590
37,263
KTR retweeted
ఢిల్లీ వాళ్లను ఎదిరించే ధైర్యం ఈ కాంగ్రెస్–బీజేపీ ఢిల్లీ గులాములకు లేదు! ఆ ధైర్యం ఒక్క గులాబీ జెండాకే ఉన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
2
33
1
110
4,123
సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? ఒకపక్క తాగునీటికి కష్టంగా ఉంది, బండ్లు కడగొద్దు, వారానికోసారి స్నానం చేయండని రేవంత్ రెడ్డి చెప్తుంటే.. మరోపక్క నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో తాగునీటికి సమస్య లేదని అంటున్నాడు. నాగార్జున సాగర్‌లో 510 అడుగుల కింద పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే నీకు సోయి లేదా ఉత్తమ్? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
67
1
221
8,470
ఇష్టానుసారంగా సాగర్‌ను దోచుకుంటామంటే బీఆర్ఎస్ ఊరుకోదు.. ఒకవైపు సాగునీటి కోసం రైతులు అల్లాడుతుంటే.. మరోవైపు తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతుంటే.. ఈ జలదోపిడీని వదిలిపెట్టం.. న్యాయ పోరాటానికైనా సిద్ధం.
3
58
1
189
7,399
ప్రజా పాలన కాదు ఇది, పర్సెంటేజీల పాలన పేద ప్రజల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న దిక్కుమాలిన పాలన
సారు హెలికాఫ్టర్‌ దిగొచ్చి.. దోస్తులతో ఫుట్ బాల్ ఆడుకోడానికి.. MCRHRD ప్యాలెస్ లో తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టుకున్న హెలిప్యాడ్ & ఫుట్‌బాల్ గ్రౌండ్..!! ఎందుకు సామీ.. నీ సరదాల కోసం కోట్లు తగలేస్తున్నవ్! అంత బుద్ధిపుడితే నీ మనవడితో ఇంట్లనే ఆడుకో.. అంతేగానీ ఇల్లు పీకి పందిరెయ్యకు! @revanth_anumula
15
178
2
818
68,347
KTR retweeted
రాబోయే 50 యేండ్ల హైదరాబాద్ నీటి అవసరాల కోసం BRS ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్ట్ మొదలు పెట్టి 80%+ పని పూర్తి చేసింది. గత 3 యేండ్ల నుండి పనులు పూర్తి చెయ్యకుండా మోద్దు నిద్ర పోయి ఇప్పుడు నీళ్లు లేవు, రావు అని సొల్లు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి.
79
1
319
9,333
రైతులు పంటలు వేసుకోవద్దు ప్రజలు ఫంక్షన్లు చేసుకోవద్దు మీరు ప్రజల సొమ్ము తో 70 లక్షలతో బాత్రూమ్ లు కట్టుకోండి కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో ధర్నాకి పోండి 200 కోట్లు ఖర్చు చేసి భారత్ సమ్మిట్ ఫంక్షన్ చేసుకోండి ఆటోల లాగ హెలికాప్టర్ లలో తిరగండి ప్రభుత్వ విమానంలో సోనియా గాంధీ బుక్ ఓపెనింగ్ కి ఢిల్లీకి వెళ్ళండి. కోట్లు ఖర్చు పెట్టి 3 రోజులు సీఎం పుట్టినరోజు వేడుకలు చేయండి. ప్రజలకు పొదుపు నీతులు ప్రజల సొమ్ముతో మీకు జల్సాలు #CongelninoEffect
1
26
1
82
3,730
KTR retweeted
📣 సాగర్‌ జలాలు ఆంధ్రార్పణం 🌊 🆘 ఏపీ నీటి చోరీపై మాట్లాడరేం.. సీఎం, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నట్టు❓ ⚠️ 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఏపీ దోపిడీ తెల్వకుండా పోయిందా? 🎯 ఇకనైనా అడ్డుకుంటరా, లేదా? లేదంటే ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తం ⛔ నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిస్థితి ఏంగావాలె? 🤝 ఆంధ్రా బాబు కుట్రలో బీజేపీకీ భాగస్వామ్యం 🚨 పాలమూరు, నల్లగొండను ముంచిందే కాంగ్రెస్‌. నేడు మళ్లీ అదే ద్రోహం చేస్తున్న రేవంత్‌ సర్కార్‌ 📢 ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు చేసిన దానికంటే తెలంగాణకు రేవంత్‌ చేస్తున్న ద్రోహమే ఎక్కువ 💥 ధ్వజమెత్తిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు గండి కొట్టిండ్రు. ఈనాటికీ కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా దోచుకుపోతున్నది. ఇప్పుడు నాగార్జునసాగర్‌కూ అదే తరహాలో గండి కొడుతున్నది. కేఆర్‌ఎంబీ, కేంద్రం పర్మిషన్‌ ఇవ్వకుండానే ఏడాది నుంచి పనులు చేస్తున్నది. ఈ విషయం 18 గంటలు పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా తెలియని దుస్థితి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రులు చేసిన దానికంటే ఎక్కువ ద్రోహం ఇవాళ రేవంత్‌రెడ్డి చేస్తున్నడు. చంద్రబాబు 730 కిలోమీటర్ల అవతల కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొని పోయిండు. రేవంత్‌రెడ్డి మాత్రం 70 కిలోమీటర్ల పరిధిలో మొత్తం పాలమూరు జిల్లాకు కృష్ణా నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌కు సిగ్గనిపిస్తలేదా? ఈ సీజన్‌లో శ్రీశైలం, జూరాల నుంచి మొత్తం కలిపితే 50 టీఎంసీల నీళ్లు కూడా ఎత్తిపోయలే. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటదా? తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్‌ గతంలో చేసినట్టు ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోం. జలదోపిడీని అడ్డుకునేదాకా వదిలిపెట్టం. అవసరమైతే న్యాయపోరాటం చేస్తం. బహిరంగ సభల ద్వారా రైతులు, ప్రజలను జాగృతం చేస్తం. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో తన తాబేదారులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా వనరులను కొల్లగొడుతున్నదో వివరించి ఎండగడుతం.
