C.Basheer (@CBasheer3) profile picture

|Asst Chief Photogra| Since 1987 | Working with EENADU | | My Camera = Your window to the world | | Telanganite By Birth | Keralian By Blood | Indian By Pride

Joined April 2020
Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)Photo by C.Basheer (@CBasheer3)
ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్‌ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా... లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యువు కేకను కూడా వినిపించకుండా ప్రాణాలను కబళించే మాయా తెరగా మారుతున్నాయా? నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా, ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా? ఒక్కసారి ఆలోచించండి. రైల్వే ట్రాక్ పక్కన బాహ్య ప్రపంచపు స్పృహే లేకుండా ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు క్షణాల వ్యవధిలో ఢీకొట్టిన ఈ హృదయ విదారక దృశ్యం ఎవరి గుండెలనైనా బరువెక్కించక మానదు. హైదరాబాద్ బొల్లారం సమీపంలో ఇటీవల జరిగిందీ ప్రమాదం. క్షణకాలం ఏమరుపాటు, మితిమీరిన అజాగ్రత్త బతికుండగానే నిండు జీవితాన్ని ఎలా ముగింపునకు తెస్తుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. చెవుల్లో దూరిన ఆ పరికరాలు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచేసి, సమీపిస్తున్న ప్రమాద ఘంటికలను సైతం వినిపించకుండా చేస్తున్నాయి. భీకరమైన శబ్దంతో రైలు దూసుకొస్తున్నా, హారన్ మోగుతున్నా గ్రహించలేనంతగా పరధ్యానంలో మునిగిపోవడం తీవ్ర విషాదాలకు దారితీస్తోంది. ఇది కేవలం రైల్వే ట్రాక్‌ల వద్దే కాదు, రోడ్లపై వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా నిత్యం ప్రాణాల మీదకు తెస్తున్న భయానక వాస్తవం. బైక్‌లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్‌ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల పరిసరాల స్పృహ కోల్పోయి, వెనుక వచ్చే వాహనాల హారన్లు గానీ, అత్యవసర అంబులెన్స్ సైరన్లు గానీ వినబడక తమ ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతున్నారు. నిజానికి ఈ సృష్టిలో ప్రాణానికి మించిన అత్యవసరమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు, అలాగే జీవితాన్ని మించిన వినోదమూ మరొకటి లేదు. మీరు మాట్లాడుతున్న ఫోన్ కాల్‌ను కాసేపు ఆపవచ్చు, వింటున్న పాటను తర్వాతైనా వినవచ్చు, కానీ ఆ క్షణిక నిర్లక్ష్యానికి ఒక్కసారి ప్రాణం గాల్లో కలిసిపోతే ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు. ఆ తర్వాత మీ కుటుంబానికి మిగిలేది జీవితాంతం తీరని శోకం, అంతులేని వేదన మాత్రమే. ముఖ్యంగా యువత ఈ భ్రమల నుంచి తక్షణమే బయటకు రావాలి. రోడ్లపై నడుస్తున్నప్పుడు అయినా, వాహనాలు నడుపుతున్నప్పుడు అయినా, రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్నప్పుడు అయినా ఇయర్‌ఫోన్లు వాడే ప్రాణాంతక అలవాటును తక్షణమే మానుకోవాలి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు అనేవి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలు తప్ప అలసత్వానికి తావిచ్చే వేదికలు కావు. కాస్త ఆలోచించండి, బాధ్యతగా మెలగండి, నిండు ప్రాణాలను నిర్లక్ష్యానికి బలివ్వకండి, మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి. Disclaimer: This video is shared strictly for public awareness and safety, not to cause distress. #SafetyFirst #RoadSafety #RailwaySafety #HyderabadCityPolice
24
69
3
314
79,993
ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ది హిందూ పూర్వ ఎడిటర్ ఇండియన్ మీడియా దిగ్గజం శ్రీ N రామ్ గారితో నేను మా మనవడు హంజా 📸నగర గోపాల్
52
C.Basheer retweeted
Pl spread this far and wide to whom ever you know . Due to the ongoing works on flyovers and underpasses around KBR park , the one way system will be implemented from tomorrow onwards to make the movement of vehicles smoother . It’ll take some time to settle . Take alternate routes and Pl cooperate with the police and traffic staff on duty 🙏🏻 @TelanganaDGP @TelanganaCOPs @CPHydCity @HYDTP
