సోమవారం ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడమైనది.
@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించనైనది.
@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రవ్యాప్త అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా, సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కే.ఆర్. నాగరాజు గారితో కలిసి ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని ప్రారంభించి, (1/2)
(2/2) ‘మీ పని, మీ జీవితం, మీ స్వేచ్ఛ’ అనే గోడపత్రికను ఆవిష్కరించనైనది. వెట్టి చాకిరిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించనైనది.
@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో పర్యటించి, ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడమైనది. ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని, ఫామ్ పాండ్లు, (1/2)
(2/2) సాగునీటి చెరువుల పనుల పురోగతిని వేగవంతం చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించడమైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్ గార్లు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడమైనది. (1/2)
(2/2) ఈ సమావేశంలో రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స పథకం–2025 కింద పీఎం రాహత్ పథకం అమలుపై సమీక్ష నిర్వహించడమైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
జిల్లా కలెక్టరేట్లో శనివారం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో కార్మికులకు, పరిశ్రమలకు అవసరమైన వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొనడమైనది.
@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
జిల్లా కలెక్టరేట్లో శనివారం జాతీయ రహదారి 163జీకి సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడమైనది.
@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు, రెవెన్యూ శాఖ కార్యదర్శి శ్రీ లోకేష్ కుమార్ గార్లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, భూ రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, (1/2)
(2/2) క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించడమైనది. @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని, అంగన్వాడీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించడమైనది...(1/2)
(2/2)...ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో తాగునీరు, పోషకాహార సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించడమైనది. @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుపై సమీక్ష నిర్వహించి, ఉద్యోగులు, పెన్షనర్లు, అర్హులైన లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించడమైనది.
జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి వివిధ మండలాల తహసీల్దార్లు,క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ మరియు మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో
ఎల్‌నినో ప్రభావాలపై ముందస్తు చర్యలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని,అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించడమైనది
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీవోలు, తహసిల్దార్ లతో నిర్వహించిన రీసర్వే, భూభారతి, భూదాన్ భూములు, భూసేకరణ, సాదాబైనామా తదితర రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించనైనది.
వరంగల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ తొలి మేనేజింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని జూనియర్& యూత్ రెడ్‌క్రాస్ విభాగాల ఏర్పాటుకు, రక్తదాన శిబిరాల విస్తరణ,వయోవృద్ధుల సంక్షేమం, మాదకద్రవ్యాల నిర్మూలన, నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించడమైనది.
@TelanganaCMO @TelanganaCS
పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సామాజిక న్యాయం కోసం పండుగ సాయన్న చేసిన పోరాటాలు, దానధర్మాలు, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని సూచించడమైనది.
@TelanganaCMO
@TelanganaCS @INC_Ponguleti
నర్సంపేట లోని పాకాల అభయారణ్యం లో బుధవారం సందర్శించి
పర్యాటకులకు మెరుగైన వసతులు ప్రకృతి అందాలను పరిరక్షిస్తూ పర్యాటక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అటవీ శాఖ అధికారులకు సూచించనైనది. @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti































