G S Media (@GSMediaPRO) header
G S Media (@GSMediaPRO) profile picture
Joined June 2026
Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)
'ఆకాశంలో ఒక తార' మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి) చిన్నప్పటి నుంచే వ్యోమగామి కావాలని కలలు కంటుంది. కానీ తండ్రి ఆమెను చదువు మానిపించి కృష్ణ (దుల్కర్ సల్మాన్) అనే మెకానిక్, డ్రైవర్‌తో పెళ్లి చేస్తాడు. పెళ్లయిన తర్వాత తన భార్య ఆశయం గురించి తెలుసుకున్న కృష్ణ, ఆమె కలను నెరవేర్చడం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూ అండగా నిలబడతాడు. ఈ ప్రయాణంలో వీరికి ఎదురైన సవాళ్లు, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అధినేత రోహిణి (శ్రుతి హాసన్) ప్రవేశం తర్వాత కల్పన కల ఎలా సాకారమైందనేదే ఈ చిత్ర కథాంశం. కొత్త నటి అయినప్పటికీ సాత్విక వీరవల్లి కల్పన పాత్రలో చాలా సహజంగా, అనుభవం ఉన్న నటిలా ఒదిగిపోయింది. భార్య కల కోసం తపించే భర్తగా దుల్కర్ సల్మాన్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో శ్రుతి హాసన్ ఎంట్రీ సినిమాకు కొత్త జోష్ తీసుకొచ్చింది. రుహానీ శర్మ, మురళీ శర్మ, గౌతమ్ మీనన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా కథలోని ప్రధాన ఉద్దేశంపైనే దర్శకుడు పవన్ సాధినేని దృష్టి పెట్టాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం, తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా చివరి అరగంట ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. గుణ్ణం గంగరాజు అందించిన స్క్రీన్‌ప్లే, డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా, అక్కడక్కడా డాక్యుమెంటరీ తరహాలో సాగినట్లు అనిపిస్తుంది. సినిమా ప్రధాన కథ, ముగింపు ప్రేక్షకులకు ముందే ఊహకు అందేలా ఉండటంతో పెద్దగా ట్విస్టులు కనిపించవు. అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ నాణ్యత ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ఏఐ విజువల్స్ వాడటం సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. 'ఆకాశంలో ఒక తార' పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఒక హార్ట్ టచింగ్ ఇన్స్ పైరింగ్ సినిమా చూడొచ్చు. #AkasamLoOkaTara #DulquerSalmaan #SathvikaVeeravalli
222
🎉 The #KORVI team celebrated the birthday of DOP #SatishReddyMasam Garu with joy and happiness! ❤️🎂 Wishing him a fantastic year ahead filled with happiness and great success! ✨
217
ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన #OM #Akashamlookatara
388
కులానికి కుర్చీ వేసి ప్రతిభకు పాడె కట్టే పెద్దల్ని ఎదిరించిన ఒక సామాన్యుడి కథ ఇది. దండాలు పెట్టే అతని చేయి పిడికిలి బిగిస్తే ఎం జరిగింది అనేది రాజిగాడు రాజయ్యాడు సినిమా టీజర్ లో ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ నేపథ్యంతో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ #RajiGaduRaajayyadu
793
#January12Vidudala MUSICAL JOURNEY BEGINS FROM TOMORROW
1,038
