మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా నీళ్ల వినియోగం విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, తప్పును కప్పి పుచ్చుకుంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం
కేఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో పేర్కొంది నిజమా? ఉత్తమ్ ట్వీట్ నిజమా సమాధానం చెప్పాలని నిలదీత
నీళ్ల వినియోగంపై కేఆర్ఎంబీకి ఒక లెక్క.. తెలంగాణ ప్రజలకు మరో లెక్క చెబుతారా? అంటూ ఫైర్ 👇
21వ కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాలో 2026 సెప్టెంబర్ 21 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ 45.791 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎంజీకేఎల్‌ఐఎస్ ద్వారా బేసిన్ పరిధిలోని ప్రాంతాల అవసరాల కోసం కేవలం 10.653 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించినట్లు అజెండాలో పేర్కొంది.
ఎజెండాలో ఇలా ఉంటే మీరు మరో లెక్క చెబుతున్నారు? ఈ రెండింటిలో ఏది నిజం? ఏది తప్పు?
కేఆర్ఎంబీకి మీ ప్రభుత్వమే సమర్పించిన గణాంకాలు నిజమైతే, మీరు చేసిన ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లే కదా.
ఉత్తం గారూ మీరు.. కేఆర్ఎంబీని తప్పుదోవ పట్టిస్తున్నారా? తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారా?
ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా?
కృష్ణా నీళ్లను చరిత్రలో అతి తక్కువగా వినియోగించింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే.
నీళ్లను ఒడిసి పట్టకుండా కిందకు విడిచిపెట్టి ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారా?
తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.
🔶 తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ 👇
🔸రేవంత్ రెడ్డి పిరికిపందలా వ్యవహరిస్తున్నారు
🔸పబ్లిక్ హియరింగ్ ప్రైవేటు హియరింగ్గా మారింది
🔸రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు
🔸మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు
🔸మూసీ మా సుధీర్ రెడ్డి నియోజకవర్గం నుంచి పారుతుంది.. ఎందుకు అనుమతించలేదు
🔸ఈ రోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధం
🔸7300 కోట్ల రూపాయల ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణంతో మూసీకి టెండర్లు పిలిచారు
🔸ఎల్‌నినో పరిస్థితులు భయంకరంగా ఉంటె దాన్ని పట్టించుకోకుండా మూసీ ప్రక్షాళన పేరిట లూటీ చేస్తున్నారు
🔸ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు
🔸ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే, ఇంకోడు చుట్ట కాల్చుకోవడానికి అగ్గి కోసం వెతికినట్టు ఉంది రేవంత్ తీరు
🔸రూ. 6857 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ రూ. 9 వేల కోట్ల లోటుకు వెళ్ళింది
🔸విజన్ లేదు విస్డం లేదు
🔸అన్నం పెట్టమంటే పెదవులకు లిప్ స్టిక్ పూసినట్టు ఉంది
🔸ఇదే సౌదీలో అయితే రేవంత్, ఆయన మంత్రులను రాళ్లతో కొట్టి శిక్షించేవాళ్ళు
🔸ఆంధ్రకు నీళ్లు వదిలి చోద్యం చూశారు
🔸కరువును పట్టించుకోకుండా మూసీకి రంగులు వేస్తున్నాడు పెయింటర్ బాబు
🔸రూ. 7300 కోట్ల టెండర్లలో 30 శాతం కమిషన్ దొబ్బాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు
🔸ఆర్ఆర్ టాక్స్ అని మోడీ ఇదివరకే చెప్పాడు
🔸ఆదానీ, మేఘా లాంటి సంస్థలకు మూసీ టెండర్లు దక్కేలా రేవంత్ ప్రయత్నిస్తున్నాడు
🔸ఈ కరువులో కూడా రేవంత్ ఇంత అవినీతికి పాల్పడుతున్నారు
🔸పేదల మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాక్కోవడం సబబా?
🔸డీపీఆర్ లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరగడం రేవంత్ సొంత ఇంటి వ్యవహారమా?
