Pen Andhra (@PenAndhra) header
Pen Andhra (@PenAndhra) profile picture
Joined September 2026
Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)
🚨 Pen Andhra Exclusive ఒక్కరోజు వర్షానికే ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని 'అమరావతి' వరద దృశ్యం
29
230
24
1,011
41,144
వాతావరణం సరిగ్గా లేకపోతే అసలు హెలికాప్టర్‌ ఎలా వెళ్లింది? @etvandhraprades వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించ‌క‌పోయినా.. చంద్ర‌బాబును ఎవ‌రు పంపారు..? తుపాన్ స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ స్టంట్‌.. ప్రజల మధ్యకు వెళ్లకుండా.. హెలికాప్ట‌ర్‌లో తిరుగుతూ ఎల్లో మీడియా ద్వారా ప్ర‌చార హోరు
3
24
835
ప్రజాతీర్పును ట్యాంపర్ చేయడంలో చంద్రబాబు సూపర్ సక్సెస్ - నాటి ఈవీఎంల ట్యాంపర్‌ను కప్పి పుచ్చేందుకు మరో బరితెగింపు స్థానిక ఎన్నిక‌ల్లో నామినేషన్ల ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు అడుగడుగునా టీడీపీ అకృత్యాలు పచ్చ మూకను.. కొంద‌రు ఖాకీల‌ను ఉసిగొల్పి.. ఎన్నికలను ప్రక్రియను నిర్వీర్యం. అభ్యర్థులపై పిడిగుద్దులు, ప్రత్యర్థులను కత్తిపోట్లు పొడిచారు. మహిళల చీరలు లాగారు.. నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు.. దొంగ నామినేషన్లు వేశారు చివరికి అభ్య‌ర్థుల దొంగ సంత‌కాల‌తో నామినేషన్ల తిరస్కరణలూ చేయించారు దేశం మొత్తం దారుణాలు చూసింది.. బరితెగింపును గ‌మ‌నించింది.. విచ్చలవిడితనాన్ని నిశితంగా పరిశీలించింది మేధావులంతా ప్ర‌శ్నించారు. ఏపీలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని దాడుల‌ను ఖండించారు. వేలాది దౌర్జ‌న్యాలు, వంద‌లాది దాడులు చేసి గెలిచి.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా టీడీపీ చెప్పుకుంటుంటే పౌర స‌మాజం అస‌హ్యించుకుంటుంది. అసుర వధ జరిగి.. ప్ర‌జాస్వామ్యం మ‌ళ్లీ వ‌ర్ధిల్లే రోజు వ‌స్తుంది.. మీ బరితెగింపునకు భారీ మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి అని ఏపీ పౌరులు అంటున్న మాట.
1
7
28
1,057
లోకేష్ బ‌రితెగింపున‌కు బుద్ధిచెప్పిన ‘అనంత’ ప్ర‌జ‌లు - భారీ మెజార్టీతో మేయ‌ర్ పీఠం వైయ‌స్సార్‌సీపీ కైవసం నారా లోకేష్ అండదండలతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సాగిస్తున్న‌ దౌర్జన్యాలు, బెదిరింపులు, వసూళ్లకు స్థానిక అనంత‌పురం ప్ర‌జ‌లు తమ ఓటు దెబ్బతో గట్టి గుణపాఠం చెప్పారు. టీడీపీ కండువాల‌తో పోలింగ్ బూత్‌లలోకి ప్ర‌వేశించి ప్రభావితం చేసినా, రిగ్గింగ్‌లకు తెగబడినా వైయస్సార్‌సీపీ ప్రజాబలం ముందు కూటమి చ‌తికిల‌పడింది. బ‌లంగా ఉన్నామ‌ని కూట‌మి భావించిన చోట‌.. టీడీపీ అరాచ‌కాల ఆంక్ష‌ల‌ను ఛేదించి మేయర్ పీఠాన్ని వైయస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అనంత ప్ర‌జానీకం సామాన్యుడికి ప‌ట్టం క‌ట్టింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సాగించిన కబ్జాలు, దందాలు, చికెన్ షాపుల నుంచి తోపుడు బండ్ల వరకు చేసిన అక్రమ వసూళ్లే ఈ ఓటమికి ప్రధాన కారణమని సొంత పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. జూ.ఎన్టీఆర్ త‌ల్లిని తిట్టినా, వాటా కోసం వైన్‌షాపు త‌గ‌ల‌బెట్టినా, ఎగ్జిబిష‌న్ నిర్వాహ‌కుల నుంచి రూ.20 ల‌క్ష‌లు డిమాండ్ చేసినా, భూములు క‌బ్జా చేసినా, డ‌బ్బుల వ‌సూళ్ల‌కు తెగ‌బ‌డినా.. అధిష్టానం క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. నారా లోకేష్ అండ‌దండ‌ల‌తో ఎమ్మెల్యే ద‌గ్గుపాటి అరాచ‌కాలు మితిమీరిపోతున్నా.. కనీసం మందలించేందుకు కూడా టీడీపీ క్రమశిక్షణ కమిటీ భ‌య‌ప‌డింది. ద‌గ్గుపాటి ఆగ‌డాల‌తో విసిగిపోయిన ‘అనంత’ ప్ర‌జ‌లు.. ఓటుతో త‌గిన బుద్ధి చెప్పారని స్థానిక టీడీపీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.
