Dr.Dileep Reddy (@BRSDILEEP) header
Dr.Dileep Reddy (@BRSDILEEP) profile picture

PhD graduate from the Department of IT, OU Campus

Joined March 2018
Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)Photo by Dr.Dileep Reddy (@BRSDILEEP)
Dr.Dileep Reddy retweeted
రేవంత్ రెడ్డి.. నువ్వా నేనా ఇద్దరమే తేల్చుకుందాం! బిఆర్ఎస్ నుండి నేను, కాంగ్రెస్ నుండి నువ్వు సిద్దిపేట నుండి పోటీ చేద్దాం. తొట్టి గ్యాంగ్ తో తిట్టించడం కాదు, దమ్ముంటే సవాల్ స్వీకరించు.. @revanth_anumula
30
181
7
1,130
36,025
Dr.Dileep Reddy retweeted
క్రీడల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే, చేతలు గల్లీ స్థాయి దాటకపోవడం సిగ్గుచేటు. హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే @revanth_anumula క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా? అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేసారు. క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతున్నది. మీ ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి గారూ.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా? విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే PETలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా? పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? కోచ్ లు లేకుండా క్రీడా కారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు? ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్ లను నియమించండి. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు గాను పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయిండి. మాటలు కాదు, చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలి. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు TA/DA ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలి. క్రీడా బడ్జెట్‌ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలి. మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలి. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలి. క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడం. క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. #CongressFailedTelangana
16
61
2
272
7,898
Dr.Dileep Reddy retweeted
రేవంత్ రెడ్డి మీ గురువు గారు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తున్నాడు. మరి నువ్వెప్పుడు ఇస్తావ్.? #CongressFailedTelangana
17
83
2
531
23,919
Dr.Dileep Reddy retweeted
Replying to @BRSparty
Jai kcr
1
1
700
Dr.Dileep Reddy retweeted
Stepped onto the badminton court for a wonderful evening with the kids. Lots of smiles, and memories to cherish. Feeling refreshed, energized.
6
58
6
387
25,884
Dr.Dileep Reddy retweeted
15 years ago today, on June 19, 2011, I participated in the historic Vanta-Varpu at Hitech City, a landmark protest that united people across Telangana in the movement for self-respect and statehood. A proud chapter in our struggle. ✊ #MajorThrowback #JaiTelangana
21
173
6
1,064
16,290
Dr.Dileep Reddy retweeted
కాళేశ్వరం మీద కోపం.. కేసీఆర్‌ మీద కడుపునిండా కసి.. మేడిగడ్డ బరాజ్‌ రెండు పిల్లర్లకు రెండున్నరేండ్లుగా రిపేరు చేయించడానికి చేతులు రాని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తమ్మిడిహట్టిపై తలకిందులుగా తపస్సు చేస్తున్నది. మొదట్లో తమ్మిడిహట్టిపై తొడగొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అక్కడ సాంకేతికంగా ప్రాజెక్టు సాధ్యంకాదని ఒక నిర్ణయానికి వచ్చింది. సాంకేతిక సమస్యలు, మహారాష్ట్ర అభ్యంతరాలు, పర్యావరణ ప్రతిబంధకాల నేపథ్యంలో ప్రతిపాదనలను మార్చుతూపోతున్నది. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. రెండున్నరేండ్ల తరువాత ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని రెండు బరాజ్‌ల నిర్మాణం పేరిట కొత్త నాటకానికి తెరతీసింది.
84
2
236
5,517
Dr.Dileep Reddy retweeted
My recent comments relating to AP politics have been withdrawn. The JanaSena leadership has accepted the withdrawal and appealed to everyone to treat the matter as closed forthwith. The entire issue now stands closed, and there is no purpose in revisiting any of those comments.