🔸తాగడానికి నీళ్లు లేవు కానీ మూసీలో మల్లన్న సాగర్ నీళ్లు తెచ్చి పోస్తాడట
🔸మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు గురించి ఎవరికీ తెలియదు
🔸మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు అమరావతి నుంచి వచ్చింది
🔸అమరావతికి గ్రాఫిక్స్ తయారు చేసిన మెయిన్‌హార్ట్ సంస్థకే మూసీ డిజైన్లు అప్పగించారు
🔸రేవంత్ తాత జాగీరా అప్పనంగా రాష్ట్ర సంపద దోచిపెట్టడానికి
🔸వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆస్తులను కొల్లగొట్టేందుకు కూడా రేవంత్ స్కెచ్ వేశారు
🔸ఎన్ని నిర్బంధాలు పెట్టినా రేవంత్ దోపిడీని బీఆర్ఎస్ అడ్డుకుంటూనే ఉంటుంది
🔸మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు నష్టపోకుండా ఎంతటి పోరాటానికైనా సిద్ధం
🔸రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలి
🔶 తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి👇
🔸మూసీ ప్రాజెక్టుపై పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి ప్రజల మాట వినకుండా నిరంకుశంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది
🔸ఎవరికీ నష్టం జరగకుండా కేసీఆర్ ముందు చూపుతో నాడే మూసీ పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు
🔸బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం
🔸మూసీ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటూ.. ప్రభుత్వమే పొంతన లేకుండా మాట్లాడుతోంది
🔸దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం
🔸50 మీటర్ల బఫర్ జోన్‌ను 500 మీటర్లకు ఎలా పెంచారు?
🔸డీపీఆర్ లేకుండా ఎలా టెండర్లు పిలుస్తారు?
🔸కమీషన్లు తీసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేయవచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది
🔸ప్రభుత్వం డీపీఆర్ బయటపెట్టి.. ప్రజలకు అన్ని వివరించాలి
🔸బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది.. ఎవరి గూడు చెదరనివ్వబోము
🔸అధికారం ఉందని బలవంతంగా చేస్తామని అంటే ఊరుకునేది లేదు
🔸ప్రజల తరపున మాట్లాడేందుకు వెళ్లిన మమ్మల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు
🔸సీఎం రేవంత్ రెడ్డి అరాచకం చేయడం మానుకోవాలి
🔸కేసీఆర్ కట్టిన మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తామని అంటారు.. కానీ, కన్నేపల్లి నుంచి మాత్రం నీటిని ఎత్తిపోయరు
🔸రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఏమైనా కానీ నీళ్లు ఎత్తేది లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు
🔸కేసీఆర్ హయంలో రూ. 25 వేల కోట్లతో మూసీ ప్రక్షాళనకు ప్రణాళిక వేశాం
🔸అప్పుడు పేదల ఇళ్ల నుంచి ఒక్క ఇటుక కూడా తీయలేదు
🔸10 వేల గృహాలు బఫర్ జోన్లో ఉన్నాయి కనుక కేసీఆర్ కూల్చివేతలకు ఒప్పుకోలేదు
🔸ఆప్షన్ బీ అమలు చేద్దామనుకున్నాం
🔸ఎలేవేటేడ్ కారిడార్ అనుకున్నాం.. ఎన్నికల కోడ్ వచ్చింది.. ప్రభుత్వం మారింది
🔸ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోణంలో స్వలాభం కోసం రేవంత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు
🔸రేవంత్ చెప్పిన ప్రకారమే రూ. 50 వేల కోట్ల నుంచి రూ. లక్షా 50 వేల కోట్లకు పెరిగింది
🔸కేసీఆర్ ప్రతిపాదించిన రూ. 25 వేల కోట్ల ప్రాజెక్టు ఎక్కడ.. రేవంత్ లక్షా 50 వేల కోట్లు ఎక్కడ
🔸మూసీ బ్యూటీఫికేషన్ పేరిట లూటిఫికేషన్‌కు రేవంత్ కుట్ర చేస్తున్నారు
🔸డీపీఆర్ లేదు.. ఎస్టిమేట్స్ లేవు.. టెండర్లు, కమీషన్లు కొట్టేసేందుకు పిలిచారు.. వేల కోట్ల దోపిడీ జరుగుతోంది
🔸పర్యావరణ అనుమతి తీసుకున్నాకే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి
🔸బలవంతంగా ఆస్తులు గుంజుకోవడానికి మేము వ్యతిరేకం
🔸ప్రజాభిప్రాయ సేకరణకు మమ్మల్ని వెళ్లనివ్వలేదు.. పోలీసులను ప్రయోగించారు
🔸రేవంత్ రెడ్డి ఇలాంటివి బంద్ చేయాలి
తెలంగాణాలో సుమారు 58% మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు.