13
48
856
చిన్న శ్రీనుకు షాకిచ్చిన హైకోర్టు - కుమార్తె ముస్కాన్ జైన్ అలియాస్ సిరి స‌హ‌స్ర‌ క్యాస్ట్ స‌ర్టిఫికెట్‌పై కీల‌క ఆదేశాలు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల హక్కులను కొల్లగొట్టేందుకు టీడీపీ నేత మ‌జ్జి శ్రీను పన్నిన ‘ఫేక్ క్యాస్ట్ స‌ర్టిఫికెట్‌’ కుట్రకు ఏపీ హైకోర్టు బ్రేకులేసింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన త‌న కుమార్తె ముస్కాన్ జైన్ అలియాస్ సిరి సహస్రకు బీసీ-డీ సర్టిఫికెట్ కట్టబెట్టి, తెర్లాం జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవాలని చూసిన చిన్న శ్రీనుకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. జైన్ కుటుంబంలో జ‌న్మించిన‌ సిరి సహస్రను 2021లో మ‌జ్జి శ్రీను ద‌త్త‌త తీసుకున్నారు. ఓసీ కులంలో పుట్టిన ఆమెకు బీసీ స‌ర్టిఫికెట్ ఎలా వ‌ర్తిస్తుంద‌ని వైయ‌స్సార్ సీపీ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. ఈ అభ్యంత‌రాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోగా, సిరి స‌హ‌స్ర నామినేష‌న్‌ను ఆమోదించ‌డంతో వైయ‌స్సార్ సీపీ అభ్య‌ర్థి బొమ్మి శ్రీనివాస‌రావు హైకోర్టును ఆశ్ర‌యించారు. దత్తత సాకుతో ఓసీ వ్య‌క్తికి ‘తూర్పు కాపు (BC-D)’ కుల సర్టిఫికెట్ ఇప్పించడం సుప్రీంకోర్టు తీర్పులకే విరుద్ధమని వైయస్సార్‌సీపీ వాదించింది. ఫేక్ స‌ర్టిఫికెట్ వ్య‌వ‌హారంపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు పూర్త‌య్యే వ‌ర‌కు ముస్కాన్ జైన్ అలియాస్ సిరి స‌హ‌స్ర‌ బీసీ సర్టిఫికెట్‌తో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా చూడాల‌ని ఆదేశించింది.
స‌ర్వం పాయే..! చిన్న శ్రీనుకు త‌న రాజ‌కీయం రుచి చూపించిన చంద్ర‌బాబు - వైసీపీ తరఫున జెడ్పీ ఛైర్మన్‌గా ప‌నిచేసి, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఒక వెలుగు వెలిగిన చిన్న శ్రీను రాజకీయ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. - కుమార్తెకు మేయర్ సీటు, భవిష్యత్తులో జరిగే డీలిమిటేషన్‌లో ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేస్తామంటూ నమ్మబలికి చంద్రబాబు చిన్న శ్రీనును టీడీపీలోకి చేర్చుకున్నారు. - టీడీపీలో చేరిన తర్వాత చిన్న శ్రీను ఆశలకు గండి పడింది. పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఆయనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా చంద్రబాబు షాకిచ్చారు. - విజయనగరం మేయర్ సీటును ఆశించిన చిన్న శ్రీనుకు దక్కకుండా పోయింది. చివరికి ఆ మేయర్ సీటును అవనపు భార్గవికి కేటాయించడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. - కుమార్తెకు మేయర్ సీటు పోవడంతో పాటు, రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ లేకపోవడంతో ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశం లేకపోవడంతో చిన్న శ్రీనుకు తీవ్ర నిరాశ ఎదురైంది. - ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు, టీడీపీలో చేరి సర్వం కోల్పోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
10
139
20,001
1995 నుంచి 2021 వరకు స్థానిక సంస్థల ఫలితాలు స్థానిక సంస్థల్లో అధికార పార్టీయే ఎప్పటి నుంచో విజయం సాధిస్తూ వస్తుంది.
