Joined April 2017
పెద్దపల్లి,2026 అక్టోబర్ 27: ---------------------------------------- *ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *పెండింగ్‌లో ఉన్న ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ల పనులను నవంబర్‌లోగా పూర్తి చేయాలి* *ఎల్‌నినో నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి* --------------------------------------- జిల్లాలో వీబీ జీ రామ్ జీ పథకం అమలు తీరుపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వీబీ జీ రామ్ జీ పథకం అమలుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* వీబీ జీ రామ్ జీ పథకం కింద ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఎల్‌నినో నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, నీటి లీకేజీలను అరికట్టి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
195
ధర్మారం, అక్టోబర్ 27: ---------------------------------------- *చామనపల్లి గ్రామం మొత్తానికి భూసేకరణ, పునరావాసం కల్పిస్తాం – రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్* *ప్రజలకు ఇచ్చిన హామీ* *మేరకు గ్రామం మొత్తానికి* *భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం* *7 రోజుల్లో సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తి.. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు* *ప్రతి ఇంటి నిర్మాణం, చెట్లు, బావులు, ఇతర ఆస్తుల వివరాలతో అంచనాలు* *3 నుంచి 4 నెలల్లో భూసేకరణ, పరిహారం, పునరావాస ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు* *ప్రజలకు నిబంధనలపై అవగాహన కల్పించి, మానవతా దృక్పథంతో ప్రక్రియ పూర్తి చేయాలి* ------------------------------------------- చామనపల్లి గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం, పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ అమలు చేస్తామని *రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్* తెలిపారు. మంగళవారం ధర్మారం మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో* కలిసి నిర్వహించిన గ్రామసభలో *మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,* గత అనేక సంవత్సరాలుగా భారీ వర్షాలు కురిసినప్పుడు, నీటిని ఎత్తిపోసే సమయంలో చామనపల్లి గ్రామ ప్రజలు ముంపు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. 2006లో ధర్మారం మండలం నుంచి జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ఈ ప్రాంతంలోని గ్రామాలతో తనకు సుమారు 25 సంవత్సరాల అనుబంధం ఉందని పేర్కొన్నారు. సాధారణంగా నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్‌) నుంచి 100 మీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, చామనపల్లి గ్రామ ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని తొలిసారిగా ఆ పరిమితికి మించి గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* కాళేశ్వరం ప్రాజెక్టు బలోపేతంలో భాగంగా నంది మేడారం చెరువు బలోపేతం చేపట్టిన నేపథ్యంలో చామనపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామానికి భూసేకరణ చేపట్టి పునరావాసం కల్పించాలని కోరారని తెలిపారు.ఈ అంశాన్ని పరిశీలించేందుకు 2023లో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. ఎఫ్‌టీఎల్‌ నుంచి 100 మీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి పునరావాసం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం చామనపల్లి గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని ఆదేశించిందని స్పష్టం చేశారు. ఈ గ్రామసభలో , ఆర్డీవో బి. గంగయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, తహసీల్దార్‌ శ్రీనివాస్, సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
185
రామగుండం, 2026 అక్టోబర్ 27: ------------------------------------------------ *రెండు వారాల్లో రోడ్డు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తాగునీటి పైప్‌లైన్లను తరలించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* *పెండింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *రామగుండంలో మసీదు చౌరస్తా నుంచి లింగాపూర్ రోడ్డు వరకు నిర్మాణ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్* ------------------------------------------ రామగుండంలో మసీదు చౌరస్తా నుంచి లింగాపూర్ రోడ్డు వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తాగునీటి పైప్‌లైన్లను రెండు వారాల్లో తరలించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* రామగుండంలోని మసీదు చౌరస్తా వద్ద జయగుతున్న రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకంగా ఉన్న తాగునీటి పైప్‌లైన్లు, విద్యుత్ జెన్‌కో స్తంభాలు, డిస్కం విద్యుత్ స్తంభాల తరలింపు పనులను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా పనులను సమన్వయంతో చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1