యాసంగి పంట వేయొద్దు అంటున్నారు. మరి రైతులకు, రైతు కూలీలకు ఉపాధి ఎలా?
పంట వేయకున్నా కూడా రైతులను ఆదుకునేందుకు రైతుబంధు ఇస్తారా?
కృష్ణా, గోదావరి జలాలను ఒడిసిపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది, ఇప్పటికైనా నీళ్లు లిఫ్ట్ చేయండి.
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగానే ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పాము.
ఈ అన్ని అంశాలపై అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశాము.
ప్రజల కోసం అఖిలపక్ష సమావేశానికి వచ్చాము, ఢిల్లీలో ఏర్పాటు చేసినా వెళ్తాము.
- ఎల్‌నినోపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లకు కోర్టు ఆంక్షలు
కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు
వివాదాస్పద వీడియోలు, వార్తా కథనాలు తొలగించాలని మీడియా సంస్థలకు ఆదేశాలు 👇
కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
కేటీఆర్ దాఖలు చేసిన రూ. 10 కోట్ల పరువు నష్టం దావాలో విచారణ సందర్భంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కేటీఆర్‌పై మరిన్ని తప్పుడు ఆరోపణలు చేయరాదని స్పష్టం చేసింది.
కేటీఆర్‌పై డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు చేయడం, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించడం, మహిళలు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులతో వ్యక్తిగత సంబంధాలపై ఆరోపణలు చేయడం వంటి అంశాలను కేటీఆర్ తన దావాలో సవాలు చేశారు.
సరైన ధ్రువీకరణ లేకుండా వీడియోలు, ఇంటర్వ్యూలు, వార్తా కథనాల ద్వారా ఇటువంటి ఆరోపణలను ప్రచారం చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు.
ఈ కేసులో కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీమతి విశ్వజనని బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు.
వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాస్పద ఆరోపణలకు సంబంధించిన ఇప్పటికే ప్రచురించిన వీడియోలు, వార్తా కథనాలను తొలగించాలని మన తొలివెలుగు టీవీ, ఏబీఎన్ తెలుగు, వాహిని టీవీ తదితర సంబంధిత మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది.
భవిష్యత్తులోనూ దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఇటువంటి కంటెంట్‌ను ప్రచురించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని నిలువరించడంతో పాటు, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ కేటీఆర్ రూ. 10 కోట్ల నష్టపరిహారంతో పాటు తప్పనిసరి, శాశ్వత నిషేధాజ్ఞల కోసం సివిల్ దావా దాఖలు చేశారు.
21 years, no progress: Congress continues its drama over the infeasible Tummidihatti barrage
The Tummidihatti irrigation project, originally proposed under the Pranhita-Chevella scheme in 2005, remains stalled after nearly two decades, with renewed discussions under the Congress government yet to produce tangible results.
The then undivided Andhra Pradesh government granted administrative approval in 2007 for a barrage with a proposed height of 152 metres and a storage capacity of 5 TMC.
However, objections from Maharashtra over submergence, inadequate clearances and inter-state water-sharing issues prevented construction from progressing.
Despite the foundation stone being laid in 2008, the project remained largely confined to official discussions and paperwork.
The BRS has accused successive Congress governments of failing to resolve these issues, alleging that the project was used for political gains without adequate groundwork.
It has also raised questions over the expenditure incurred on preliminary works and canals that later became unusable.
After Telangana's formation, the KCR-led government explored alternatives following technical studies and negotiations with Maharashtra.
The Pranhita-Chevella scheme was subsequently divided, with the Pranahitha project intended to serve the Adilabad region and the Kaleshwaram project developed separately.
Now, Chief Minister A. Revanth Reddy's government has revived discussions on Tummidihatti and held talks with Maharashtra.
However, key questions remain over the proposed barrage height, water availability, feasibility, statutory clearances and the timeline for construction.
The BRS alleges that the latest initiative is an attempt to divert attention from the stalled Kaleshwaram project and the government's irrigation record.
With no clear construction timeline announced, Tummidihatti continues to symbolise the long-standing challenges facing irrigation development in Telangana.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లనివ్వకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితుల పబ్లిక్ హియరింగ్‌కు వెళ్తున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఇతర నాయకులను అడ్డుకొని, అరెస్ట్ చేసిన పోలీసులు.
రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన నాయకులు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితుల పబ్లిక్ హియరింగ్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అడ్డుకొని, అరెస్ట్ చేసిన పోలీసులు.
🔎 A tale of four IAS officers hounded by the Revanth government 🚨
The Revanth Reddy government is increasingly coming under scrutiny for its treatment of senior IAS officers who played key roles during the decade-long KCR administration.
Instances of efficient officers being targeted and harassed have been increasing. Critics say this is a reminder of how even efficient officers suffer under an inefficient ruler.
The cases of Arvind Kumar, Smita Sabharwal, Syed Murtuza Rizvi and Jayesh Ranjan paint a troubling picture of experienced bureaucrats struggling to work under the present regime.
Arvind Kumar, who headed the Municipal Administration and Urban Development (MA&UD) Department under the BRS government, has been embroiled in a politically motivated and false Formula-E case.
Instead of utilising his administrative experience, the government has subjected the senior officer to prolonged legal scrutiny.
Smita Sabharwal, who served in the Chief Minister’s Office (CMO) during the KCR regime, faced police questioning over a social media post concerning the destruction of the Kancha Gachibowli forest.
Frequent transfers and her subsequent decision to go on leave have further fuelled concerns about the treatment of officers who refuse to toe the government’s line.
Syed Ali Murtuza Rizvi, the former Excise Secretary, opted for voluntary retirement amid tensions within the administration.
Allegations of internal disputes over financial interests and commissions involving the Chief Minister and the Excise Minister have led to his exit.
Now, Jayesh Ranjan, who headed the IT and Industries Department under the BRS government, is planning to opt for voluntary retirement.
Despite being considered eligible for the post of Chief Secretary, he was not appointed to the position, and an officer was instead brought in from Delhi.
There are also reports of his dissatisfaction with corruption in the MA&UD Department.
Discontent over his new assignments is reportedly among the factors contributing to his decision to opt for voluntary retirement in the coming days.
This series of incidents paints a grim picture of the state of governance in Telangana.
The Revanth Reddy government must answer for the alleged pressure and harassment faced by senior officers.
When experienced bureaucrats are sidelined, targeted or driven towards retirement, it raises serious questions about the administration’s priorities and its ability to utilise the state’s institutional expertise.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితుల పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఈడ్చుకెళ్లిన పోలీసులు.
తమ తరఫున మాట్లాడేందుకు వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసు వాహనం ముందు బాధితుల ఆందోళన.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన నడుస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితుల ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో.. పార్టీ ఎలాంటి నిరసనకు పిలుపు ఇవ్వకపోయినా, పోలీసులు తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించిన మాజీ మంత్రి.
రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితులపై ఈరోజు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున హాజరుకానున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, శాసనమండలిలో బీఆర్ఎస్ ఉప నాయకుడు ఎల్ రమణ.
🔶 ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు
🔶 కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు
🔶 రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం
🔶 కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుంది
🔶 తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు 👇
🔸ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
🔸ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువని మండిపడ్డారు.
🔸రాష్ట్రంలో సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
🔸నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
🔸 రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసుకుందామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని అన్నారు.
🔸చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
🔸పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు అందించామని కేటీఆర్ గుర్తుచేశారు.
🔸రైతుబంధు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు.
🔸కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకున్నామని తెలిపారు.
🔸కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు.
🔸అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన నాయకులు, ఇప్పుడు వాటి అమలుపై ప్రశ్నిస్తే తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
🔸హామీలు అమలు చేయలేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు.
🔸హామీల అమలుపై ప్రశ్నిస్తే మూడు నెలల్లో పిల్లలు పుడతారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని కేటీఆర్ విమర్శించారు.
🔸మూడు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
🔸తెలంగాణలో కరువు పరిస్థితులు ప్రకృతి వల్ల మాత్రమే ఏర్పడినవి కావని, నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు.
🔸గోదావరి, కృష్ణా నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారని విమర్శించారు.
🔸జూన్ 19, 2026న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించినప్పుడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని, పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని కోరామని గుర్తుచేశారు.
🔸అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టుపై ఇంతకాలం చేసిన ఆరోపణలు తప్పని తేలిపోతాయనే భయంతోనే బటన్ నొక్కడం లేదని ఆరోపించారు.
🔸దేవుడు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు పంపిస్తే, మధ్యలో పూజారి రేవంత్ రెడ్డి అడ్డుపడి బటన్ నొక్కకుండా అడ్డుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
🔸గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నీటిని వినియోగించుకుని ఉంటే కోటి ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని అన్నారు.