5
69
7,370
రిగ్గింగ్ చేసినా.. నెగ్గ‌ని మంత్రి అనుచ‌రుడు అనంత‌పురంలో రిగ్గింగ్ చేసిన వార్డులో బీజేపీ అభ్యర్థి ఓటమి అనంతపురం మున్సిప‌ల్ కార్పొరేషన్ 30వ డివిజన్‌లో మంత్రి సత్యకుమార్ వర్గీయుల రిగ్గింగ్ అదే డివిజన్ లో 68 ఓట్లతో వైసీపీ అభ్యర్థి వన్నెం శివరామిరెడ్డి విజయం
DEMOCRACY UNDER ATTACK IN AP! TDP leaders are allegedly occupying polling stations on the instructions of Anantapur MLA Daggubati Prasad, while police and election officials turn a blind eye. @ECISVEEP @CEOAndhra @SpokespersonECI @ANI @PTI_News @IndiaToday @IndianExpress @the_hindu @ndtvindia @News18India @TimesNow @republic @htTweets
17
3
51
1,220
TDP-linked attackers stand exposed by locals, while TDP’s propaganda machinery has spent two days blaming YSRCP for the attack on the @IndiaToday team in Pulivendula. Locals have identified Viswanatha Reddy and his associates as those responsible. His wife, Challadevi, is contesting as a TDP ZPTC candidate from Lingala. Will TDP now answer these specific accusations instead of spreading blame? AP DGP Harish Kumar Gupta, Kurnool Range DIG Koya Praveen and Kadapa SP Nachiketh Vishwanath owe the public an explanation. What action have you taken in the last two days? Where is the footage from the four CCTV cameras in front of the polling booth? Why has it not been released? Why did the police stationed there fail to stop the attack? Have these officers surrendered their responsibility to @ncbn and @naralokesh? Do they need political permission to investigate people linked to TDP? Every unanswered question deepens concerns of a cover-up. Release the CCTV footage, investigate the evidence presented by locals and arrest those responsible. Does wearing a TDP badge guarantee immunity from the law? @ANI @PTI_News @ndtv @TimesNow @CNNnews18 @ThePrintIndia @TheHindu @IndianExpress @NewIndianXpress @BBCWorld @Reuters
3
16
4
24
4,819
నేష‌న‌ల్ మీడియాపై దాడి చేసింది టీడీపీ వ్య‌క్తులే.. - @IndiaToday టీమ్‌పై దాడి చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ గుట్టురట్టు చేసిన స్థానికులు ఏపీలో స్థానిక ఎన్నిక‌ల వేళ‌ @ncbn ప్రభుత్వ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా జాతీయ మీడియా ప్రతినిధులపై దారుణంగా దాడికి తెగబడటం.. కూటమి ప్రభుత్వ అహంకారానికి, శాంతిభద్రతల విచ్ఛిన్నానికి పరాకాష్ఠ. పులివెందులలో ‘ఇండియా టుడే’ (India Today) అసోసియేట్ ఎడిటర్ అబ్దుల్ బషీర్, కెమెరామన్ విజయ్‌లపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి, కెమెరాలు పగులగొట్టి, ఫోన్లు లాక్కొని పచ్చ మూకల వైపరీత్యం ఏపీ ప్రతిష్టను దేశంలోనే సిగ్గుతో తలదించుకునేలా చేసింది. రాష్ట్రంలో పచ్చ మూకల జంగిల్ రాజ్‌కు అద్దం పడుతోంది. పులివెందుల అహోబిలపురం పోలింగ్ బూత్ ఎదురుగా పోలింగ్ ప్ర‌క్రియ‌ను క‌వ‌ర్ చేస్తున్న జాతీయ మీడియా ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిన టీడీపీ గూండాల వివరాలను స్థానికులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఆరోజు దాడి జ‌రిగిన ప్రాంతంలో, దాడి జ‌రిగిన స‌మ‌యంలో ఉన్న‌వారి వీడియోల‌ను ప‌రిశీలించారు. వీరంతా పులివెందుల ప‌ట్ట‌ణానికి సంబంధించిన వాళ్లు కాదు.. అయినా పోలింగ్ రోజున బూత్‌ల‌ను ఆక్ర‌మించుకునే ప‌నిలో భాగాంగా లింగాల మండ‌లం నుంచి వ‌చ్చారు. ప‌క్క మండ‌లం నుంచి వ‌చ్చి దారుణాల‌కు తెగ‌బ‌డ్డారు. లింగాల మండలం, ఇంట్యాల గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి, ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలను స్థానికులు బ‌య‌ట‌పెట్టారు. ఈ విశ్వనాథరెడ్డి భార్య చల్లాదేవి ప్రస్తుతం లింగాల నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు. నేష‌న‌ల్ మీడియాపై దాడి జ‌రిగి రెండ్రోజులు గడుస్తున్నా సరే.. బాధ్యులపై కనీస చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అహోబిలపురం పోలింగ్ బూత్ ఎదురుగా ఏకంగా 4 సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. గేటు వద్ద 20 మంది పోలీసులు ఉన్నారు. అంత మంది పోలీసుల కళ్లముందే, సీసీ కెమెరాల నిఘాలో దాడి జరిగినా చ‌ర్య‌లు శూన్యం. అధికార పార్టీ ఆదేశాల‌తోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఈ కేసును నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స్థానికులు మండిపడుతున్నారు. జాతీయ మీడియాపై పచ్చ మూకలు చేసిన దౌర్జన్యాన్ని వైసీపీపై నెట్టేందుకు ఎల్లో మీడియా ద్వారా విచ్చ‌ల‌విడిగా విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇండియా టుడే నేషనల్ మీడియా రిపోర్టర్‌ @Journo_Abdul, కెమెరామెన్‌పై దారుణంగా దాడి జరిగితే కనీసం స్పందించని స్థితిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందంటే ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ప్రజలు, రాజ‌కీయ విశ్లేష‌కులు. @ANI @PTI_News @ndtv @IndiaToday @TimesNow @CNNnews18 @ThePrintIndia @TheHindu @IndianExpress @NewIndianXpress @BBCWorld @Reuters
2
53
2
164
3,310
బద్దలైన కూటమి బలంపై భ్రమ! - వైయస్సార్‌సీపీలో కొత్త ఆత్మవిశ్వాసం - గెలుపోటములకు అతీతంగా స్థానిక ఎన్నికలు ఇచ్చిన కీలక రాజకీయ సంకేతం రాజకీయాల్లో వాస్తవ బలం కంటే బలంగా కనిపించడం కొన్నిసార్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనినే రాజకీయ పరిభాషలో Perception of Power అంటారు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక కూటమిగా ఏర్పడితే, వారి వాస్తవ బలం ఎంత అన్నదానికంటే, ముగ్గురూ కలిశారు కాబట్టి వారిని ఎదుర్కోవడం కష్టమనే భావన ప్రత్యర్థుల్లో ఏర్పడుతుంది. ప్రత్యర్థుల బలం అంతకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మానసిక భావన వారిని వెనక్కి లాగుతుంది. రాజకీయాల్లో ఇదొక రకమైన మానసిక ఆధిపత్యం. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విషయంలోనూ ఇటువంటి భావనే నెలకొంది. మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉండటం, కేంద్రంలోనూ అనుకూల ప్రభుత్వం ఉండటంతో ఈ కూటమిని ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. కూటమికి ఉన్న వాస్తవ ప్రజాబలం కంటే, దాని చుట్టూ నిర్మితమైన బలమైన రాజకీయ వర్గీకరణ బలం ప్రత్యర్థులపై మానసిక ప్రభావం చూపింది. అయితే, తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలు ఈ Perception of Powerను బలంగా దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే అంశాలను పక్కనపెడితే, రాజకీయంగా ఒక ముఖ్యమైన మార్పు కనిపించింది. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పటికీ, వాటిని సమర్థంగా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా వ్యక్తమైంది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రిగ్గింగ్‌, బూత్‌ల ఆక్రమణ, ప్రతిపక్ష అభ్యర్థులు, ఏజెంట్లను అడ్డుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ల ఆక్రమణను గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను మాత్రమే రాజకీయ బలానికి కొలమానంగా తీసుకోవడం సరికాదు. ఈ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి కనిపించిన అతిపెద్ద సానుకూల పరిణామం కార్యకర్తల్లో మానసికంగా వచ్చిన మార్పు. అధికారం కోల్పోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా ఎదురయ్యే ప్రధాన సవాలు కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టడం. అధికార పార్టీ బలంగా కనిపిస్తున్నప్పుడు ప్రతిపక్ష కార్యకర్తల్లో సహజంగానే కొంత నిరుత్సాహం, రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంటాయి. ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నాడనే దానికంటే, అతడిని ఎదుర్కోగలమనే నమ్మకం ఎంతవరకు ఉందన్నదే రాజకీయ పార్టీల మనుగడను నిర్ణయిస్తుంది. ఈ కోణంలో చూస్తే స్థానిక ఎన్నికలు వైయస్సార్‌సీపీకి కీలక మలుపుగా కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఒకవైపు నిలబడినా, వాటిని ఎదుర్కోవడానికి వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ముందుకు రావడం ముఖ్యమైన పరిణామం. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోటీలో నిలవడం, పార్టీ అభ్యర్థులకు అండగా ఉండటం, ఎన్నికల ప్రక్రియలో ఎదురైన సమస్యలపై పోరాడటం వంటి పరిణామాలు పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న క్రియాశీలకతకు సంకేతాలుగా నిలిచాయి. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలు, వార్డుల స్థాయిలో పార్టీకి వెన్నెముకగా నిలిచే కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల్లో కనిపించిన చైతన్యం వైయస్సార్‌సీపీ భవిష్యత్తుకు సానుకూల సంకేతం. రాజకీయ పార్టీలకు నాయకత్వం ఎంత ముఖ్యమో, కార్యకర్తల ఆత్మవిశ్వాసం అంతకంటే ముఖ్యం. నాయకుడు దిశానిర్దేశం చేయగలడు. కానీ పార్టీని ప్రజల మధ్య నిరంతరం సజీవంగా ఉంచేది కార్యకర్తలే. వారు పుంజుకున్నప్పుడు పార్టీ సంస్థాగతంగా బలపడుతుంది. వారు క్రియాశీలకంగా మారినప్పుడు రాజకీయ పోరాటానికి కొత్త ఊపు వస్తుంది. ఈ స్థానిక ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి కనిపించిన అసలైన బలం ఇదే. - మరో ముఖ్యమైన అంశం తిరిగి అధికారంలోకి రాగలమనే నమ్మకం. రాజకీయాల్లో ఓటమి తర్వాత పార్టీ తిరిగి పుంజుకోవాలంటే మొదట నాయకులు, కార్యకర్తల్లో ఆ నమ్మకం ఏర్పడాలి. గెలుపు సాధ్యమేననే విశ్వాసం లేనప్పుడు ఎంత బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించడం కష్టం. - స్థానిక ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ శ్రేణులు ప్రదర్శించిన పోరాట పటిమను చూస్తే, తిరిగి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో పాటు అది సాధ్యమేననే నమ్మకం కూడా బలపడుతున్నట్లు కనిపిస్తోంది. - ఈ పరిణామం కూటమి రాజకీయ ఆధిపత్యానికి మానసికంగా ఒక సవాలు విసిరింది. - మూడు పార్టీలు కలిసినంత మాత్రాన అవి అజేయశక్తిగా మారవని, అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రత్యర్థులు బలహీనులుగా మిగిలిపోరని స్థానిక ఎన్నికల పోటీ గుర్తుచేసింది. - కూటమి బలంపై ఏర్పడిన భ్రమను సవాలు చేయడం, కూటమిని ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, కార్యకర్తలను తిరిగి క్రియాశీలకంగా మార్చడం వైయస్సార్‌సీపీకి ఈ ఎన్నికలు అందించిన ముఖ్యమైన అవకాశాలు. - ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు మొదట ఓట్ల లెక్కింపులో మొదలవదు. ప్రత్యర్థిని ఎదుర్కోగలమనే నమ్మకంతో మొదలవుతుంది. ఆ నమ్మకమే పోరాటానికి పునాది. ఆ పోరాటమే రాజకీయ పునరుజ్జీవనానికి దారితీస్తుంది. స్థానిక ఎన్నికలు వైయస్సార్‌సీపీకి అందించిన అత్యంత ముఖ్యమైన రాజకీయ సంకేతం ఇదే.
7
24
2
154
9,493
జగన్ హెలికాప్టర్ ఆపమన్నది పెదబాబేనా..? నిన్న పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి వస్తున్న వైఎస్‌ జగన్ హెలికాప్టర్ దిగనీయకుండా ప్రభుత్వాధికారులు అడ్డుకునే ప్రయత్నంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. తాము అడ్డుకోలేదంటూ కలెక్టర్, ఎస్పీలు ఇచ్చిన వివరణలు కూడా వాస్తవ దూరమైనని తేలుతోంది. నిన్న పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో బూత్‌ల‌ రిగ్గింగ్, 80 బూత్‌ల్లో 70 చోట్ల ఏజెంట్లను బయటకు లాగేయడం ఉదయం నుంచి జరుగుతున్న దృష్ట్యా ఈ అంశాన్ని దేశం దృష్టికి జగన్ తీసుకెళ్లే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ ముందుగానే పసిగట్టి చంద్రబాబు కార్యాలయానికి సమాచారం ఇచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పెదబాబుకు ఈ సమాచారం చేరవేయడం, ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆదేశాలు ఇచ్చారని ఆ వర్గాలు చెప్తున్నాయి. ఆ ఆదేశాలు అందిన వెంటనే DIG, SP, Collectorకు, ఏవియేషన్ అధికారులకు సమాచారం ఇచ్చి జగన్‌ను ఆపే ప్రయత్నం చేయడం, అది బెడిసికొట్టడం తెలిసిందే. పులివెందులలో దిగిన తర్వాత కూడా పైలెట్ల దగ్గర నుంచి స్టేట్‌మెంట్ల కోసం ఒత్తిడి తీసుకురావడం మొత్తం కుట్రను నిర్ధారిస్తోంది. వాస్తవం ఏంటంటే.. 27 తారీఖు నుంచి 1వ తారీఖు వరకూ హెలికాప్టర్ ఉదయం నుంచి సాయంత్రం వరకూ దిగేందుకు ముందస్తుగానే అనుమతి ఇచ్చారు. అంతేగాక రీషెడ్యూల్ సమాచారాన్ని 31వ తేదీ మరోసారి అధికారులకు జగన్ కార్యాలయం పంపించింది, నిర్ధారణ కూడా చేసుకుంది. కానీ దాన్ని దాచేసి, వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిన్న కలెక్టర్, ఎస్పీలతో ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించింది.
