కేటీఆర్‌ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ.. ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.. నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది.. కేటీఆర్, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశం లేదు.. కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం లేదు.. నా వ్యాఖ్యలతో వారిని నొప్పించి ఉంటే అందుకు చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: కొండా సురేఖ
#KTR #KondaSurekha #Telangana
రెబల్ అభ్యర్థులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే వారు సస్పెండ్ అయినట్టే.. అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని సీఎం స్పష్టం.. ఎన్నికల వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రులకు సూచన.. ఆ తర్వాత ఎవరిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరిక.. కూటమి పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనన్న చంద్రబాబు
#AP #CMChandrababu #RebelCandidates #APLocalBodyElections
హైదరాబాద్‌లో భారీ రేషన్ బియ్యం స్కామ్.. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న మాఫియా.. హైదరాబాద్‌లో ఏక కాలంలో సోదాలు చేస్తున్న సివిల్ సప్లైస్.. పాలిష్ చేసిన బియ్యానికి కార్పొరేట్ బ్రాండింగ్‌తో అమ్మకం.. బహిరంగ మార్కెట్లో రేషన్ బియ్యాన్ని రూ.80 నుంచి 100కు అమ్మకం.. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో సన్న బియ్యం విక్రయం.. కర్మన్‌ఘాట్‌లో రైస్ డిపోలపై సివిల్ సప్లయ్స్, విజిలెన్స్
దాడులు
#Hyderabad #RationRice #RiceScam #VigilanceRaids
నవంబర్ 2న తెలంగాణకు కేంద్రహోంమంత్రి అమిత్ షా.. జన సమీకరణ, ఏర్పాట్లపై బీజేపీ నేతల సమావేశం.. రామచందర్ రావు, రాష్ట్ర బీజేపీ సహా ఇంచార్జి అభయ్ పాటిల్, పార్టీ ప్రధాన కార్యదర్శులు భేటీ.. 'ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. అరాచకతను అంతంచేద్దాం' నినాదంతో బీజేపీ పాదయాత్ర.. ఓపెన్ ప్లేస్‌లో కాకుండా ప్రజల మధ్య పాదయాత్ర ఉండాలని కేంద్రనాయకత్వం ఆదేశం.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మొజంజాహీ మార్కెట్లను పరిశీలించిన బీజేపీ నేతలు
#Telangana #BJP #AmitShah #BJPPadayatra
ఏపీలో స్థానిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం.. రెండ్రోజులు జరగనున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.. పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సులు
#AP #LocalElections #PostalBallotVoting
సీఎం చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా ఏపీ కేబినెట్ సమావేశం.. వర్చువల్‌గా హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు.. 45కు పైగా అజెండా అంశాలపై చర్చ.. అర్నబ్ తుఫాన్‌పై ప్రత్యేక సమీక్ష.. రూ.35 వేల కోట్ల పెట్టుబడులపై చర్చ
#AP #APCabinet #CMChandrababu #CycloneArnab
కోస్తా జిల్లాల్లో అర్నబ్ తుఫాన్ బీభత్సం.. అర్నబ్ తుఫాన్‌తో చిగురుటాకుల్లా వణికిన గోదావరి జిల్లాలు.. వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి, ఒకరి గల్లంతు.. నేలకూలిన వేల చెట్లు, విద్యుత్తు స్తంభాలు.. ఇంకా అంధకారంలోనే పలు జిల్లాలు.. అత్యధికంగా గోపాలపట్నంలో 31 సెం.మీ. వర్షపాతం.. నేలకొరిగిన వరి,కొబ్బరికి అపార నష్టం
#AP #APRains #CycloneArnab
యూపీ, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు.. ఎన్డీఏ కూటమి 16 చోట్ల విజయం, ఒక్క చోట మాత్రమే నెగ్గిన కాంగ్రెస్ (నాగపూర్).. అధికారంలో ఉన్న కర్ణాటకలో ఒక్కసీటు గెలవని కాంగ్రెస్.. కర్ణాటకలో నాలుగు సీట్లను క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీఏ
#MLCElections #MLCElectionResults #NDA #Congress
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నేడు ఏపీలో భారీ వర్షాలు.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు హెచ్చరిక.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SDMA
#AP #APRains #CycloneArnab #APSDMA