🔸ఒకవైపు పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
🔸రైతులకు రైతుబంధు సకాలంలో అందడం లేదని, కరెంటు, యూరియా, సాగునీటి సమస్యలు మరింత తీవ్రంగా మారాయని పేర్కొన్నారు.
🔸రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నెలనెలా ఢిల్లీకి వెళ్లి ఈఎంఐ కట్టడానికే ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు.
🔸రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని వ్యాఖ్యానించారు.
🔸ఢిల్లీలో ఈఎంఐ కడితేనే ముఖ్యమంత్రి పదవి మళ్లీ రెన్యువల్ అవుతుందంటూ విమర్శించారు.
🔸రైతులకు రైతుబంధు పడకపోయినా, రాహుల్ బంధు మాత్రం సమయానికి అందుతోందని వ్యంగ్యంగా అన్నారు.
🔸రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దోపిడీ వేదికగా మారిపోయిందని కేటీఆర్ ఆరోపించారు.
🔸రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి ఢిల్లీ నాయకత్వాన్ని సంతృప్తిపరచడంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని విమర్శించారు.
🔸ఢిల్లీలో బీజేపీ ప్రజలను విభజించడంలో బిజీగా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉందని వ్యాఖ్యానించారు.
🔸నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గొడం నగేష్ గెలిచినా నియోజకవర్గానికి ఏమి సాధించారని ప్రశ్నించారు.
🔸నిర్మల్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, చెక్‌డ్యామ్‌లు, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు.
🔸పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడారని విమర్శించారు. అవకాశవాదులు పార్టీని వీడినా, పోరాటవాదులు బీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు.
🔸తెలంగాణను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు.
🔸కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
🔸కేసీఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
🔸కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ సమయం లేదని, మరో ఏడాదిలో రాజకీయ పరిస్థితులు మారుతాయని వ్యాఖ్యానించారు.
🔸కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ బాటలోకి వస్తుందని అన్నారు.
🔸నిర్మల్‌లో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
🔸నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
🔸ఈ సభలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన బాధ్యతలు అప్పగించే అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
❇️ కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే పనులు అవుతాయా?
❇️ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను రూ. లక్ష కోట్ల అప్పుల్లో ముంచారు
❇️ రూ. 600 కోట్ల బియ్యాన్ని పందికొక్కులపాలు చేశారు
❇️ బిల్లుల కోసం తాను చచ్చిపోవడానికీ సిద్ధమని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటుంటే, సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు అంటున్నారు.. కాంగ్రెస్ రాజ్యంలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా?
❇️ రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ. లక్ష కోట్ల అప్పుల్లో మునిగిపోయింది.. 16 నెలలుగా గోదాములు, షాపుల్లో మూలుగుతున్న రూ. 600 కోట్ల విలువైన దొడ్డు బియ్యాన్ని పురుగులు, పందికొక్కులపాలు చేశారు
❇️ 100 కోట్లతో సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి, రూ. 18 కోట్లతో కాంపౌండ్ వాల్ కట్టడానికి, అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు డబ్బులుంటాయి కానీ.. 17,200 మంది డీలర్లకు నెలకు రూ. 10 కోట్లు గౌరవ వేతనం ఇవ్వడానికి పైసలు లేవా?
❇️ ఎన్నికల ముందు రూ. 5,000 గౌరవ వేతనం, రూ. 300 కమిషన్, మినీ సూపర్ మార్కెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకుని.. మూడేళ్లయినా కనీసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు
❇️ రేషన్ డీలర్లుతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదు.. తక్షణమే డీలర్ల సంఘాన్ని చర్చలకు పిలిచి హామీలు నెరవేర్చకపోతే అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
- గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
Gurukul administration in turmoil as in-charge principals threaten revolt
In-charge principals working under the Telangana Social Welfare Residential Educational Institutions Society are reportedly preparing for a collective protest over prolonged delays in promotions, pending transfers and mounting workloads.
The aggrieved staff have warned that they may relinquish their additional responsibilities or proceed on mass leave if the government fails to address their grievances.
The unrest has intensified following the formation of Departmental Promotion Committees (DPCs), which employees fear could further delay the long-pending promotion process.