3
40
147
14,614
హేమంత్ కు ఇచ్చిన ట్రీట్ మెంట్.. వీళ్లకూ ఇస్తారా? రాప్తాడులో ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థినులపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన హేమంత్ కు పోలీసులు ఇన్ స్టెంట్ శిక్ష వేశారు. హేమంత్ కాళ్లపై ఆరురౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బాలికపై ఎల‌క్ట్రిక్‌ రంపంతో దాడికి తెగబడిన హేమంత్ కు ఏ శిక్ష వేసినా తక్కువే. మరి పెద్దోళ్ల విషయంలోనూ ఇలాంటి శిక్షలు వేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఘటనల్లో అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు దొరికిపోయిన ఘటనల్లో ఎందుకు ప్రభుత్వం నిందితులను ఉపేక్షిస్తోంది? - జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగిని శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసి, ఐదు సార్లు అర‌వ‌కుండా అబార్షన్లు చేయించాడు. న్యాయం కోసం పోరాడిన అర‌వ శ్రీధ‌ర్ బాధితురాలు హ‌ర్ష‌వీణ‌పైనే కేసులు పెట్టారు. అంటే సామాన్యుడికో చట్టం.. పేదవాడికో చట్టం అనేగా అర్థం. - టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన వీడియోను బాధితురాలే విడుదల చేసింది. - గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళతో ఫోన్లో వెలికి చేష్టలు చేసి దొరికారు. - తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఒక వివాహితను లోబర్చుకుని శారీరకంగా వాడుకుని ఆమె నుంచి డబ్బులు తీసుకుని తర్వాత వేధింపులకు గురిచేశాడు. - ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపల్ ను శారీరకంగా, మానసికంగా వేధించాడు. - మంత్రి సంధ్యారాణి పీఏ ఒక మహిళను లైంగికంగా వేధించి అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాడు. - శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ జనసేన మహిళా నాయకురాలు వ్యక్తి గత వీడియోలను ఒక డ్రైవర్ ద్వారా సేకరించి వారిని బెదిరించాడు. ఇలాంటి ఘటనల్లో మరి హేమంత్ కు విధించిన శిక్షే ఈ పెద్దవాళ్లకీ ఎందుకు వర్తింపచేయరు? అని ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన‌ నాటి నుంచి ఈ 28 నెలల్లో బాలికలు, మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, దారుణాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఇస్తున్న ఈ ఇన్ స్టెంట్ శిక్షలు సరైన విధానమే అయితే.. ఈ దారుణాలకు ఎందుకు అడ్డుకట్ట పడటంలేదు? ఎందుకు ఆగడం లేదు.?
2
18
1
74
865
నెల్లూరు ఎన్నికల రిగ్గింగ్ లో అన్ని ర్యాంకులు "నారాయణ"వే
8
37
653
పులివెందుల స్థానిక ఎన్నికల్లో TDP అక్రమాలు, దౌర్జన్యాలు 1.రాజారెడ్డి కాలనీలో మహిళా ఓటర్లపై దాడులు పులివెందుల మున్సిపాలిటీ 38వ వార్డు రాజారెడ్డి కాలనీలో మహిళా ఓటర్లపై టీడీపీ నేతలు దాడులకు దిగారు. మహిళల తలలు పగలగొట్టారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని పోలింగ్‌ బూత్‌ వద్ద అడ్డుకున్నారు. 2. ఇస్లాంపురంలో మహిళా ఓటర్లను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ఇస్లాంపురం పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేశాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. 3. తెల్లవారుజామునే పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ పులివెందులలో ఉదయం 5 గంటలకే టీడీపీ శ్రేణులు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించుకున్నాయి. వైయస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను లోపలికి అనుమతించకుండా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. పోలింగ్‌ ప్రారంభానికి ముందే అక్రమాలకు తెరలేపాయి. 4. దొంగ ఓటు వేసిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామగంగిరెడ్డి పులివెందులలో దొంగ ఓటు వేశారు. ఆయన అసలు ఓటు వేంపల్లి మండలం నందిపల్లెలో ఉంది. అయినా పులివెందులలో ఓటు వేశారు. 