'ఈ నగరానికి ఏమైంది 2' ENE Repeat ఫస్ట్ పార్ట్ లో నలుగురు స్నేహితులు (వివేక్, కౌశిక్, కార్తీక్, ఉప్పి) కలిసి తీసిన మొదటి సినిమా ఆర్థికంగా నష్టాలను మిగల్చడంతో ఎవరి దారి వారు చూసుకుంటారు. పాత బాకీలు తీర్చే బాధ్యత తీసుకున్న వివేక్ (విశ్వక్ సేన్) పెళ్లిళ్ల ఈవెంట్లు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో కార్తీక్ చెల్లెలు కీర్తన (శివాత్మిక) పెళ్లి కుదరడం, పెళ్లికొడుకు అంకిత్ (శ్రీరామచంద్ర) బ్యాచిలర్ పార్టీలో జరిగిన ఒక గొడవ వల్ల ఆ పెళ్లి ఆగిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ నలుగురు స్నేహితులు మళ్లీ ఒక సినిమా తీయడానికి థాయిలాండ్ వెళ్లడం, అక్కడ జరిగే సరదా సంఘటనల చుట్టూ ఈ కథ సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య వచ్చే సహజమైన సంభాషణలు, బడ్డీ కామెడీ, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లోని పబ్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్‌కు ముందు వచ్చే 40 నిమిషాలు ఫన్నీగా ఉంటాయి. అయితే సినిమాలో బలమైన స్టోరీ లేకపోవడం, కేవలం కొన్ని సరదా సన్నివేశాల ఆధారంగా స్క్రీన్ప ప్లే నడిపించడం మైనస్ గా చెప్పుకోవచ్చు. సినిమా ప్రారంభమైన మొదటి 20 నుండి 30 నిమిషాల వరకు కథ పట్టాలెక్కదు. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కథనం ట్రాక్ తప్పుతుంది. కొన్ని కామెడీ సీన్స్ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. సినిమా నిడివి కూడా ఎక్కువే. కౌశిక్ గా అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ థియేటర్లలో బాగా నవ్వించాయి. విశ్వక్ సేన్ వివేక్ క్యారెక్టర్ లో తన పాత్రకు తగ్గ ఎనర్జీతో కనిపించారు. గత చిత్రంలోని సైకో వివేక్ షేడ్స్ ఇందులోనూ కనిపిస్తాయి. మొదటి భాగంలో సుశాంత్ పోషించిన కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి పర్వాలేదనిపించారు., వెంకటేష్ కాకుమాను (ఉప్పి) తన ఇన్నోసెంట్ కామెడీతో ఆకట్టుకున్నారు. 'ఈ నగరానికి ఏమైంది 2' ఫస్ట్ పార్ట్ స్థాయిలో పూర్తిస్థాయి మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ, స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఓకే అనిపిస్తుంది. #ENE2 #ENERepeatReview
531
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల బారీ జరిమానా. ఈ మేరకు చెక్ బౌన్స్ కేసులో తీర్పు ఇచ్చిన ఒంగోలు కోర్టు. #BandlaGanesh
683
Super Star #MaheshBabu At The Party Hosted By Megha Krishna Reddy #Varanasi
1
1
1,034
#KAAKA Definitely కొడతాం. #KAAKAOnJan13 #Chiranjeevi
1,081
అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించిన ప్రొడ్యూసర్ రవిశంకర్, డైరెక్టర్ శివ నిర్వాణ #ShivaNirvana #RaviShankar
739
#Chiru revealed #AnaswaraRajan character in #Kaaka ! అనశ్వర మాట్లాడలేదు.. ఈ చిన్న బిట్ ను ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి మీకే అర్థమవుతుంది: చిరంజీవి
777
సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం తెలియలేదు, వచ్చిన మూవీస్ అన్నీ చేసుకుంటూ వెళ్లా - శ్రీలీల #Sreeleela #OM
1,248
డ్యాన్సుల్లో తమదైన గ్రేస్ చూపించే సాయి పల్లవి, శ్రీలీల కలిసి డ్యాన్స్ చేయడం 👌👌 #SaiPallavi #SreeLeela #OM
1,013
క్యాచీ టైటిల్, ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్న "రాజిగాడు రాజయ్యాడు" 'బట్టలరామస్వామి బయోపిక్కు' సినిమా హీరో అల్తాఫ్ హసన్ మరో కొత్త ప్రయత్నం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న అల్తాఫ్ హసన్. #RajiGaduRaajayyadu
1
2
598
హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో హీరో తేజ సజ్జ, మౌర్య నిశ్చితార్థం. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు #TejaSajja #TejaSajjaEngagement
1,095
ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని తన స్థాయికి మించిన కలగంది కల్పన #AakasamLoOkaTara Trailer Out Now హార్ట్ టచింగ్, ఇన్స్ పైరింగ్ 👌👌👌
1,419