Teachers have accused senior officials at the Society’s headquarters of creating hurdles and alleged that repeated complaints to the authorities and the office of Minister Adluri Laxman Kumar have failed to yield results.
Around 150 residential schools are currently being managed by in-charge principals, while six of the eight zones are functioning under in-charge zonal officers.
Employees allege that several key administrative positions remain vacant despite being eligible for promotion, while appointments through deputation have raised concerns over seniority and established procedures.
The additional responsibilities have placed considerable pressure on teachers, who must manage students’ accommodation, meals and academic performance while continuing their regular classroom duties.
They are also required to submit reports, collect information and complete online administrative work.
Staff further complain that they receive no additional allowances despite the extra workload, with some reportedly lacking formal orders assigning them the responsibilities.
The absence of clearly defined powers and accountability has added to their concerns, while teachers say inadequate supervision is affecting school administration.
It is reported that several in-charge principals in Khammam and Warangal districts have already sought relief from their responsibilities by submitting applications to zonal officers. Similar moves are expected in other districts.
Employee and teacher associations have urged the government to expedite promotions, fill vacant posts and resolve the administrative issues before the discontent escalates further.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన పాలేరు నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుడు దరిపల్లి అఖిల్.
కేటీఆర్‌ను కలవాలని వచ్చాను.. తనకు ఎటువంటి సహాయం వద్దని, కేటీఆర్‌ను కలవడమే సంతోషంగా ఉందని తెలిపిన అఖిల్.
రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని పేర్కొన్న అఖిల్.
Tummidihatti Barrage: What KCR did and why it was not feasible
The BRS government under former CM KCR made sustained efforts to secure Maharashtra’s consent for the Pranhita-Chevella project at Tummidihatti but eventually redesigned the plan after facing objections over submergence and concerns about water availability.
The original proposal envisaged a barrage at Tummidihatti with a Full Reservoir Level (FRL) of 152 metres to divert 160 TMC of water.
However, Maharashtra firmly opposed the proposed height, citing the submergence of forest areas and tribal villages in Gadchiroli and Chandrapur districts.
The neighbouring state refused to approve a height beyond 148 metres.
Following the formation of Telangana in 2014, KCR directed then minister Harish Rao and a team of engineers to hold several rounds of discussions with Maharashtra.
KCR himself met the state’s leadership in February 2015 to seek approval for the 152-metre proposal.
Maharashtra remained firm on its position but agreed to cooperate if the height was restricted to 148 metres. An agreement between the two states followed in 2016.
Water availability presented another major challenge.
According to the account, Central Water Commission (CWC) assessments indicated that only around 40–50 TMC could be reliably diverted at the reduced height under the proposed operating conditions, far below the project’s original requirement.
The CWC also advised Telangana to explore alternatives, citing limitations in the water available for diversion.
In response, the KCR government split the original project into two components.
It proposed the Dr. B.R. Ambedkar Wardha Project to irrigate two lakh acres in undivided Adilabad district and developed the Kaleshwaram project to serve the remaining areas.
The BRS alleges that the Congress government subsequently sidelined the Wardha project and revived the Tummidihatti proposal despite the earlier technical and interstate hurdles, raising questions over its feasibility.
Eenadu says sorry to KTR
Admits mistake for the first time in its 50-year history
In a major setback for Eenadu, the newspaper has admitted that its report claiming that the ACB Special Court had ordered the seizure of BRS Working President KTR passport was incorrect and expressed regret over the publication of the false report.
The admission came in response to legal notices issued by KTR’s counsel on September 30, following the publication of the report under the headline “KTR’s Passport Seized” in the newspaper’s Hyderabad edition on September 29.
The publication acknowledged that the report had misinterpreted a memo filed by the Anti-Corruption Bureau (ACB) before the ACB Special Court.
In its response, Eenadu clarified that the ACB had sought appropriate directions from the court regarding the passports, but the court had not passed any order for their seizure.
The newspaper admitted that its report had erroneously presented the contents of the ACB’s memo as a judicial order.
In a response dated October 13, the newspaper’s counsel stated that the error was unintentional and had occurred due to a misinterpretation of the memo.
The publication expressed regret over the mistake and acknowledged that the report had conveyed incorrect information.
The newspaper also informed KTR’s counsel that the clarification had been published in its October 7 edition and that the related reports had been removed from its digital and social media platforms following receipt of the legal notice.
It further stated that the demands raised in the notice had been addressed and requested that no further action be pursued in the matter.