337
పెద్దపల్లి, 2026 అక్టోబర్ 26: ----------------------------------------- *యువతకు నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం – ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు* *పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.70 కోట్లు ఖర్చు* *టాస్క్ కేంద్రం ద్వారా గత ఏడాదిన్నరలో 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు* *ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, పరీక్షా ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు* *విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి* *ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.27 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల రెనోవేషన్ పనులను, రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన టాస్క్ (TASK) ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్* ------------------------------------------ జిల్లాలోని యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని *ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు* అన్నారు. సోమవారం *పెద్దపల్లిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో* కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *రూ.27 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల రెనోవేషన్ పనులను, రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన టాస్క్ (TASK) ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు.* ఈ సందర్భంగా *ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు మాట్లాడుతూ,* జిల్లాలోని యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లిలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన అనేక మంది యువత ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. టాస్క్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు, సాధించిన పురోగతికి సంబంధించిన వివరాలతో వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. పాఠశాలల పునరుద్ధరణ, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నామని, పెద్దపల్లి మండలంలోనే సుమారు రూ.14 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* విద్యారంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పరీక్షా ఫలితాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి.కల్పన, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, అధ్యాపకులు తదితరులు, పాల్గొన్నారు.
1
1
5
432
పెద్దపల్లి,2026, అక్టోబర్ -26: ------------------------------------------- *మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ------------------------------------------- మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఆదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తో కలిసి* పాల్గొన్నారు. శ్రీ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్ పేర్కొన్నారు. *రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారని అన్నారు* మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని కలెక్టర్ తెలిపారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణం తో ముడీబడి ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని పండగగా జరుపుకోవడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం. రవీందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాష్ , బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
4
390
పెద్దపల్లి, 2026, అక్టోబర్ 26: ------------------------------------------ *అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* **ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్* ------------------------------------------- అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ,అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామం సర్పంచ్ గోగు రాజయ్య సర్వే నెంబర్ 390 మట్టి తవ్వకాలు రవణాకు సంబంధించి అనుమతులు లీజు పరిమితి అంశాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సమర్పించగా ఏడి మైన్స్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన గుర్రం రామస్వామి సర్వేనెంబర్ 83,83/సి1, 83/సి3 లో తనకు వ్యవసాయ భూమి ఎకరం 35 గుంటలు ఉందని, తనకు పాస్ పుస్తకం ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ శ్రీరాంపూర్ కు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామానికి చెందిన చింతల చుక్కమ్మ తన పేరు మీద ఉన్న ఇంట్లోని ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని దొంగ పట్టా చేయించుకోవడానికి చూస్తున్న గుజ్జుల నారాయణరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ సుల్తానాబాద్ కు. రాస్తూ విచారించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన మామిడి రామ్ కి గృహ జ్యోతి పథకం తన కుటుంబానికి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా శ్రీరాంపూర్ ఎంపీడీవో కు రాస్తూ పరిశీలించి అర్హత ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో బి. ప్రకాష్ సంబంధిత జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
