Pinned Tweet
Rahul Gandhi: India Should Not Fear Jokers and Clowns Who Know Nothing of Our History or Philosophy
రాహుల్ గాంధీ: మన చరిత్ర, తత్వశాస్త్రం తెలియని జోకర్లు, క్లౌన్లను చూసి భారత్ భయపడాల్సిన అవసరం లేదు
రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడుతున్నప్పుడు భయపడటం అర్థం చేసుకోవచ్చని, కానీ నేడు మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని శక్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
దేశం పిరికితనంతో వ్యవహరించకుండా ధైర్యంగా నిలబడాలని స్పష్టం చేశారు.
LoP Shri Rahul Gandhi said that while fear may be understandable when fighting the British Empire, there is no reason to be afraid of forces that know nothing about India’s history or philosophy.
He stressed that India must stand with courage.
#RahulGandhi #India
నేడు హై కోర్టులో తెలంగాణ హై కోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులని మర్యాద పూర్వకంగా కలిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి
Graduate MLC Candidate Sama Ram Mohan Reddy Pays a Courtesy Visit to Members of the Telangana High Court Bar Association and Bar Council Today.
• @RamMohanINC
ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy met with Railway Minister Ashwini Vaishnaw in Delhi
#RevanthReddy #Telangana
CM Revanth Reddy: Supreme Court Verdict Secures ₹50,000 Crore Miyapur Lands, Vows to Protect Telangana’s Public Assets
మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు
“నాటి ముఖ్యమంత్రి కేసీఆర్” ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారు
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్
మియాపూర్ లో రూ. 50 వేల కోట్ల విలువైన భూముల ప్రభుత్వానికి చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది
సుప్రీంకోర్టు కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా
మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారు
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని విలువైన భూములు కబ్జాకు ప్రయత్నించారు
ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా ఈ కబ్జా వ్యవహారాలపై పోరాడడంతోనే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారు
మియాపూర్ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారు
కేసీఆర్ కు నగదు రూపంలో ముడుపులు ఇచ్చారు
మేం ఈ భూముల రక్షణకు ప్రభుత్వo తరఫున బలమైన వాదనలు వినిపించాం
తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఆ భూముల రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించా
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కబ్జాల నుంచి భూములను రక్షించే ప్రయత్నిస్తున్నాం
ఈ విలువైన భూములను విక్రయించి నీటిపారుదల, విద్యా, వైద్య తదితర రంగాలకు కేటాయిస్తాం
ఈ అంశంపై క్యాబినెట్ లో చర్చిస్తాం
మా ప్రభుత్వం వచ్చాక రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం
IMG భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నాం
కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయపోరాటంలో గెలిచాం
గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జాకు ప్రయత్నిస్తే సుప్రీం కోర్టులో పోరాడాం
ప్రభుత్వం పోరాటంతో ఆది అటవీ భూమి అని సుప్రీం కోర్టు తెల్చి చెప్పింది
మంచిరేవుల లో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్ తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తే దానిని రక్షించాం
అందులో పోలీసుల పిల్లలకోసం స్కూల్ పెట్టాం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కు నజరానాగా అప్పగిస్తే సుప్రీం కోర్టులో పోరాడి రక్షించాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ ఎస్ నాయకుల భూ ఆక్రమణలను అడ్డుకున్నాం
మా ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో రూ. 1.50 లక్ష కోట్ల విలువైన భూమలు రక్షించాం
వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గం ఉప సంఘం ఈ భూముల విక్రయం.. వచ్చే ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుంది
హరీష్ రావు మామ హనుమంత రావు కబ్జా పెట్టిన భూములు సర్వే చేయకుండా అధికారులను అడ్డుకుంటున్నారు
కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు
భూముల ఆక్రమణపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు
శాసనసభ లో చర్చించి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు
మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదు
కనీసం రెవెన్యూ అధికారులను ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అభినందించడం లేదు
పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పై కేసులు వేశారో వారితో కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారు
మియాపూర్ భూములపై ఇప్పటికైనా కుట్రలు మానాలి
మియాపూర్ భూముల విక్రయంతో వచ్చే నిధులను విద్యాభివృద్ధికి వినియోగిస్తాం
వాళ్ల భూముల ఆక్రమణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సీఎం డిమాండ్
రెండు గ్రామాల మధ్య వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారు
అక్కడి ఆక్రమణలను తేల్చి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తాం
కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా బుద్ది మార్చుకుని, ఆక్రమణలు చేయడం మానుకోవాలి
వాళ్ల ఆక్రమణలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి
#RevanthReddy #Telangana
Not Multiple Protests, It’s One Fight for the Constitution’: Entire Opposition Stands United, Declares Rahul Gandhi
అమిత్ షా అడ్డుకున్నా ఆగదు..