One-Way Traffic System Around KBR Park To expedite the ongoing construction works under the prestigious H-CITI project in Hyderabad, a one-way traffic system is being implemented around KBR Park. 📅 Effective from: 18 August 2026 ⏰ From: 6:00 AM onwards A 360-degree one-way traffic system will be implemented around KBR Park. Guidelines for Motorists Follow the designated traffic routes and lane markings. Observe and follow the signage boards installed along the routes. Change lanes only at designated points. Use the prescribed routes and free-left facilities wherever available. Do not drive on the wrong side of the road. Avoid overspeeding, particularly during late-night and early-morning hours when traffic is relatively light. Follow all traffic rules and cooperate with traffic police personnel on duty. D. Joel Davis, IPS, Joint Commissioner of Police, Traffic, Hyderabad, appealed to motorists to cooperate with the traffic police and follow the temporary traffic arrangements. Follow the designated route. Follow the rules. Reach your destination safely. #KBRRouteGuide #KBROneWay #HyderabadTraffic #RoadSafety #DriveSafe @hydcitypolice @CYBTRAFFIC @TelanganaDGP @CPHydCity @SajjanarVC_IPS
15
63
179
21,992
త్యాగానికి సజీవ రూపం... అమ్మ! సృష్టికి మూలం అమ్మ... నవమాసాలు తన గర్భంలో మోసి ఊపిరి పోయడమే కాదు, తన ఆకలిని, నిద్రను, ఆరోగ్యాన్ని, చివరికి తన సర్వస్వాన్ని త్యాగం చేసి బిడ్డల భవిష్యత్తు కోసం కరిగిపోయే అమృతమూర్తి అమ్మ! పుట్టుకలోనే కాదు... తన శారీరక రూపాన్ని, అవయవాలనూ ధారపోసి మరో ప్రాణానికి మరుజన్మ ప్రసాదిస్తున్న ప్రత్యక్ష దైవం అమ్మ! ఇటీవల వెలువడిన అధ్యయనాల ప్రకారం... మనదేశంలో అవయవ దాతల్లో 80 శాతానికి పైగా అమ్మలే ఉండటం వారి అనంతమైన ప్రేమకు, నిస్వార్థ త్యాగానికి సజీవ నిదర్శనం. అవయవ వైఫల్య బాధితుల్లో స్త్రీ, పురుషులు సమాన సంఖ్యలో ఉన్నప్పటికీ... ప్రాణాలు నిలబెట్టే అవయవదానం దగ్గరకు వచ్చేసరికి మన అమ్మలే ముందంజలో ఉన్నారు. కానీ విచారకరమైన విషయమేమిటంటే... తమకు అనారోగ్యం వచ్చి అవయవ మార్పిడి అవసరమైనప్పుడు మాత్రం మహిళలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ సామాజిక అసమానతపై సమాజంగా మనమందరం తీవ్రంగా ఆలోచించాలి. రాబోయే 2040 నాటికి దేశంలో ఏటా దాదాపు 4.63 లక్షల మందికి అవయవ మార్పిడి అవసరమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ‘జీవన్ దాన్’ ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నా... బ్రెయిన్ డెడ్ దానాలపై ప్రజల్లో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు ఇంకా పూర్తిగా తొలగిపోవాల్సి ఉంది. జన్మనిచ్చిన అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం... కానీ ఆమె చూపిన త్యాగనిరతిని స్ఫూర్తిగా తీసుకుని, అవయవ దానానికి ముందుకు రావడమే మనం ఆమె ప్రేమకు ఇచ్చే నిజమైన గౌరవం! అపోహలు వీడదాం... అవయవ దానంతో మరొకరి జీవితంలో వెలుగులు నింపుదాం! ఒకరి ప్రాణాన్ని నిలబెట్టే ఈ పవిత్రమైన మహోద్యమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదాం! #OrganDonation #MotherLove #MothersSacrifice #Jeevandan #SaveLives #OrganDonor
8
22
83
8,363
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?! రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే. కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు. మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి? చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా? తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి.
