అనపర్తి నియోజకవర్గం ZPTC కూటమి 4/4 విన్
MPTC విజేతలు
అనపర్తి మండలం కూటమి 18 వైసిపి 1 స్వతంత్రులు 1
బిక్కవోలు మండలం కూటమి 20 వైసిపి 0
పెదపూడి మండలం కూటమి 19 వైసిపి 1
రంగంపేట మండలం కూటమి 14 వైసిపి 2
అనపర్తి నియోజకవర్గంలో విజయం సాధించిన ZPTC అభ్యర్దులు నలుగురికీ శుభాకాంక్షలు. జనరల్ ఎలక్షన్ ని మించిన మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు. అభివృద్దికి ప్రజలు ఎంతటి ప్రాముఖ్యను ఇస్తున్నారో ఈ ఎన్నికలు నిరూపించాయి.
కొప్పవరం, ఊలపల్లి, చింతపల్లి, సంపర తదిచర గ్రామాలలో వరుస తుఫానుల కారణంగా నీట మునిగిన పంటపొలాలను సందర్శించి రైతులను కలుసుకుని జరిగిన నష్టం గురించి వివరాలు తలచుకుని వారిని ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది.
ఏపిత్రయంలో కమీషన్ లకు కక్కుర్తిపడి నాడు అధికారులు నివాసయోగ్యం కాదని చెప్పినా వినకుండా ముంపుకి అవకాశం ఉన్న ప్రాంతంలో భూసేకరణ చేయించిన నాటి MLA సత్తి సూర్యనారాయణరెడ్డి . ఏలేరు డ్రైయినుకి వరద పోటెత్తడంతో నీట మునిగిన ఏపిత్రయంలోని జగనన్న కాలనీ. నేడు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది
పెదపూడి మండలంలోని 18 గ్రామాలలోను ZPTC అభ్యర్ది రావాడ నాగు, MPTC అభ్యర్దులతో కలసి ప్రచారర్యాలీ నిర్వహించడం జరిగింది.
కూటమి ఆధ్వర్యంలో బిక్కవోలు మండలం 13 గ్రామాలలోను ZPTC అభ్యర్ది నల్లమిల్లి ఆదిలక్ష్మి, MPTC అభ్యర్దులతో కలసి ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది.
రంగంపేట మండలంలో ZPTC, MPTC ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 గ్రామాలలోను ZPTC, MPTC అభ్యర్దులతోను, కూటమి నేతలతోను కలసి ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ZPTC, MPTC ఎన్నికల ప్రచారం నిమిత్తం అనపర్తి మండలం 11 గ్రామాలలోను అభ్యర్దులతోను, కూటమి నేతలతోను ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అనపర్తి రైల్వే స్టేషన్ లో నేడు జన్మభూమి ట్రైన్ కి వచ్చిన ప్రయాణికులను కలసి స్ధానిక సంస్థలు ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. అనపర్తి వాసుల చిరకాల కలగా మిగిలిన ఈట్రైన్ హాల్ట్ ని కూటమి ప్రభుత్వం వచ్చాక సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.
అర్నబ్ తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు పొలమూరు మరియు పందలపాక తదితర గ్రామాలలో నీట మునిగి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు రాజమహేంద్రవరం ఎంపి శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారితో కలసి భరోసానివ్వడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల" నేపథ్యంలో తునిలో టిడిపి నాయకులు యనమల రాజేష్, తుని నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ త్రిమూర్తులు స్వామి, జనసేన నాయకులు యనమల కృష్ణుడు గార్లను తుని రూరల్ జెడ్పిటిసి బిజెపి అభ్యర్థి ఎంపిటిసి అభ్యర్థులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
"స్థానిక సంస్థల ఎన్నికల" నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గం కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొవ్వూరులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో సమావేశమై, వివిధ అంశాలపై చర్చించడం జరిగింది
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెదపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి వారి మద్దతును కోరడం జరిగింది.
అనపర్తి నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేస్తున్న జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులకు నేడు B ఫారాలు అందజేయడం జరిగింది. నియోజకవర్గంలో TDP 3 , జనసేన 1 ZPTC స్ధానాలకు & TDP 51, JSP 13, BJP 11 MPTC స్ధానాలకు పోటీ చేస్తుంది. టిడిపి 2, JSP, BJP లకు చెరో MPP స్ధానాన్ని కేటాయించాము.
అనపర్తి GBR కాలేజ్ గ్రౌండ్స్ లో వాకర్స్ తో అనపర్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులతో కలసి సమావేశమై, ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వారి మద్దతుని కోరడం జరిగింది.

















