రాంలీలా మైదానానికి వేలాదిగా తరలిరానున్న ప్రజలు!
వర్షం కారణంగా నేడు జరగాల్సిన “CEC పబ్లిక్ ఇంప్లీచ్మెంట్” నిరసన కార్యక్రమం రేపటికి వాయిదా పడింది.
ఆ మరుసటి రోజు (నవంబర్ 1న) రాంలీలా మైదానం వేదికగా భారీ మార్చ్ జరగనుంది.
తెలంగాణ, యూపీ, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న ప్రజలను అమిత్ షా అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ కోట్ల మంది ప్రజల ఓటు హక్కును కొల్లగొడుతుంటే దేశం చూస్తూ ఊరుకోదు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం యావత్ ప్రతిపక్షం ఏకతాటిపైకి వచ్చింది. రాంలీలా మైదానంలో ప్రజా తిరుగుబాటు ఎలా ఉంటుందో కేంద్రం చూడబోతోంది!
#RahulGandhi #INDIAAlliance #RamlilaMarch
‘Exposed KCR & Goldstone Prasad’s Attempted Land Grab’: CM Revanth Hails Apex Court Ruling on Prime Miyapur Lands
₹50,000 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్!
గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను అడ్డం పెట్టి దోచేయాలనుకున్నారు...
కేసీఆర్, ఆయన అనుచరుడైన రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, ‘గోల్డ్‌స్టోన్ ప్రసాద్’ను అడ్డుపెట్టుకుని కొల్లగొట్టాలని చూసిన ₹50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా ప్రభుత్వం కాపాడింది!
మియాపూర్ పరిధిలోని విలువైన భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వాదనను బలపరుస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
తెలంగాణ ప్రజల తరఫున జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గార్ల ధర్మాసనానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రజాధనం, ప్రజా ఆస్తులను దోచుకోవాలని చూస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
#Telangana #MiyapurLands #RevanthReddy
Telangana Introduces GPSAP-2026: Comprehensive 3–5 Year Development Plans for Every Gram Panchayat to Drive Self-Reliant Villages by 2047
తెలంగాణలో గ్రామాల సమగ్రాభివృద్ధికి “GPSAP-2026”
* పంచాయతీరాజ్ శాఖ కీలక ఉత్తర్వులు
* దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని ప్రతి గ్రామపంచాయతీకి "సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
* (GPSAP-2026)"ను అమలు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ఈ నూతన విధానాన్ని రూపొందించారు.
ప్రతి గ్రామంలోని జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి అవకాశాలు, గృహవసతి, పశుసంపద మరియు ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైల్‌ను రూపొందిస్తారు. ప్రతి పంచాయతీకి 3 నుండి 5 ఏళ్ల సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికతో పాటు, ప్రస్తుత సంవత్సరానికి ప్రత్యేక వార్షిక ప్రణాళికను సిద్ధం చేస్తారు. గ్రామ అవసరాలు, స్థానిక ప్రాధాన్యతల ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను ఎంపిక చేసి పూర్తి చేస్తారు.
పారదర్శకత కోసం ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్ మరియు పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి నెలా జరిగే గ్రామపంచాయతీ సమావేశంలో GPSAP పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినా లేదా తప్పుడు సమాచారం అందించినా పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారుల వరకు కఠిన చర్యలు ఉంటాయి.
'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్య సాధనలో భాగంగా, పారదర్శకత మరియు జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.
• @seethakkaMLA
Public Sector Banks Are Assets of the People, Not for Sale | Rahul Gandhi's Letter to IDBI Bank Employees
లాభాల్లోకి తీసుకొచ్చిన ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించడం ఎందుకు?
ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు రాహుల్ గాంధీ లేఖ
ఐడీబీఐ బ్యాంక్ కుటుంబ సభ్యులకు,
గత ఏడాది మార్చిలో మీలో కొందరు పార్లమెంట్ హౌస్‌లో నన్ను కలవడానికి వచ్చారు. మీరు నన్ను ఒక సాధారణ ప్రశ్న అడిగారు. మీరు కష్టపడి లాభాల్లోకి తీసుకొచ్చిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు విక్రయిస్తోంది?
ఆ ప్రశ్నను నేను లోక్‌సభలో లేవనెత్తాను. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకును ఎందుకు విక్రయిస్తున్నారు? ఆ బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారుల ప్రయోజనాలకు ఎలా రక్షణ కల్పిస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పలేదు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంకును కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించాలని నిర్ణయించింది.
ఐడీబీఐ ఒక మార్గదర్శక అభివృద్ధి బ్యాంకుగా ప్రారంభమైంది. వాణిజ్య బ్యాంకుగా మారే ప్రయాణం అంత సులభంగా సాగలేదు. అయినప్పటికీ మీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఏడేళ్ల క్రితం ఐడీబీఐ నష్టాల్లో ఉండేది. గత ఏడాది తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని ఆర్జించింది. ఈ విజయం మీ కృషి ఫలితమే.
ప్రజల సొమ్ముతో నిర్మించిన సంస్థ ప్రజలకే చెందుతుంది. నేడు ఈ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిపి 95 శాతం వాటాను కలిగి ఉన్నాయి. విక్రయం తర్వాత వారి వాటా 34 శాతానికి తగ్గిపోతుంది.
2003లో ఐడీబీఐలో కనీసం 51 శాతం వాటాను ఎప్పటికీ తమ వద్దే ఉంచుకుంటామని ప్రభుత్వం పార్లమెంట్‌కు హామీ ఇచ్చింది. ఆ హామీ చట్టంలో రాసి ఉండకపోవచ్చు. కానీ పార్లమెంట్‌కు ఇచ్చిన హామీ అంటే భారత ప్రజలకు ఇచ్చిన హామీ.
ఐడీబీఐ ప్రైవేటు యాజమాన్యంలోకి వెళ్లినప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న రిజర్వేషన్లు కూడా కనుమరుగవుతాయి. ఇప్పటికే బలహీనపడిన మీ ఉద్యోగ సేవా నిబంధనలు తమకున్న చివరి రక్షణను కూడా కోల్పోతాయి.
ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం రెండూ బలంగా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విశ్వసిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు విక్రయించాల్సిన ఆస్తులు కావు. అవి దేశ నిర్మాణానికి ఉపయోగపడే సాధనాలు.
మీకు అండగా నిలబడాలని మీరు నన్ను కోరారు. నేటి మీ పోరాటంలో నేను మీకు అండగా నిలుస్తాను. మీ న్యాయమైన అన్ని డిమాండ్లకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
ఐక్యంగా ఉండండి.
దృఢ సంకల్పంతో ముందుకు సాగండి.
జై హింద్!
రాహుల్ గాంధీ
29 అక్టోబర్ 2026
#RahulGandhi #IDBI
కరువు వస్తే రాష్ట్రాభివృద్ధి ఆపేయాలా?
మీలా నాసిరకం ప్రాజెక్టులు కట్టట్లేదు...
తెలంగాణకు నాణ్యమైన భవిష్యత్తు ఇస్తున్నాం!
---- కేటిఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చిన
నరేందర్ రెడ్డి (టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్)
ప్రెస్ మీట్లో మాట్లాడే తేదీ తెలియదు...
నెల రోజుల క్రితం ప్రెస్ మీట్లో 'నేను ఉండటానికి ఇల్లే లేదు' అన్న కేటీఆర్, ఈరోజు ప్రెస్ మీట్లో 'నేను ఉంటున్న విల్లా పక్కన' అని మాట్లాడుతున్నాడు!
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం తప్పుడు ప్రచారం చేసి అలవాటైన కేటీఆర్‌కు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే 'గ్లోబల్ సమ్మిట్' కూడా గోబెల్స్‌లాగే కనిపిస్తోంది.
మీలాగా నాసిరకం ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ముంచేయడం లేదు... యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి నాణ్యమైన ప్రాజెక్టులు తెచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు.
కేటీఆర్... ఇప్పటికైనా అబద్ధాలు మానుకో!