179
599
51
2,297
253,311
A much needed "safe step" !
1
3
12
1,235
ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులందరికీ ఒక ముఖ్య గమనిక. బ్రేక్ డౌన్ వంటి అనివార్య కారణాలు మినహా, ఓఆర్ఆర్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నిలపవద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఆపాల్సి వస్తే, తక్షణమే 14449 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించి, తగిన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాకే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్‌లో నిలపాలి. ఈ జాగ్రత్తలు కేవలం ఓఆర్ఆర్ కే పరిమితం కాదని గుర్తించాలి. ఏ జాతీయ రహదారి (National Highway) పై ప్రయాణించేటప్పుడైనా ఈ నియమాలను విధిగా పాటించడం అత్యంత కీలకం. ప్రతి సంస్థ కూడా తమ డ్రైవర్లకు, సిబ్బందికి ఈ భద్రతా ప్రోటోకాల్స్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఘోర రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మనమందరం బాధ్యతగా కృషి చేయాలి. ప్రమాదాల నియంత్రణలో పోలీసులకు సహకరించి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవాలని కోరుతున్నాను. నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. మీ భద్రతే మా బాధ్యత. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
Deeply concerned about the accidents on the Outer Ring Road (ORR). I appeal to all commuters to strictly avoid stopping your vehicles on the ORR unless it is an emergency like a breakdown. In such unavoidable situations, please call the ORR Helpline at 14449 immediately for safety assistance before moving to the extreme left lane. It is important to remember that these precautions are not limited to the ORR alone; they must be strictly followed while traveling on any National Highway. I also urge every organisation to sensitize their drivers and employees regarding these safety protocols. Together, we must strive to prevent fatal road accidents. I request your full support in our mission to curb road accidents and save lives. Such acts will not only attract heavy penalties but are also life-threatening. Let’s prioritise safety above all.
12
44
133
18,164
ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.. మార్కులు జీవితాన్ని శాసించలేవు!! పదవ తరగతి ప‌రీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నాదొక విన్నపం. ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావు, మీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించండి. ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు, అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి... మీ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయకండి. ఫలితం ఏదైనా సరే, మీ పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు మీకు అత్యంత ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించండి; వారు ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పండి. అవసరమైతే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టండి. ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించాలి. చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దు. పరీక్షల కంటే ప్రాణం గొప్పది, మీ వెనుక ఒక కుటుంబం ఉందని, మీ కోసం వారు తపిస్తున్నారని ఆలోచించండి. ఏ చిన్న ఆందోళన కలిగినా మీ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో పంచుకోండి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. @hydcitypolice @CPHydCity @SajjanarOffice @TelanganaCMO @TelanganaDGP @TelanganaCOPs #10thResults #StudentSafety #MentalHealth
39
145
3
714
20,959
తెలంగాణ డిజిపిగా సివి ఆనంద్ ఐపీఎస్ అభినందనలు సర్ 💐💐💐 @TelanganaCOPs @CVAnandIPS
1
2
37
గత నెల రోజులకు పైగా నిత్యం వేల లీటర్ల త్రాగునీరు వృధాగా రోడ్లపై పారుతుంది..మీకు 10 రోజుల 😔26/04/2026 అర్ధరాత్రి 12-30కు @MDHMWSSB @hmwssbgmom15 @HMWSSBOnline
2
1
1
232
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులూ అప్రమత్తం! ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరం. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని ఒంటరితనానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయి. అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వండి. వారు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచండి. ముఖ్యంగా పరీక్షల ఫలితాల విషయంలో వారికి కొండంత భరోసానిస్తూ, వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయండి. మీ అప్రమత్తతే మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష!
