Ram retweeted
ప్రముఖ తెలుగు సినీనటులు గిరిబాబు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో తనదైన నటనతో గిరిబాబు గారు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Ram retweeted
Almost lost, commenters said a miracle was needed — and a miracle happened! Manal and Mohit! 🔥
Ram retweeted
కియా 2.O...
పెనుకొండ కి ప్రపంచ
ఆటోమోబైల్ రంగంలో ప్రముఖ
స్ధానం కల్పించనున్న కియా యూనిట్ 2...
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
Ram retweeted
*!! ॐ साई राम !!*
*श्री साईबाबा संस्थान विश्वस्त व्यवस्था,शिर्डी*
*!! ॐ Sai Ram !!*
*Shri Saibaba Sansthan Trust, Shirdi*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*आरती :- धुपारती*
*शनिवार १४ नोव्हेंबर २०२६*
*Aarti :- Dhooparti*
*Saturday 14 Nov 2026*
Ram retweeted
గొప్ప అనుబంధానికి..
ఇద్దరూ ఒకేలా ఆలోచించక్కర్లేదు,
ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తే చాలు.
అభిప్రాయాలు, అభిరుచులు బలవంతంగా రుద్దుకోనక్కర్లేదు,
వాటికి నిజాయితీగా విలువనిస్తే చాలు.
ఒకరినొకరు భారంగా మోయనక్కర్లేదు,
కలిసి నడిస్తే చాలు.. తోడుగా నిలిస్తే చాలు.
ఒక్కటిగా అయిపోనక్కర్లేదు
ఒకరి గుండెలో మరొకరికి చోటుంటే చాలు.
Ram retweeted
మొన్నటి వరకు మన గుంపులో చికిత్స చేసే డాక్టర్లే ఉండేవారు.ఇప్పుడు పరిశోధనలో డాక్టరేట్ సాధించిన @iam_nmsr తో మన గుంపుకు మరింత హుందాతనం వచ్చింది! ఇంత మంచి ఆత్మీయులను ఇచ్చిన ట్విట్టర్‌కి కృతజ్ఞతలతో... మధుకి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎓🎓 – at Hyderabad, India
Ram retweeted
బాలల దినోత్సవం అంటే కేవలం వేడుకలే కాదు, పెరుగుతున్న సైబర్, లైంగిక వేధింపుల నుండి చిన్నారుల బాల్యాన్ని కాపాడుకునే బాధ్యతను గుర్తుచేసే సందర్భం.
తల్లిదండ్రులు పిల్లలకు అత్యుత్తమ స్నేహితులుగా మారి సైబర్ భద్రత, బాడీ సేఫ్టీపై అవగాహన కల్పించడంతో పాటు, ఎలాంటి ఆపద ఎదురైనా సంకోచించకుండా పోలీసులను ఆశ్రయించే ధైర్యాన్నివ్వాలి.
మన పిల్లలు డిజిటల్ ఉచ్చులకు బలికాకుండా ప్రతి ఇల్లూ, బడీ ఒక రక్షణ కవచంగా మారాలనే ఆకాంక్షతో రాసిన "మౌనం వీడదాం... బాల్యాన్ని కాపాడుకుందాం!" అనే నా @eenadulivenews ఎడిటోరియల్ ను తప్పక చదవండి.
Ram retweeted
Sri Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, today (13.11.2026) assumed charge as the Commissioner of Police, Hyderabad City @CPHydCity, at TGICCC, Banjara Hills.
His key priorities include strong Law & Order, women’s safety, cybercrime prevention, traffic management and citizen-centric policing, with Zero Tolerance towards Corruption.
He also held discussions with senior officers to strengthen policing and address key challenges across the city.
#CPHyderabad #HyderabadCityPolice
Ram retweeted
రేపటి గొప్ప భవిష్యత్ కు పునాదులు మీరే. మీ కళ్లలోని అమాయకత్వం, మీ చిరునవ్వులోని స్వచ్ఛత ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#ChildrensDay
Ram retweeted
తత్వమసి - అధ్యాయం 2 | తత్వం 27
కార్తీక మాసం శివార్పణం.
"నిను విడిచి ఉండలేనయా..."
శివుని కోసం పరితపించడమే భక్తి,
ఆయన ఎప్పుడూ మనకు దూరంగా లేడని తెలుసుకోవడమే ముక్తి 🙏.
ఈ కార్తీక మాసంలో మూడు తరాలు… మా అమ్మాయి స్మిత, మనుమరాలు శివి మరియు నేను కలిసి పాడిన ఈ తత్వం శ్రీ ఎం. బాలమురళీకృష్ణ గారిచే కూర్చబడిన జానపద రచన.
పూర్తి వీడియో లింక్ : youtu.be/b5kiobFj1Ds?si=VBuo…
Ram retweeted
*!! ॐ साई राम !!*
*श्री साईबाबा संस्थान विश्वस्त व्यवस्था,शिर्डी*
*!! ॐ Sai Ram !!*
*Shri Saibaba Sansthan Trust, Shirdi*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*आरती:-शेजारती*
*शुक्रवार १३ नोव्हेंबर २०२६*
*Aarti :-Shejarti*
*Friday 13 Nov 2026*
Ram retweeted
*!! ॐ साई राम !!*
*श्री साईबाबा संस्थान विश्वस्त व्यवस्था,शिर्डी*
*!! ॐ Sai Ram !!*
*Shri Saibaba Sansthan Trust, Shirdi*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*आरती :-शिर्डी माझे पंढरपुर*
*शनिवार १४ नोव्हेंबर २०२६*
*Aarti :-Shirdi Majhe Pandharpur*
*Saturday 14 Nov 2026*
Ram retweeted
*!! ॐ साई राम !!*
*श्री साईबाबा संस्थान विश्वस्त व्यवस्था,शिर्डी*
*!! ॐ Sai Ram !!*
*Shri Saibaba Sansthan Trust, Shirdi*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*आरती :- माध्यान्ह आरती*
*शनिवार १४ नोव्हेंबर २०२६*
*Aarti :- madhyan Aarti*
*Saturday 14 Nov 2026*
Ram retweeted
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
Ram retweeted
మితృలారా...
దెయ్యాలు వేదాలు వల్లించడం...
రాక్షసులు పురాణాలు పఠించడం...
అనే సామెతలని మనం విని ఉంటాం...
కాని చూసి ఉండం...
ఈ రోజు జగ్గప్ప తన ఈ ట్వీట్ ద్వారా
ఆ పై రెండు సామెతలని మనకి ప్రత్యక్షంగా
చూసే మహదావకాశాన్ని కల్పించినందుకు,
మనసు చంపుకొనైనా చెబుదాం జగ్గప్పకి థాంక్స్...
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!






