1
409
పెద్దపల్లి 2026 అక్టోబర్-26: -------------------------------------------- *సర్ ప్రక్రియలో ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి* *అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి* *పెండింగ్‌లో ఉన్న నోటీసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలి* *భౌతిక, ఆన్‌లైన్ రికార్డులు, ఆధారాలను భద్రంగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి* ------------------------------------------- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు* తో కలిసి సంబంధిత అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,* ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా, పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎదైన సమాచారం అడిగిన వెంటనే వివరాలు అందించేందుకు అవసరమైన రికార్డులు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్లను చేర్చడానికి లేదా తొలగించడానికి సంబంధించి తగిన ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలను తప్పనిసరిగా భద్రపరచాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, మిగిలి ఉన్న సుమారు 4.50 లక్షల పెండింగ్ పనులను రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో, ఈ వారం చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఐఆర్ నోటీసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసి, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని ఆదేశించారు. అనర్హులుగా గుర్తించిన దరఖాస్తులకు సంబంధించి సరైన కారణాలు, తగిన డాక్యుమెంట్లు, ఆధారాలను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించగా, వాటిలో 44 వేల దరఖాస్తుల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చినట్లు తెలిపారు. అనర్హతకు సంబంధించిన ఆధారాలను రాజకీయ పార్టీలు, ఆర్‌టీఐ దరఖాస్తుదారులు లేదా ఇతరులు కోరినప్పుడు అందించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఫారం-6 , 7 & 8దరఖాస్తుల పరిశీలనతో పాటు పెండింగ్ పనులను నవంబర్ 5వ తేదీ నాటికి పరిష్కరించాలని సూచించారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఆధారాలను సక్రమంగా భద్రపరచాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఈ.ఆర్.ఓ., బి.ఎల్.ఓ. స్థాయిల్లో అన్ని రికార్డులు, డాక్యుమెంట్లను భౌతికంగా, ఆన్‌లైన్‌లో భద్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు సక్రమంగా నమోదయ్యేలా, అనర్హుల పేర్ల తొలగింపునకు సంబంధించి నిబంధనల ప్రకారం తగిన ఆధారాలు ఉండేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ,ఆర్.డి.ఓ.లు గంగయ్య , సురేష్, ఈ సెక్షన్ సూపర్డెంట్ విజయ్,తదితరులు పాల్గొన్నారు.
4
382
పెద్దపల్లి, 2026 అక్టోబర్ 24: ------------------------------------------: *రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు* *పీఎం రాహత్ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స* *పథకం అమలుకు అన్ని ఆసుపత్రులు తప్పనిసరిగా నమోదు కావాలి* *ఈ-డీఏఆర్ పోర్టల్‌లో ప్రతి ప్రమాద కేసు నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి* *ప్రతి ఆరోగ్యశ్రీ ఆసుపత్రి, సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వివరాలను మ్యాపింగ్ చేయాలి* *పీఎం రాహత్ పథకం సమర్థవంతమైన అమలుతో ఏటా రూ.100 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ నిధుల ఆదా* ------------------------------------------ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో వైద్య చికిత్స అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రమాద బాధితులకు చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా సమీపంలోని ఆసుపత్రుల్లో తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స పథకం-2025 కింద పీఎం రాహత్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి పాల్గొన్నారు. పీఎం రాహత్ పథకం అమలు విధానం, ఆసుపత్రుల్లో బాధితులకు వైద్య సేవలు అందించే ప్రక్రియ, ప్రమాద వివరాల నమోదు, క్లెయిమ్‌ల ఆమోదం, నిధుల విడుదల తదితర అంశాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. *రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు మాట్లాడుతూ,* రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి వైద్య చికిత్స అందించడం అత్యంత కీలకమని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో తగిన చికిత్స అందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రమాద బాధితులను చికిత్స ఖర్చుల గురించి ఆలోచించకుండా సమీపంలోని ప్రభుత్వ లేదా పథకం పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. పీఎం రాహత్ పథకం కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వరకు చికిత్స ఖర్చును నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ పథకం కింద చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల సంఖ్య తక్కువగా ఉందని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పథకం ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