485
239
110
2,020
391,016
Dr.Dileep Reddy retweeted
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి ఎర్రవెల్లి నివాసం నుండి హెలికాప్టర్‌లో బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి ఎర్రవెల్లి నివాసం నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
1
49
2
402
59,375
Dr.Dileep Reddy retweeted
లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యం. మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు. #Kaleshwaram #KCRVision
81
250
19
1,021
88,076
Dr.Dileep Reddy retweeted
1, కల్తీ ఆహారం మాకొద్దు అంటూ రోడ్డెక్కిన సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 2, భోజనం బాగుండటం లేదని హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి నుంచి నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట జరుగుతున్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula కి ఉలుకు లేదు, పలుకు లేదు. నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గరుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం సిగ్గుచేటు. ఉస్మానియాకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండున్నరేండ్లుగా చేసిన అభివృద్ది ఏముంది? మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటది అనడానికి ముఖ్యమంత్రి పర్ఫెక్ట్ ఉదాహరణ రాష్ట్ర అభివృద్ది కోసమే అంటూ ఇప్పటి వరకు 62 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి నువ్వు సాధించిదేమిటో మొన్నటి కేంద్ర బడ్జెట్ తోనే తేటతెల్లమైంది. ఒకవైపు గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్ రెడ్డి, మరో వైపు అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీసిండు. కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తడట అన్నట్లు ఉన్న గురుకులాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తరట. పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి కల్పించడమేనా ఇందిరమ్మ రాజ్యం? ఉస్మానియా విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడమేనా మీ ప్రజాపాలన? రేవంతు రెడ్డి.. పరిపాలన అంటే ప్రగల్భాలు పలకడం కాదు, ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపించడం అంతకంటే కాదు. హార్వార్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి వచ్చినా కూడా.. మీరు విద్య పట్ల, విద్యార్థుల పట్ల ప్రాధాన్యం చూపకపోవడం శోచనీయం. ఇప్పటికైనా విద్యాశాఖ మీద దృష్టి సారించి, గురుకుల విద్యార్థులకు పురుగుల్లేని భోజనం అందించాలని, ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. @TelanganaCMO #CongressFailedTelangana
136
185
6
559
14,383
Dr.Dileep Reddy retweeted
Revanth Reddy promised a job calendar, but delivered a scam calendar. #CongressScamCalendar #RevanthReddyScams
129
245
7
616
12,517
Dr.Dileep Reddy retweeted
కక్ష సాధింపుతో కాంగ్రెస్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులో విచారణ కోసం నంది నగర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
1
75
425
5,400
Dr.Dileep Reddy retweeted
తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ గారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదు… అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉంది. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. #CongressFailedTelangana #CongressBetrayedTelangana
145
233
45
1,052
145,314
Dr.Dileep Reddy retweeted
స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పనిగట్టుకొని చేసే ఇలాంటి చిల్లర ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ​మనందరి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడమే.. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే. ​జై తెలంగాణ! జై కేసీఆర్! ​@BRSHarish
51
95
6
370
13,276
Dr.Dileep Reddy retweeted
నేడు అసెంబ్లీలో @revanth_anumula అత్యంత జుగుత్సాకరమైన, అసభ్యకరమైన భాషలో అబద్దాల వరద పారించాడు. అసెంబ్లీలో అబద్దాలకు ఆస్కారం లేదంటూనే ఆసాంతం అబద్దాలనే ప్రయోగించాడు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ వేదికగా ‘భడివె’ వంటి పరమ బూతు పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ రకమైన రేవంతు భాషను సభ్య సమాజం క్షమించదు. నాలుక కోస్తానంటూ హింసాత్మకమైన, నేర ప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడటం రేవంతు రాజకీయ నీచత్వానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి ఈ విధంగా అతి వికృతంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా యదేచ్చగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ గారు వారించకపోవడం అత్యంత దురదృష్టకరం. బిఆర్ఎస్ చేసిన న్యాయపోరాటం ఫలితంగా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పై ఎన్జీటీ స్టే ఇస్తే, అది తన ఘనకార్యంగా రేవంతు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెసే తెచ్చిందనడం రేవంత్ పిచ్చిప్రేలాపన తప్ప మరొకటి కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంవో నోట్ ఇస్తే, 2014 ఎన్నికల సమయంలో డీపీఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిది. డీపీఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికే 5ఏళ్లు చేసిన మీరా మా గురించి అవాకులు చెవాకులు పేలేది. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు భాగం పంచుకోని రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ రథ సారథి అయిన కేసీఆర్ గారి చిత్తశుద్ది గురించి ప్రశ్నించడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45టిఎంసీలకు తగ్గించిన మాట నిజమే అని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదు. నాడు నల్లగొండలో కేసీఆర్ గారు గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించం అంటూ తీర్మానం చేసారు. నేడు బిఆర్ఎస్ నిలదీస్తేనే పోలవరం నల్లమల్లసాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేసారు. ఈ తీర్మానాలు బిఆర్ఎస్ పోరాట ఫలితాలు. ఇరిగేషన్ విషయాల్లో రేవంతుకు బేసిక్ నాలెడ్జ్ లేదనే విషయం నేడు అసెంబ్లీ వేదికగా మరో సారి రుజువైంది. బిఆర్ఎస్ వరద జలాలపై స్టాండ్ తీసుకోవాల్సి ఉండే అని రేవంత్ రెడ్డి వాఖ్యానించడం పరమ అజ్నానం, అవివేకం. వరద జలాలపై స్టాండ్ తీసుకొని డిపిఆర్ ఇస్తే సిడబ్లుసి పరిశీలన కాదు కదా కనీసం స్వీకరించదు అనే ప్రాథమిక విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియక పోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోని అంశాలను సగం సగం చదువుతూ, వాక్యాలను వక్రీకరిస్తూ, సభను తప్పుదోవ పట్టించిన సీఎం చవకబారు ఎత్తుగడకు తగిన సమాధానాన్ని రేపు తెలంగాణ భవన్ వేదికగా నేను ఇవ్వబోయే పీపీటీలో వివరిస్తాను. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తం చేసిన ఆరోపణలకు, చెప్పిన అబద్దాలకు తగిన సమాధానం పూర్తి సాక్ష్యాధారాలతో వివరిస్తాను, ముఖ్యమంత్రి పిట్ట కథలను, ఉత్తం కట్టు కథలను మీడియా సాక్షిగా తిప్పికొడుతాం. @TelanganaCMO #CongressFailedTelangana