5. అహోబిలాపురంలో టీడీపీ శ్రేణులపై మహిళ ఆగ్రహం అహోబిలాపురం పాఠశాల వద్ద టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6. సాక్షి టీవీ రిపోర్టర్‌పై రాళ్ల దాడి పులివెందులలో ఎన్నికల సరళిని కవర్‌ చేసేందుకు వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్‌పై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఎన్నికల అక్రమాలను కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులనూ లక్ష్యంగా చేసుకున్నాయి. 7. దుష్యంత్‌రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు పులివెందుల మున్సిపల్‌ వైయస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి చవ్వా దుష్యంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. వైయస్‌ జగన్‌ను కలిసేందుకు కూడా అనుమతించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్నారు. 8. జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన దస్తగిరి తన కారును వైయస్‌ జగన్‌ కాన్వాయ్‌కు అడ్డుగా పెట్టారు. జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వద్దకు దస్తగిరి కారును అనుమతించారు. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. 9. ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వైయస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి రిటర్నింగ్‌ అధికారిని కలిసేందుకు వెళ్తున్న కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయంలోకి అనుమతించకుండా రోడ్డుపైనే నిలిపివేశారు. 10. ఆర్వో కార్యాలయానికి తాళాలు పోలింగ్‌ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వైయస్సార్‌సీపీ అభ్యర్థులు వస్తున్నారని తెలిసి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి తాళాలు వేశారు. మున్సిపల్‌ కార్యాలయం ప్రధాన గేట్లను కూడా మూసివేశారు. 11. ముళ్లకంచెలతో ఆర్వో కార్యాలయం దిగ్బంధం వైయస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులు ఆర్వో కార్యాలయానికి చేరుకోకుండా పోలీసులు ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. డ్రోన్‌ కెమెరాలతో వైయస్సార్‌సీపీ కార్యకర్తలపై నిఘా పెట్టారు. 12. రీపోలింగ్‌ కోసం వైయస్సార్‌సీపీ అభ్యర్థుల ధర్నా పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ, రిగ్గింగ్‌, ఏజెంట్లపై దాడులకు నిరసనగా వైయస్సార్‌సీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి వైయస్‌ ప్రమీలమ్మ, కౌన్సిలర్‌ అభ్యర్థులు ఆర్వో కార్యాలయం మెట్లపై కూర్చొని ధర్నా చేపట్టారు. రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 13. పోలింగ్‌ లెక్కల్లో భారీ వ్యత్యాసం పులివెందులలో ఇతరుల కేటగిరీలో కేవలం 14 మంది ఓటర్లు మాత్రమే ఉండగా, ఉదయం 11 గంటలకే ఆ కేటగిరీలో 681 ఓట్లు పోలైనట్లు గణాంకాలు చూపించారు. మొత్తం 54,532 ఓట్లలో 681 ఓట్లు ఇతరుల కేటగిరీలో నమోదయ్యాయి. ఈ లెక్కల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. 14. నాలుగు గంటల్లోనే 34 శాతం పోలింగ్‌ పులివెందులలో ఉదయం 11 గంటలకే 34 శాతం పోలింగ్‌ నమోదైంది. జమ్మలమడుగులో 42.5 శాతం నమోదైంది. వైయస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించకుండా రిగ్గింగ్‌ చేశారనే వివాదం నేపథ్యంలో ఈ పోలింగ్‌ లెక్కలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. 15. ఎన్నికల అక్రమాలపై జగన్‌ నిరసన పులివెందులలో ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వైయస్‌ జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్వో తనూజ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో చిన్నయ్యకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. ఆర్వో కార్యాలయం ముందు జగన్‌ నిరసనకు కూర్చున్నారు.
6
16
335
చిత్తూరులో పోలింగ్ బూత్ ను కబ్జా చేసిన టీడీపీ వల్లియప్ప నగర్ బూత్ లో దర్జాగా రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ గూండాలు ప్రజాస్వామ్యంపై పచ్చ ముఠా చేస్తున్న దాడికి కొమ్ముకాస్తున్న పోలీసులు, ఎలక్షన్ సిబ్బంది
2
16
41
520
ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంటే.. ప‌తివ్ర‌త ప‌ర‌మాన్నం వండుతోంది.