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో 11 జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు.. విజయనగరం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.. ఏలూరు, పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హాలిడే.. కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవు.. భారీ వర్షాల అంచనాతో సెలవు ప్రకటించిన అధికారులు.. మిగతా జిల్లాల్లో యథావిధిగా కొనసాగనున్న పాఠశాలలు
#AP #ArnabCyclone #SchoolHoliday
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా పునరుద్ధరణ కాని విద్యుత్ సరఫరా.. 48 గంటలుగా కరెంట్ లేక ఇబ్బందులు.. తాగునీటికి సైతం కష్టాలు పడుతున్న ప్రజలు.. పలు ప్రాంతాల్లో సెల్ టవర్ల నుంచి అందని సిగ్నల్స్.. ఇంటర్నెట్ లేక గూగుల్ పే, ఫోన్ పే యాప్‌లు పనిచేయక ఇబ్బందులు.. ఆన్‌లైన్ చెల్లింపులు జరగక కొనుగోళ్లకు అవస్థలు పడుతున్న వినియోగదారులు
#AP #AmbedkarKonaseema #ArnabCyclone #PowerSupply
హైదరాబాద్: ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ప్రొగ్రామ్‌లో పాల్గొననున్న రేవంత్.. నవంబర్ 1 వరకు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం
#Telangana #Congress #RevanthReddy
అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంతా ప్రవహిస్తున్న వాగులు, నదులు.. పలు చోట్ల కొట్టుకుపోయిన కాజ్‌వేలు, వంతెనలు.. మాడుగుల నియోజకవర్గంలో పొంగిన తాచేరు వాగు.. పాత బ్రిడ్జి మీద నుంచి ప్రవహిస్తున్న వరద నీరు.. అల్లూరి ఏజెన్సీతో పాటు నర్సీపట్నంకు రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రాకపోకలు.. ప్రమాదాలు జరగకుండా కాజ్‌వేల వద్ద పోలీస్ బందోబస్తు.. పాడేరు, నర్సీపట్నం వైపు ప్రయాణాలకు నానా అవస్థలు
#Anakapalli #Tacheru #CycloneArnab
ఇవాల్టి నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. రెండు రోజులపాటు పర్యటించనున్న సీఎం చంద్రబాబు
#AP #ArnabCyclone #CMChandrababu
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ పరిసరాల్లో వన్ వేలకు ప్లాన్.. ట్రాఫిక్ జామ్‌లకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కసరత్తు.. ట్రాఫిక్ నిలిచిపోయే 4 ప్రధాన బాటిల్‌నెక్ పాయింట్లను శాశ్వతంగా ఎత్తేసేందుకు సన్నాహాలు.. KBR పార్క్ చుట్టూ తరహాలో వన్ వేకు ప్లాన్
#HyderabadTraffic #ITCorridor #HitecCity #BioDiversityJunction #CyberabadTraffic #TrafficFreeHyderabad
హైదరాబాద్: TGPSC నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్‌లో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. MPSO, ASO పోస్టులకు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తులు.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులు.. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అర్హత
#TGPSC #TelanganaJobs #ASORecruitment #MPSO #GovtJobs #JobNotification #Hyderabad
అర్నబ్ తుఫాన్ బాధిత MSMEలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం.. రూ.40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలకు రూ.50 వేల సాయం.. రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న MSMEలకు రూ.లక్ష సాయం.. రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలకు రూ.1.5 లక్షల సాయం
#MSMERelief #CycloneArnab #APGovt
#ChandrababuNaidu #APIndustries
#SmallBusinessSupport #AndhraPradesh
రేపటి నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. రెండు రోజులపాటు పర్యటించనున్న సీఎం చంద్రబాబు
#ChandrababuNaidu #CycloneArnab #APReliefOperations #AndhraPradesh #APFloods
అమరావతి: అర్నబ్ తుఫాన్‌పై రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. రేపు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
#APCabinet #CycloneArnab #ChandrababuNaidu
#EmergencyCabinetMeeting #AndhraPradesh #Amaravati #APReliefOperations