#RevanthReddy #KTR #GlobalSummit
• @NYelamareddy
*తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే*
* తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం
* ఫార్మా, ఏరోస్పేస్, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో అపార అవకాశాలు
* తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ: తెలంగాణ నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ.. సమష్టి కృషితో దానిని సాధించవచ్చని
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఫార్మా, అంతరిక్షం, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, ఆహార శుద్ధి, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టే ముందు పారిశ్రామికవేత్తలు ప్రధానంగా ఆశించేది విధానాల్లో స్థిరత్వం, నిబంధనల్లో స్పష్టత, వ్యాపార నిర్వహణలో పారదర్శకతేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
ఇందుకు తెలంగాణ చరిత్రలోని కాకతీయుల కాలం నాటి ఉదాహరణను ప్రస్తావించారు. క్రీ.శ. 1244లో కాకతీయ పాలకుడు గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవులో జారీ చేసిన అభయ శాసనం సముద్ర వాణిజ్యంలో కీలక సంస్కరణలకు నాంది పలికిందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
* తెలంగాణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లు
తెలంగాణ నుంచి ఎగుమతులు పెంచేందుకు రాష్ట్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. రాష్ట్రంలోని అత్యధిక ఎగుమతి సామర్థ్యం ఉన్న 50 ఉత్పత్తులు, సేవలను గుర్తించాలన్నారు. తెలంగాణలోని జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఇందుకు నాణ్యమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఉత్పత్తుల మూలాలను గుర్తించే ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
తాండూరు కందిపప్పు, చపాటా మిర్చి, నిజామాబాద్ పసుపు వంటి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో మంచి అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వాటికి అంతర్జాతీయంగా మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటే రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.ఇటీవల తాండూరు ఎర్ర కందిపప్పు ఉత్పత్తులను హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయడం తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి అన్నారు.
* ఫార్మా రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం
తెలంగాణ ఫార్మా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గోయల్ సూచించారు. జనరిక్ ఔషధాల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, అధిక విలువ కలిగిన బ్రాండెడ్ ఔషధాలు, వినూత్న ఔషధాలు, బయోసిమిలర్ల తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంతరిక్షం, విమానయాన రంగాలు, విమాన విడిభాగాల తయారీ, నిర్వహణ-మరమ్మతు సేవలు (ఎంఆర్‌ఓ), రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో తెలంగాన పెట్టుబడులను ప్రోత్సహించాలని చెప్పారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ సందర్బంగా జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తేనే వివిధ పరిశ్రమల్లో ప్రపంచ స్థాయి నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పారు. దీపావళి పండుగ సమయంలో ఒక్కో దీపం వెలిగించడం ద్వారా వెలుగులు విస్తరించినట్లే.. ఒక్కో పెట్టుబడి, ఒక్కో ఎగుమతి, ఒక్కో కొత్త ఉద్యోగం, ఒక్కో స్టార్టప్ దేశాభివృద్ధికి దోహదపడతాయన్నారు. భారత్, తెలంగాణ భవిష్యత్తు ఉమ్మడి కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణలోని అవకాశాలను పరిశీలించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల సృష్టి, ప్రజల సంపద పెరుగుదల, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయని చెప్పారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
పెట్టుబడులతో రండి..
రెట్టింపు లాభాలు పొందండి..
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు ఇదే మా ఆహ్వానం
CM Revanth Reddy Assures Investment Security at Invest Telangana Global Summit 2026 Curtain Raiser
Telangana Aims to Become a $1 Trillion Economy by 2034 and a $3 Trillion Economy by 2047: CM Revanth Reddy at Invest Telangana Global Summit 2026
2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు
* కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా...
* కార్యక్రమానికి హాజరైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, వాకాటి శ్రీహరి గారికి, మహ్మద్ అజారుద్దీన్ గారికి, పారిశ్రామికవేత్తలకు, విధాన రూపకర్తలకు, అధికారులకు, మిత్రులందరికీ స్వాగతం
* డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నా.
* సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఒక ప్రపంచస్థాయి నగరంగా వెలుగులీనింది.
* ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలకు వచ్చి వ్యాపారాలు చేసేవారు. ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి నకాషీ కళాకృతులను కొనుగోలు చేసేవారు.
* నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంకశాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు.
* హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రపంచం గర్వించే మేధో నిపుణులు, నాయకులను అందించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ప్రేమ్ వత్స వంటి ప్రముఖులంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు.
* విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉంది.
* భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో, దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన మహా నేతలను మనం స్మరించుకోవాలి
* ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల సమక్షంలో నిలబడి, దేశ ప్రగతికి బాటలు వేసిన ఆ మహానేతలకు నేను సెల్యూట్ చేస్తున్నాను.
* అతి పిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నేడు ఫోన్, ఇంటర్నెట్ లేని జీవితాన్ని మనం ఊహించలేం.
* రాజీవ్ గాంధీ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందారు. పైలట్‌గా కూడా పనిచేశారు. అందుకే హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టుకున్నాం.
* 1991లో శ్రీ పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తెలంగాణకు చెందినవారు. ఆ సమయంలో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆయన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) సంస్కరణలను అమలు చేశారు.
* హైదరాబాద్ జీవనంలోనే ప్రపంచస్థాయి దృక్పథం ఉంది. సంస్కరణలను స్వీకరించే తత్వం, పారిశ్రామిక స్ఫూర్తి ఉన్నాయి.
* 1991 నుంచి హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారు.
* నేను ఇక్కడ సుదీర్ఘంగా ప్రసంగించడానికి రాలేదు. పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినడానికి వచ్చాను. వ్యాపార రంగం గురించి మాకంటే మీకే ఎక్కువ అవగాహన ఉంది. మీ నుంచి నేర్చుకుంటాం, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుంటాం, వాటిని ఆచరణలో పెడతాం.
* ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. తెలంగాణలో మీరు పెట్టే పెట్టుబడులకు భద్రత కల్పించడం, అవి వృద్ధి చెందేలా చూడడం నా వ్యక్తిగత బాధ్యత. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటా.
* ముందుగా మీకో విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ముందుగా మీ మనసులో ఒక సంఖ్యను నిర్ణయించుకోండి. ఆ మొత్తాన్ని ఇప్పుడు రెట్టింపు చేయండి!
* మీరు ఆశిస్తున్న వృద్ధి అంచనాలను రెట్టింపు చేయండి. మీరు ఆశిస్తున్న లాభాలనూ రెట్టింపు చేయండి.
* మీకు నా నుంచి ఏం కావాలో చెప్పండి. విధానపరమైన నిర్ణయాలైనా, ప్రభుత్వ సహకారమైనా, మీకు అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటా.
* ‘తెలంగాణ రైజింగ్ 2047’ తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక. ఇది ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది.
* 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం.
* పెట్టుబడిదారుల్లో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సంబంధాలపై సందేహాలున్నాయి.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడే చెప్పారు
అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు
ఏమిటనేది కేంద్ర మంత్రి చెప్పారు
* దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో మూడు హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటుకానున్నాయి.
* వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరిస్తోంది.
* రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు కేంద్రం నుంచి సహకారం పొందుతున్నాం.
* అభివృద్ధి విషయంలో ప్రభుత్వ జోక్యం కంటే, అవసరమైన చోట ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి అవకాశాలను విస్తరించాలి. మీ విజయపథంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే నా పని.
* హైదరాబాద్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ పడదు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి.
* తెలంగాణ అభివృద్ధికి మీ అత్యుత్తమ ఆలోచనలను అందించండి. మంచి విధానపరమైన సూచనలు చేయండి. మీ సూచనలను పరిశీలించి, వాటిని ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తాం.
* చివరగా, తెలంగాణ ఎదుగుతోంది. ఈ ప్రగతి ప్రస్థానంలో మీరూ భాగస్వాములు కండి. మనమంతా కలిసి ఎదుగుతూ చరిత్ర సృష్టిద్దాం.
జై హింద్… జై తెలంగాణ
#RevanthReddy #Telangana
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
Union Minister of Commerce and Industry Piyush Goyal addressing the curtain-raiser event of the Invest Telangana Global Summit 2026.
#RevanthReddy #Telangana
Chalo Delhi | ఛలో ఢిల్లీ
Chalo Delhi | ఛలో ఢిల్లీ
ఇది ఒక పార్టీ కొట్లాట కాదు...
భారతీయుల ఓటు హక్కు రక్షణ పోరాటం!
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన ఓటును కాపాడేందుకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది.
రాంలీలా మైదానానికి రండి!