30
83
4,645
♦️ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి, పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ♦️ 90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి.. పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను అభినందించిన కేటీఆర్ ♦️ తెలంగాణ భవన్‌లో ఆత్మీయ భేటీ.. స్వయంకృషి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్ పారిశ్రామిక ప్రస్థానానికి అండగా నిలిచి, ఆయన పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ రోజు తెలంగాణ భవన్‌లో ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు. 90 శాతం శారీరక వైకల్యం ఉన్నప్పటికీ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగి, తన పరిశ్రమ ద్వారా పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. అనంతరం చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు. శారీరక వైకల్యంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చంద్రకాంత్ సాగర్, వాటిని అధిగమిస్తూ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తన విజయాన్ని తనకే పరిమితం చేయకుండా, తన పరిశ్రమ ద్వారా దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సహకారం, ప్రోత్సాహం తన పారిశ్రామిక ప్రస్థానంలో ఎంతో కీలకమని చంద్రకాంత్ సాగర్ తెలిపారు. కేటీఆర్ అండతో పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పిస్తున్నానని చంద్రకాంత్ సాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు. స్వయంకృషితో ఎదిగి మరెందరికో ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభినందించారు. దివ్యాంగుల సాధికారత, ఆత్మగౌరవంతో కూడిన జీవనం, స్వావలంబన కోసం స్వయంకృషి ఫౌండేషన్ చేపట్టనున్న కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలిపారు.
58
1
217
7,683
విధిని జయించి, పారిశ్రామికవేత్తగా ఎదిగిన దివ్యాంగుడు చంద్రకాంత్ సాగర్‌ను మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, స్వయంకృషితో ఎదగడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రయాణం అభినందనీయం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అవార్డు కార్యక్రమంలో ఆయనను కలిసాను. ప్రభుత్వపరంగా ఆయన పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించాను. నేడు ఆయన పరిశ్రమ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుండటం ఆనందంగా ఉంది. చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు సేవలందిస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను... స్వయంకృషి ఫౌండేషన్‌కు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
17
210
7
992
34,105
కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర ద్రోహం చేసింది కాంగ్రెస్సే! నీటి వాటాల్లో మనకు జరిగిన అన్యాయం 'చెబితే భారతమంతా.. రాస్తే రామాయణమంతా' అని కేసీఆర్ గారు చెప్పింది అక్షర సత్యం. 1930లో చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు 161 టీఎంసీలతో ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నేతలు కుట్రతో దాన్ని నందికొండకు తరలించి మొదటి ద్రోహం చేశారు. ఫలితంగా ఆంధ్రాలో 72% ఆయకట్టు స్థిరీకరణ జరిగితే, తెలంగాణకు దక్కింది కేవలం 28% మాత్రమే! * బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
5
46
132
5,962
ఆనాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలంలో పొక్కగొట్టి, పోతిరెడ్డిపాడు ద్వారా బ్రహ్మాండంగా జలదోపిడీకి పాల్పడితే అడ్డుకోని ద్రోహులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే.. ఈ రోజు కూడా చంద్రబాబు సొరంగం తవ్వి నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి ఏకంగా 90 టీఎంసీల నీళ్ల దోపిడీకి పాల్పడుతుంటే.. కనీసం సోయి లేని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి! కాంగ్రెస్‌ను గెలిపించిన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజల ప్రయోజనాలకు శాశ్వత ద్రోహం చేస్తున్న రేవంత్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
47
93
5,074
సాగర్ నీళ్లను ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోం.. మరోసారి బీఆర్ఎస్ పోరాటం తప్పదు! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS హెచ్చరిక 🔥
1
53
130
4,924
నాగార్జున సాగర్‌లో 52 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో నాగార్జున సాగర్ నుండి ఏపీ నీళ్లు కొల్లగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏపీ జలదోపిడీని అడ్డుకోవడానికి కేఆర్ఎంబీ దగ్గరకు వెళ్లి ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని అడిగారా? మిగిలిన 40 టీఎంసీలు తెలంగాణ తాగునీటి అవసరాలకు కేటాయించాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారా? జలాశయాల్లో మిగిలిన నీటిలో తాగునీటికి ఎంత కేటాయించారు? ఎంత వినియోగిస్తారు? ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపుపై కేఆర్ఎంబీ వద్ద ఒక్క నిరసనైనా వ్యక్తం చేశారా? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
31
73
3,945
కృష్ణా నదిపై పంపులు ఆన్ చేయకుండా.. 250 టీఎంసీల నీళ్లను రేవంత్ ఆంధ్రాకు ధారాదత్తం చేసిండు. శ్రీశైలం నుండి 700 కి.మీ. దూరంలోని కుప్పానికి చంద్రబాబు కృష్ణా జలాలను తీసుకెళ్తే.. పక్కనే ఉన్న పాలమూరుకు నీళ్లు ఎత్తిపోయకుండా రేవంత్ ఎండబెట్టిండు! పాలమూరు బిడ్డవని చెప్పుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా రేవంత్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
1
53
1
117
6,196