1
3
590
పెద్దపల్లి, అక్టోబర్-24: -------------------------------------------- *యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యత.. జిల్లా వారసత్వ సంపద పరిరక్షణకు కృషి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *అగ్నివీర్, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థుల కోసం అక్టోబర్ 31న ఉచిత వైద్య శిబిరం* *నవంబర్ 1న సీతమ్మలోద్ది ట్రెక్కింగ్.. ఇప్పటికే 250 మంది రన్నర్స్, వాకర్స్ నమోదు* *యువతలో ఫిట్‌నెస్‌, చారిత్రక వారసత్వ పరిరక్షణపై అవగాహన కల్పించాలి* *మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి* *రెండు కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్* ----------------------------------------- పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు, జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* పేర్కొన్నారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, సైన్యం, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అభ్యర్థులకు అవసరమైన సన్నద్ధత కల్పించడం, జిల్లాలోని చారిత్రక ప్రదేశాల విశిష్టతను ప్రజలకు తెలియజేయడం వంటి లక్ష్యాలతో చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని (ఐడీఓసీ) తన ఛాంబర్‌లో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అగ్నివీర్, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థుల కోసం నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం, *“మన జిల్లా – మన ఖిల్లా”* కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న *సీతమ్మలోద్ది* ట్రెక్కింగ్‌కు సంబంధించిన రెండు పోస్టర్లను ఆవిష్కరించారు. *అగ్నివీర్, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థులకు ఉచిత వైద్య శిబిరం* అగ్నివీర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులతో పాటు ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థులకు ప్రయోజనం కల్పించేలా యువశక్తి – పెద్దపల్లి ఆధ్వర్యంలో అక్టోబర్ 31న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. రన్నింగ్, ఇతర శారీరక పరీక్షల అనంతరం నిర్వహించే వైద్య పరీక్షల్లో చిన్నపాటి ఆరోగ్య సమస్యల కారణంగా అభ్యర్థులు అనర్హులు కాకుండా, ముందుగానే లోపాలను గుర్తించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స పొందేందుకు ఈ శిబిరం దోహదపడనుంది. భారత సైన్యం, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు, శిబిరంలో పాల్గొనదలచిన అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం 7780543055, 9182691655 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. *నవంబర్ 1న సీతమ్మలోద్ది ట్రెక్కింగ్* జిల్లాలోని చారిత్రక, ప్రకృతి ప్రదేశాల విశిష్టతను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు యువతలో ఫిట్‌నెస్‌, పర్యావరణ పరిరక్షణపై ఆసక్తిని పెంపొందించేందుకు “మన జిల్లా – మన ఖిల్లా” కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1న సీతమ్మలోద్ది ప్రాంతంలో ట్రెక్కింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 250 మంది రన్నర్స్, వాకర్స్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సీతమ్మలోద్ది ప్రాంతంలో సుమారు 1,000 నుంచి 1,200 సంవత్సరాల నాటి ప్రాచీన చిత్రాలు కలిగిన గుహలు, ఆదిమానవుల జీవన ఆనవాళ్లు ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకతగా నిలుస్తోంది. ట్రెక్కింగ్‌లో భాగంగా పిడుగుతొర్ర, భీమన్న దేవాలయం వంటి చారిత్రక, ప్రకృతి ప్రదేశాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, మన జిల్లా చరిత్ర, వారసత్వ సంపదను ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యువతతో పాటు ప్రజలు చారిత్రక ప్రదేశాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం సీతమ్మలోద్ది ట్రెక్కింగ్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించనున్నారు. “YES FOR LIFE – SAY NO TO DRUGS” నినాదంతో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.ఓ. ప్రవీణ్ రెడ్డి,మాజీ సైనికుడు, అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి, ఫొటోగ్రాఫర్లు రవీందర్ రెడ్డి, శీలం అనిల్, తదితరులు పాల్గొన్నారు.