ఇవాళ గొంతు విప్పకపోతే... రేపు మన ఓటే మిగలదు!
📍 వేదిక: రాంలీలా మైదానం, న్యూఢిల్లీ
🗓️ తేదీ : నవంబర్ 1 (ఆదివారం)
✊ ఈ దేశంలో ప్రతి ఓటు కోసం గళమెత్తుదాం!
#ChaloDilli #VoteBachaoDeshBachao #RahulGandhi #INDIA
మోడీకి మీడియా ఫోబియా
జర్నలిస్టులను ఫేస్ చేసే ధైర్యం మోదీ చేయరు
* రాజకీయాల్లో ఎన్ని గెలిచామన్నది ముఖ్యం కాదు ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం
* బీజేపీ కంచుకోట లో బుల్లెట్ దించామా లేదా?
* బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో నాగపూర్ లో కాంగ్రెస్ గెలిచి సత్తా చూపించాం
* మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లో ఎస్పీ అభ్యర్థులను గెలిపించారా ?లేదా?
* వారణాసి లో బీజేపీ ఓటమి మోదీ కాలానికి చెప్ప పెట్టులాంటింది
* కాంతి సింగ్ అవినాష్ కుమార్ పై మంచి మెజార్టీ తో గెలిచారు
* బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నాలో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారు
* పూణే లో ఎన్సీపీ అభ్యర్ధి హర్షత్ దేశ ముఖ్ విజయం సాధించారు
* గోరఖ్ పూర్ లో 307 చావు తప్పి కన్నులొట్ట మాదిరి బీజేపీ విజయం
* నాగ్ పూర్, వారణాసి, గోరఖ్ పూర్ పరిస్థితి ఏంటన్నది మోదీ జవాబు చెప్పాలి
* నైతికత ఉంటే మోదీ సమాధానం చెప్పాలి
* నాగ్ పూర్ గెలిచి మోదీ చాతిమీద కొట్టాం
* యువత లో మోదీ పాలన పై అసంతృప్తి
* వారణాసి లో బీజేపీ అభ్యర్థి ఓటమి బీజేపీ పాలనకు నిదర్శనం
* బీజేపీ సిద్ధాంతాలను ప్రజలు చీ కొడుతున్నారు కాబట్టే నాగ్ పూర్ లో ఓటమి
* బంకీపుర్ నుంచ వారణాసి వరకు బీజేపీ అభ్యర్థుల ఓటమి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తికి నిదర్శనం
* బీజేపీ అగ్రనేతల కంచుకోటల్లో ఆ పార్టీ నేతల ఓటమి మోదీ పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం
* రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు గుణపాటం
* సర్ పై జరిగిన ఉద్యమం,పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ అరాచక పాలనకు నిదర్శనం
* రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం
* సర్ తో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం
* సర్ పై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు
* కుంటిసాకులు చెప్పే వారికీ చెంపపెట్టు
* రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి రైళ్ల నిరాకరణ కుట్ర
* ప్రధాని మంత్రి, హోంమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి మేరకు రైళ్ల నిరాకరణ
* రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుంది
* అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి తరలిస్తాం
* సర్ ప్రక్రియ దేశంలో అలజడి సృష్టించింది
* రాష్ట్రానికి అమిత్ షా రాక వల్ల ప్రయోజనం శూన్యం
* అమిత్ షా తో ఒరిగేది ఏమి లేదు
* ఎల్ నినో ప్రకృతి విప్పత్తు
* బటన్ తిప్పితే ఎల్ నినో వస్తుందని హరీష్ అనుకుంటున్నారు
* సిద్దిపేట ప్రజలు హరీష్ మాటలు చూసి నవ్వుకుంటున్నారు
* విపత్తులు వస్తే రాజకీయాలు చేయడం తగదు
* ఇష్టానుసారం మాట్లాడితే బండకేసి కొడతారు
* కరోనా విపత్తు వస్తే కేసిఆర్ పారాసీటామాల్ అంటూ వేళాకోళం
* కొండ సురేఖ కు బాసటగా ఉంటాం
* అనిరుధ్ నిధుల అంశం క్రమశిక్షణ కమిటీ పర్యవేక్షిస్తుంది
* నిధుల కొరత బిఆర్ఎస్ పాపం
--- టీపీసీసీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ
మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం
A March for the Soul of India: Rahul Gandhi Appeals to Students, Youth Across Party Lines to Join 'Chalo Dilli'
ఛలో ఢిల్లీ: "ఓటు కాపాడుకుందాం – దేశాన్ని రక్షించుకుందాం!"