15
85
3
285
17,780
#SayNoToBetting As the IPL season begins, we urge everyone to enjoy cricket only as a sport. Do not ruin your life by falling into the trap of betting. In the past, the government banned hundreds of betting apps. However, betting has now taken new forms through social media platforms like Telegram, WhatsApp, and Instagram. We will take strict action against social media influencers who promote these dangerous apps just for money. Our teams are also keeping a close watch on offline betting happening in farmhouses and secret locations. Betting leads to heavy debts and destroys families. Do not put your family’s future at risk. If you know anyone involved in betting, please report it immediately: 📞 Dial: 100 📱 WhatsApp: 94906 16555 @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign
#SayNoToBetting బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు! ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign
10
64
3
211
19,262
#SayNoToBetting బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు! ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign
46
186
12
690
58,111
There is no shortage of fuel or LPG cylinders in #Hyderabad. Adequate stocks are available and supply is running smoothly across the city. Citizens are requested not to panic or rush to fuel stations, as such actions may lead to unnecessary congestion and disruption. Hyderabad City Police is closely monitoring the situation in coordination with all concerned departments. We urge everyone to remain calm, avoid spreading or believing in rumours, and cooperate with authorities to ensure normalcy is maintained. @TelanganaDGP
340
624
109
4,255
630,223
C.Basheer retweeted
తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ===================== హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలాబ్ గూర్, పటాన్‌చెరులో 25 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో, అమీన్‌పూర్ ఎక్స్‌రోడ్ నుండి మాదీనగూడ వరకు పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీలను అరికట్టి, అవసరమైన చోట్ల ఎంఎస్ బ్యారెల్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ పనులను తేది.11.02.2026, బుధవారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అన‌గా తేది.12.02.2026, గురువారం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు చేప‌ట్ట‌నున్నారు. కావున ఈ 40 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుంది. అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు: ----------------------------- 1. ఓ అండ్ ఎం డివిజ‌న్ 17: ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్. 2. ఓ అండ్ ఎం డివిజ‌న్ 22: బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ. 3. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు. 4. ఓ అండ్ ఎం డివిజ‌న్ 6: ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్. 5. ఓ అండ్ ఎం డివిజ‌న్ 9: కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ కాబ‌ట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోర‌డ‌మైనది.
2
8
20
4,931
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జర భద్రం! "హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అంటూ వీడియో కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త! పోలీస్ యూనిఫారం, వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ చూసి దడ పుట్టేలా బెదిరిస్తరు. వీడియో కాల్ కట్ చేయొద్దని హుకూం జారీ చేస్తరు. ఇదంతా సైబర్ గాళ్ల మాయాజాలం. చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనేదే లేదు.. ఇదంతా ఉట్టి భ్రమ. ఆ కాల్స్ నమ్మి ఆగమాగం కాకండి.. డబ్బులు పోగొట్టుకోకండి. డౌట్ వస్తే వెంటనే 1930కి కాల్ కొట్టండి. @Cyberdost @hydcitypolice @CyberCrimeshyd
13
58
1
185
8,646
నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్‌ఆర్‌టీసీ, సైబరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గానూ నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఒక్కటే. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం అనేకసార్లు చూశా. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం. ఇది చర్చలకు తావులేని వారి హక్కు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. రేపు మీ పిల్లలకు పాఠం అవుతుంది. నేడు మీరు ఏది విత్తుతారో.. వృద్ధాప్యంలో అదే కోసుకుంటారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడంలేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుంది. మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చు. @hydcitypolice @CPHydCity
79
99
9
435
16,542
Beatiful October Sky #Octobersky
1
2
1
6
301