1
5
549
పెద్దపల్లి, 2026 అక్టోబర్ 24: ---------------------------------------- *భూ రీసర్వే మొదటి దశ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి – సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్* *మొదటి దశలో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి* *అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసి సర్వే పనుల్లో వేగం పెంచాలి* *క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలి* *సర్వేకు అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతిక సదుపాయాలను సమకూర్చుకోవాలి* *గ్రామాల వారీగా పురోగతిని పర్యవేక్షిస్తూ పారదర్శకంగా భూ రీసర్వే పూర్తి చేయాలి* ---------------------------------------- భూ రీసర్వే మొదటి దశ పనులను వేగవంతం చేసి, ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూ రీసర్వే పనుల పురోగతిపై సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు* తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా *సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ,* భూ రీసర్వే మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో సర్వే పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్వే పనులకు అవసరమైన ప్రణాళిక రూపొందించుకొని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. భూ రీసర్వే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన సిబ్బంది, సాంకేతిక వనరులు, యంత్ర పరికరాలను సమకూర్చుకొని నిర్ణీత లక్ష్యాలను సాధించాలని సూచించారు. *అదనపు బృందాలను ఏర్పాటు చేసి సర్వే పనుల్లో వేగం పెంచాలి* మొదటి దశలో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సీసీఎల్ఏ కమిషనర్ సూచించారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, పనుల పురోగతికి అనుగుణంగా బృందాలను కేటాయించాలని తెలిపారు. సర్వే సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందించి పనులు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల వారీగా సర్వే లక్ష్యాలను నిర్దేశించుకొని, ప్రతిరోజూ చేపట్టిన పనులు, మిగిలి ఉన్న పనుల వివరాలను సమీక్షించాలని సూచించారు. సర్వే పనుల్లో వెనుకబడిన గ్రామాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక దృష్టి సారించి పనుల వేగం పెంచాలని తెలిపారు. సిబ్బంది కొరత లేదా ఇతర కారణాలతో పనులు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. *క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించాలి* భూ రీసర్వే సమయంలో ఎదురయ్యే స్థానిక సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని త్వరితగతిన పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ ఆదేశించారు. భూ సరిహద్దులకు సంబంధించిన సమస్యలు, భూ రికార్డుల్లో వ్యత్యాసాలు, ఇతర సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణకు ఆటంకాలు ఏర్పడకుండా రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అవసరమైన చోట సంబంధిత భూయజమానులకు సర్వే ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వాటి పరిష్కారానికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. *అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతిక సదుపాయాలను సమకూర్చుకోవాలి* భూ రీసర్వే పనులకు అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతిక పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను జిల్లా స్థాయిలో ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. సర్వే బృందాలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరికరాల కొరత కారణంగా పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని తెలిపారు. సర్వేలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సేకరించిన వివరాలు, భూ రికార్డుల మధ్య సరిపోలికను పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. *పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలి* జిల్లా కలెక్టర్లు భూ రీసర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన మార్గదర్శకాలు అందించాలని తెలిపారు. గ్రామాల వారీగా పనుల స్థితిగతులను సమీక్షిస్తూ, ఎదురయ్యే సమస్యలను జిల్లా స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. సర్వే పనుల నిర్వహణలో సంబంధిత అధికారులందరూ బాధ్యతతో వ్యవహరించి, మొదటి దశ పనులను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
1
1
7
648
మంథని, 2026 అక్టోబర్ 24: ---------------------------------------- *2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అవసరమైన అన్ని పనులు చేపట్టాలి – పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు* *మంథనిలోని ప్రముఖ ఆలయాల సందర్శన* *మంథని పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్ల పురోగతిని పరిశీలించిన పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్* ---------------------------------------- 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందస్తు ప్రణాళికతో అవసరమైన పనులన్నీ చేపట్టాలని పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం మంథనిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద పుష్కరాల ఏర్పాట్ల పురోగతిని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తో కలిసి పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా *పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు మాట్లాడుతూ,* పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా స్నానఘట్టాలు, రాకపోకల మార్గాలు, అవసరమైన ఇతర సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. చేపట్టాల్సిన పనులను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, అవసరమైన అనుమతులు పొందుతూ పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం *పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథనిలోని గౌతమేశ్వర స్వామి ఆలయం, ఓంకారేశ్వర స్వామి ఆలయం, సురబండేశ్వర స్వామి ఆలయం, మహాలక్ష్మి ఆలయం, లక్ష్మీనారాయణ ఆలయాలను సందర్శించారు. ఆలయాల పరిస్థితి, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించి, అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ , వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి,సీఈ దుర్గాప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ , తహసీల్దార్ ఆరిఫో ద్దీన్, ఈఓ రాజ్‌కుమార్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