నవంబర్ 1 రాంలీలా మార్చ్‌కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పిలుపు
ఇది ఏ ఒక్క పార్టీ కోసమో చేస్తున్న పోరాటం కాదు... భారతదేశ ఆత్మను కాపాడుకునే ప్రజా ఉద్యమం!
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో యువత, విద్యార్థులు, పౌరులంతా ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది. లాఠీలకు, పోలీసులకు భయపడకండి... దేశ రక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానానికి తరలిరండి!
📍 వేదిక: రాంలీలా మైదానం, ఢిల్లీ
🗓️ తేదీ: నవంబర్ 1
#ChaloDilli #VoteBachaoDeshBachao #RahulGandhi #SaveDemocracy
Chandni Chowk Traders Express Support for Rahul Gandhi and Priyanka Gandhi
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి చాందినీ చౌక్ వ్యాపారుల మద్దతు
చాందినీ చౌక్ వ్యాపారులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు మద్దతు ప్రకటిస్తూ, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. మోదీకి ఏమీ తెలియదని, అబద్ధాలు చెప్పడం మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు.
- చాందినీ చౌక్ వ్యాపారులు
Chandni Chowk traders express strong support for Rahul Gandhi and Priyanka Gandhi, criticizing Prime Minister Modi for allegedly relying on lies rather than leadership.
- Traders of Chandni Chowk
ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
సాయంత్రం “ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
Congress for Telangana retweeted
"Jo Jeeta Wohi Sikandar!": Congress's Abhijit Wanjari Celebrates Historic Win Over BJP in Nagpur MLC Polls.
"జో జీతా వోహి సికందర్..!" – నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి
మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక నాగ్‌పూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి చారిత్రక విజయం సాధించారు.
బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్‌లేపై సాధించిన ఘనవిజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు:
- బీజేపీ అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేక 'ఎలిమినేషన్ రౌండ్ గెలుపు' అని సాకులు చెబుతున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిస్తే వాళ్లే సికందర్ అని అభిజీత్ ఎద్దేవా చేశారు.
- నియోజకవర్గంలో ఆరేళ్లుగా తాము చేసిన పనికి, ఉపాధ్యాయ–ఉద్యోగ సంఘాల మద్దతుకు దక్కిన ప్రతిఫలమే ఈ గెలుపని స్పష్టం చేశారు.
- ఇది ప్రచారం కంటే వ్యూహాల మధ్య జరిగిన ఎన్నిక.. అందుకే శక్తి కంటే యుక్తే గెలిచింది" అంటూ తమ పక్కా ప్లానింగ్ వల్లే బీజేపీ కంచుకోట బద్దలైందని తెలిపారు.
#Nagpur #NagpurElection
"Jo Jeeta Wohi Sikandar!": Congress's Abhijit Wanjari Celebrates Historic Win Over BJP in Nagpur MLC Polls.
"జో జీతా వోహి సికందర్..!" – నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి
మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక నాగ్‌పూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి చారిత్రక విజయం సాధించారు.
బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్‌లేపై సాధించిన ఘనవిజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు:
- బీజేపీ అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేక 'ఎలిమినేషన్ రౌండ్ గెలుపు' అని సాకులు చెబుతున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిస్తే వాళ్లే సికందర్ అని అభిజీత్ ఎద్దేవా చేశారు.
- నియోజకవర్గంలో ఆరేళ్లుగా తాము చేసిన పనికి, ఉపాధ్యాయ–ఉద్యోగ సంఘాల మద్దతుకు దక్కిన ప్రతిఫలమే ఈ గెలుపని స్పష్టం చేశారు.
- ఇది ప్రచారం కంటే వ్యూహాల మధ్య జరిగిన ఎన్నిక.. అందుకే శక్తి కంటే యుక్తే గెలిచింది" అంటూ తమ పక్కా ప్లానింగ్ వల్లే బీజేపీ కంచుకోట బద్దలైందని తెలిపారు.
#Nagpur #NagpurElection

