7
35
2
270
2,863
మున్సిపల్‌ ఎన్నికల అక్రమాల మోడస్‌ ఆపరండీ - టీడీపీ ద‌శ కుట్ర‌ల దండ‌యాత్ర‌ - ముందుగా ప్రతిపక్ష నాయకులను ఎన్నికల ప్రక్రియకు దూరం చేశారు. మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను గృహనిర్బంధంలో ఉంచారు. పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. - ప్రతిపక్ష అభ్యర్థులను కూడాa పోలింగ్‌ కేంద్రాలకు రానీయలేదు. కౌన్సిలర్‌, కార్పొరేటర్‌, ఛైర్‌పర్సన్‌, మేయర్‌ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. మహిళా అభ్యర్థుల కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. - పోలింగ్‌ ఏజెంట్లను బయటకు పంపించి బూత్‌లను ఏకపక్షం చేశారు. అధికారిక పాస్‌లు ఉన్నా అనుమతించలేదు. బూత్‌ల నుంచి బయటకు లాగేశారు. ఏజెంట్ల ఫారాలను చించివేశారు. పాత కేసుల పేరుతో పోలీసులే ఏజెంట్లను తొలగించారు. - బయట ప్రాంతాల నుంచి ముఠాలను తరలించి పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించారు. వందలాది మందిని పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించారు. ఓటర్లను బెదిరించారు. ప్రతిపక్ష ఏజెంట్లు లేకుండా బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. - ఓటర్లను అడ్డుకుని వారి ఓట్లను ఇతరులతో వేయించారు. ఓటర్‌ స్లిప్పులు లాక్కున్నారు. చేతికి సిరా గుర్తు వేసి ఓటు వేయనీయకుండా పంపించారు. మీ ఓటు మేమే వేస్తాం, మీరు వెళ్లిపోవాలంటూ బెదిరించారు. - పోలింగ్‌ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్‌, దొంగ ఓట్లకు పాల్పడ్డారు. స్థానికేతరులను తరలించారు. ఇతరుల పేర్లతో ఓట్లు వేశారు. చేతికి వేసిన సిరాను తుడిచేసి మళ్లీ ఓట్లు వేసే పద్ధతులను అనుసరించారు. - అక్రమాలను అడ్డుకున్నవారిపై దాడులు చేశారు. అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. మహిళలపైనా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. రిగ్గింగ్‌ను అడ్డుకున్న పోలీసు అధికారిపైనా దాడి జరిగింది. - పోలీసుల జోక్యంతో ప్రతిపక్షానికి అడ్డంకులు సృష్టించారు. అభ్యర్థులు, ఏజెంట్లను అడ్డుకున్నారు. ప్రశ్నించినవారిని అరెస్టు చేశారు. మహిళలపైనా లాఠీఛార్జ్‌ చేశారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు పోలింగ్‌ కేంద్రాల్లో తిరుగుతున్నా అడ్డుకోలేదు. - ఎన్నికల ప్రక్రియలోనే అవకతవకలకు పాల్పడ్డారు. బ్యాలెట్‌ పేపర్లపై అభ్యర్థుల ఎన్నికల గుర్తులను తారుమారు చేశారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలను తొలగించారు. మరికొన్ని కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ ఏర్పాట్లు చేయలేదు. అక్రమాలను చిత్రీకరిస్తున్న మీడియాను అడ్డుకున్నారు. - డబ్బులు, ప్రలోభాలు, బెదిరింపులతో ఓటింగ్‌ను ప్రభావితం చేశారు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో డబ్బులు పంపిణీ చేశారు. ఎన్నికల రోజున కూడా పార్టీ గుర్తులతో ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీ నాయకులు పోలింగ్‌ కేంద్రాల్లో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేశారు.
11
33
701
గుంటూరు 46 డివిజన్‌లో దొంగ ఓట్లు ఓటు వేసి మళ్లీ ఆ ఇంకు సిరాను తుడుచుకుంటూ దొంగ ఓట్లు వేయటానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
8
35
546
DEMOCRACY UNDER ATTACK IN AP! TDP leaders are allegedly occupying polling stations on the instructions of Anantapur MLA Daggubati Prasad, while police and election officials turn a blind eye. @ECISVEEP @CEOAndhra @SpokespersonECI @ANI @PTI_News @IndiaToday @IndianExpress @the_hindu @ndtvindia @News18India @TimesNow @republic @htTweets
3
77
3
161
23,113
ఏపీని బిహార్ కంటే దారుణంగా మార్చిన నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్ ‌లో నారా లోకేష్ 'రెడ్ బుక్ రాజ్యాంగం' ప్రభావంతో రాష్ట్రం 'బిహార్' కంటే దారుణంగా తయారైంది. లోకేష్ అరాచక శక్తులను పెంచి పోషిస్తుండడంతో రాష్ట్రంలో దాడులు, హ‌త్య‌లు, అరాచ‌కాలు నిత్య‌కృత్యంగా మారాయి. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్ర‌భుత్వ బ‌డుల్లో చదువుకునే ఆడబిడ్డలకు కూడా రక్షణ లేకుండా పోయింది. అందుకు రాప్తాడులో జ‌రిగిన దారుణ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థినిపై దుండగుడు ఏకంగా చెట్లు కోసే రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటనలో బాలిక కుడిచేయి తెగిపడిపోగా, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. బయటి వ్యక్తి రంపంతో ఏకంగా క్లాస్ రూమ్‌లోకి ఎలా రాగలిగాడంటే.. పాఠశాలల నిర్వాహణ ఏ విధంగా దిగ‌జారిపోయిందో అర్థం అవుతోంది. గ‌త వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వంటి విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో విద్యార్థుల‌కు క‌నీస ర‌క్ష‌ణ కూడా లేకుండా పోయింది. బడుల్లో ఆడబిడ్డల ప్రాణాలకే రక్షణ కల్పించలేని, విద్యాశాఖను పూర్తిగా భ్రష్టుపట్టించిన నారా లోకేష్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
1
39
124
1,034