366
పెద్దపల్లి, 2026 అక్టోబర్ 22: -------------------------------------------- **ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష** **సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్** **వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి.. మందులు, వైద్య పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలి** ----------------------------------------- ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు . గురువారం సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, మందుల నిల్వలు, వైద్య పరీక్షల నిర్వహణ, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు నిర్దేశించిన సమయానికి హాజరై, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని, రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. **మందులు, వైద్య పరీక్షల కిట్లు అందుబాటులో ఉండాలి** ఆసుపత్రిలో అవసరమైన మందుల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందస్తుగా తగిన నిల్వలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. మందుల వినియోగం, నిల్వల వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా, రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పరీక్షల కిట్లను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని, నిల్వలు తగ్గకముందే వాటిని సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. **ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి** ఆసుపత్రి ఆవరణ, రోగుల వేచిచూసే ప్రదేశాలు, వైద్య పరీక్షల గదులు, వార్డులు, శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా తొలగించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోగులకు అవసరమైన కనీస సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. **రోగులతో మర్యాదగా వ్యవహరించాలి** ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులతో వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. రోగుల సమస్యలను ఓపికగా విని, వారికి అందించే వైద్య సేవల గురించి స్పష్టంగా వివరించాలని తెలిపారు. రోగులకు వైద్య సేవల విషయంలో సరైన సమాచారం అందిస్తూ, వారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచాలని, ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ, లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత డాక్టర్ లు,తదితరులు, పాల్గొన్నారు.
6
777
పెద్దపల్లి, 2026 అక్టోబర్ - 22: -------------------------------------------- *పేదల పక్షాన నిలిచి పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న.... జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న* *సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు* -------------------------------------- పేద ప్రజల పక్షాన నిలిచి, అణగారిన వర్గాల కోసం పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని జిల్లా *కలెక్టర్ కోయ శ్రీహర్ష* అన్నారు. గురువారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* నిజాం పాలన కాలంలో ప్రజలను దోపిడీ చేస్తున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, అధికారులు, సంపన్నులకు వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాటం చేశారని తెలిపారు. పేద ప్రజలకు అండగా నిలిచి, సంపన్నుల వద్ద ఉన్న ఆస్తులను పేదలకు పంచిపెట్టినందుకు ఆయన తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. పండుగ సాయన్న కేవలం సంపన్నుల నుంచి ఆస్తులను తీసుకొని పేదలకు పంచిపెట్టడానికే పరిమితం కాకుండా, ఆనాటి నిజాం పాలనలోని అధికార వ్యవస్థను ప్రశ్నించి, అధికారులను ఎదిరించారని తెలిపారు. తనదైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నించారని వివరించారు. ఆధిపత్య శక్తులైన దేశ్‌ముఖ్‌లు, కరణాలు, పటేళ్లు, భూస్వాముల కుట్రల కారణంగా పండుగ సాయన్న నిజాం ప్రభుత్వ హయాంలో హత్యకు గురయ్యారని ఆయన చరిత్రను స్మరించుకున్నారు. ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న జీవితం, ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. పండుగ సాయన్న వీరోచిత పోరాట గాథను నేటికీ దర్శనం మొగులయ్య వంటి జానపద గాయకులు 12 మెట్ల కిన్నెరపై ఆలపిస్తూ ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ డిఓ రవీందర్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్,జిల్లా అధికారులు,సంబంధిత అధికారులు, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
1
1
459
పెద్దపల్లి , 2026 అక్టోబర్ 22: -------------------------------------- *రైస్ మిల్లుల బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *రెండు, మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం ఆస్తులు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలి* *డిఫాల్టర్ రైస్ మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించాలి* ------------------------------------- రైస్ మిల్లుల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో* కలిసి సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షే మాట్లాడుతూ,* బకాయిలు చెల్లించని డిఫాల్టర్ రైస్ మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించాలని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సంబంధిత రైస్ మిల్లుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, సంబంధిత రైస్ మిల్లర్లు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్,జిల్లా జిల్లా మేనేజర్ శ్రీకాంత్,డి.సి. ఓ.శ్రీమాల,ఆర్డీఓ గంగయ్య,సంబంధిత అధికారులు, తదితరులు,పాల్గొన్నారు.