29
227
3
794
21,910
Truth doesn’t shout, it simply appears, and every lie collapses. And today, the truth is crystal clear. The fact that Telangana’s GSDP tripled within a decade, as acknowledged by Former Britain PM Tony Blair, and the reality that Telangana was India’s fastest-growing economy, as affirmed by Former RBI Governor Dr. Duvvuri Subbarao, have shattered every lie propagated by Revanth Reddy and the Congress. No amount of PR, rhetoric, or manufactured narratives can hide what Telangana achieved under KCR’s leadership. Jai Telangana! Jai KCR! @revanth_anumula @TelanganaCMO @GlobalSummitTG #CongressFailedTelangana
54
275
7
1,030
16,484
ఇటీవల మా తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఆప్యాయంగా గుండెలకు హద్దుకొని ధైర్యం చెప్పారు.. @BRSparty @KCRBRSPresident
19
210
4,033
మా నాన్న సత్యనారాయణ రావు గారు స్వర్గస్థులైన సందర్భంలో, శోకసంద్రంలో ఉన్న మా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, కష్ట సమయంలో అండగా నిలిచిన ఆప్తులు, బంధువులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలకు.. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻
101
196
6
2,183
66,020
రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంతు సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు? సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదు? 'అల్లరి చేయొద్దు’ అని ఆర్థిక మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రి కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయి? ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే 'నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు' అని చెప్పిన ముఖ్యమంత్రి లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నాడు? ఫ్యూచర్ సిటీకి 20వేల కోట్ల టెండర్లు.. ఒకవైపు కాళేశ్వరం కూలింది అంటూనే మల్లన్న సాగర్ నుంచి మూసిలో గోదావరి నీళ్లు పోసేందుకు 7000 కోట్ల టెండర్లు.. జిహెచ్ఎంసిలో హై లెవెల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు మరో ఏడు వేల కోట్ల టెండర్లు. ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల రోడ్డు కోసం 5 వేల కోట్ల టెండర్లు. హెచ్ఎండిఏ లో 10,000 కోట్ల టెండర్లు. ఆర్ అండ్ బి లో 16 వేల కోట్ల టెండర్లు. గురుకులాలను గాలికి వదిలి, 25 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4400 కోట్ల టెండర్లు. మూసి సుందరీకిరణకు లక్ష యాభై వేల కోట్ల టెండర్లు.. కమిషన్లు దండుకునేందుకు రెండున్నర లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్న రేవంత్ రెడ్డి.. విద్యార్థుల చదువు పట్ల నీకు శ్రద్ధ లేదా? విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా? ఫీజు రియంబర్స్మెంట్ విషయమై @BRSparty అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని, ఏ ఏడాదికి ఆ ఏడాది క్లియర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం సిగ్గులేకుండా మాట తప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్ధిక మాంద్యాల్లోనూ ఫీజు రీయింబర్సు మెంటు ఆపలేదు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ గారి పాలనలో 20 వేల కోట్లు ఫీజు రీయింబర్సు మెంటు చెల్లించారు. కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. పెద్దమొత్తంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యాసంస్థలు నడిపించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో సగానికి సగం జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. బిల్లులు కట్టక పోవడంతో కరెంట్, వాటర్ కనెక్షన్లు కట్ చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు ముఖం చాటేస్తున్నాయి. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మరోవైపు ఫీజు బకాయిలు పేరుకు పోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చింది. చేతగాని విధానాల వల్ల రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు పెరిగారు అని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం మాట్లాడారు. వాస్తవం ఏమిటంటే.. యూడైస్ రిపోర్ట్ ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 47 వేల మంది పిల్లలు తగ్గారు. ఒకవైపు కేసీఆర్ పై కక్షతో గురుకులాలను, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఉన్నత విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి వచ్చినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమిషన్లు పొందడంపై ఉన్న చిత్తశుద్ధి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం పై లేదు. ఈ ప్రభుత్వానికి కమిషన్లు దండుకోవడంపై ఉన్న ధ్యాస, విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు పై లేదు. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ చేష్టలు అడిగి చూస్తుండడం దారుణం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి? గ్రీన్ చానెల్ లో నిధుల విడుదల అన్న మీ మాటలు నీటి మూటలేనా @revanth_anumula ? అతి తక్కువ కాలంలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన విద్యా శాఖ మంత్రి, ముఖ్య మంత్రిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 1/2
206
127
2
549
17,872