1
484
కరీంనగర్, అక్టోబర్-17: -------------------------------------- *తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత.. యాసంగిలో వరి సాగు చేయవద్దు – ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా* *ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ప్రత్యేక అధికారి* -------------------------------------- సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ యాసంగి సీజన్‌లో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రానున్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. కరీంనగర్ సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు గరీమ అగర్వాల్, బి. సత్య ప్రసాద్, కోయ శ్రీహర్ష, చిత్ర మిశ్రాలతో కలిసి ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, నీటి సంరక్షణ, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లో అమృత్ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరాలు సమర్పించారు. *ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కామాట్లాడుతూ,* సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, కొత్తగా నీటి ప్రవాహాలు లేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల బోరు బావులు ఉండగా, వాటిలో 5 నుంచి 6 లక్షల వరకు పనిచేయని పరిస్థితి ఉందని, భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయని తెలిపారు. *పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో 863 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 5 శాతం తక్కువగా ఉందని తెలిపారు. సుల్తానాబాద్‌లో 33 శాతం, ఎలిగేడు మండలంలో 24 శాతం, జూలపల్లిలో 21 శాతం, మంథనిలో 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం ఉందని వివరించారు. ఖరీఫ్ సీజన్‌లో డ్రై స్పెల్స్ నమోదు కాకపోవడంతో జిల్లాలో ప్రస్తుతం కరువు పరిస్థితులు లేవని తెలిపారు.ప్రస్తుతం పంటల పరిస్థితి సాధారణంగా ఉందని, పంటలకు నీటి ఎద్దడి లేదా ఎండిపోయిన పరిస్థితులు లేవని తెలిపారు. సెప్టెంబర్ 2026 నాటికి సగటు భూగర్భ జలమట్టం 4.54 మీటర్ల లోతులో ఉందని, 12 మండలాల్లో భూగర్భ జలమట్టం ఐదు మీటర్ల లోపు ఉందని పేర్కొన్నారు.శ్రీరామసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 2,12,036 ఎకరాల ఆయకట్టులో ప్రస్తుత ఖరీఫ్ పంటల రక్షణకు సుమారు 60 శాతం ప్రాంతానికి నీరు అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో 18.17 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు.యాసంగి సీజన్‌లో నీటి వనరులు సరిపోని ప్రాంతాల్లో వరి సాగును పూర్తిగా తగ్గించి, తక్కువ నీటితో పండే మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయి అధికారులు తగిన పంటల ఎంపికపై మార్గదర్శకత్వం చేస్తున్నారని వివరించారు.వరి సాగును తగ్గించేందుకు విత్తన దుకాణాలు, డీలర్ల ద్వారా కూడా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచి వరి విత్తనాల లభ్యతను తగ్గించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యుత్ వినియోగం 72.68 మిలియన్ యూనిట్లు పెరిగిందని తెలిపారు. వ్యవసాయ సర్వీసులకు రోజుకు సగటున 11 గంటల పాటు త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ నెట్‌వర్క్ బలోపేతానికి 862 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 35 ఫీడర్లు, ఆరు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల అధికారులు, ఇతర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
1
5
805
పెద్దపల్లి, అక్టోబర్ 15: ------------------------------------------ *యాసంగిలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి* *పీపీసీలకు వచ్చే ధాన్యం, ప్రైవేటు మార్కెట్‌కు వెళ్లే ధాన్యం పరిమాణాన్ని అంచనా వేయాలి* *వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్* ---------------------------------------- యాసంగి సీజన్‌లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* యాసంగి సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని సాగు నిర్ణయాలు తీసుకోవాలని, అవసరమైతే పొలాలను బీడుగా ఉంచుకోవాలని తెలిపారు. వరి సాగుకు బదులుగా మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ కాలంలో దిగుబడి వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టాలను నివారించేందుకు, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి ముందస్తు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు (పీపీసీ) ఎంత పరిమాణంలో ధాన్యం వచ్చే అవకాశం ఉంది, ప్రైవేటు మార్కెట్‌కు ఎంత పరిమాణంలో వెళ్లే అవకాశం ఉందనే అంశాలపై స్పష్టమైన అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఈ వివరాల ఆధారంగా ధాన్యం సేకరణకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సరైన పంటల ఎంపికపై సూచనలు అందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
9
794
పెద్దపల్లి, 2026 అక్టోబర్ 14: ------------------------------------------- *జీవో 76 పెండింగ్ దరఖాస్తుల ధ్రువీకరణ 10 రోజుల్లోగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* *రామగుండం మండల పరిధిలో 1,583 పెండింగ్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి* *అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలి* *జీవో 76 దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్* -------------------------------------------- జీవో 76 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియను 10 రోజుల్లోగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ* తో కలిసి రెవెన్యూ శాఖ అధికారులతో జీవో 76 దరఖాస్తుల పరిష్కారంపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* జీవో 76కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం రామగుండం మండల పరిధిలో పెండింగ్‌లో ఉన్న 1,583 దరఖాస్తులను రెవెన్యూ ,మున్సిపల్, సింగరేణి అధికారులతో స్పెషల్ టీం ద్వారా త్వరితగతిన పరిశీలించి, అర్హులను ధ్రువీకరించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను రాబోయే 10 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులకు సంబంధించిన రికార్డులు, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం జరగకుండా, నిర్ణీత గడువులోగా ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. జీవో 76 కింద అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన వారికి ఇంటి పట్టాలు అందించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో బి. గంగయ్య, సింగరేణి ఆర్జీ-2 అధికారులు, ఆర్జీ-2 జనరల్ మేనేజర్, ఈ సెక్షన్ సూపర్డెంట్ విజయ్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
1
9
1,007
పెద్దపల్లి, 2026 అక్టోబర్ 14: ----------------------------------------- *ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* *ఉద్యోగుల హాజరును ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి* *పెండింగ్ కోర్టు కేసులు, ఆర్టీఐ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదులు, ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలి* *జిల్లా అధికారుల టూర్ డైరీలను ప్రతి నెలా సమర్పించాలి* --------------------------------------------- జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలని, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *అదనపు కలెక్టర్లు జే. అరుణశ్రీ, బి. శ్రీరాములుతో* కలిసి వివిధ పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సమయానికి విధులకు హాజరుకావాలని, ఉద్యోగుల హాజరును అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి ‘మీ ప్రమాణం’ యాప్‌లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల హాజరును ఈ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు తమ పర్యటనలకు సంబంధించిన టూర్ డైరీలను ప్రతి నెలా తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదులు, ఇతర పెండింగ్ ఫైళ్లను నిరంతరం సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ అంశాల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యాలయ భవనాలు, పరిసరాల పరిశుభ్రతను కాపాడటం సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. కార్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా నిరంతరం చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిపాలనాపరమైన అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో అందరూ జిల్లా అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.
530
పెద్దపల్లి, అక్టోబర్ 14: --------------------------------------------- *ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పనితీరు మెరుగుపడాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* *మంథని, సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఔట్ పేషెంట్ల సంఖ్య పెంచాలి* *ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలి* *జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీల సంఖ్య పెంచేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి* *ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి* **వైద్య శాఖ పని తీరు పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్* ------------------------------------------ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పనితీరును మెరుగుపరచాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీలు) పనితీరును మెరుగుపరచాలని సూచించారు. మంథని, సుల్తానాబాద్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఔట్ పేషెంట్ల సంఖ్య మరింత పెరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీల సంఖ్య తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. దంత వైద్యం, ఆర్థోపెడిక్ చికిత్సలు, ఇతర వైద్య సేవలు, శస్త్రచికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సేవలపై నిరంతరం ప్రచారం నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి చికిత్సలు, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తూ, వైద్య సేవల వినియోగాన్ని పెంచాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, వైద్య సేవల నాణ్యతను మెరుగుపరుస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
1
4
520