జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జిలను తనిఖీ చేసి అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
7
360
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరు మండలం పెద్దపల్లి గొత్తికోయ గ్రామంలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నాటికలు, పాటల ద్వారా మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి.. శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోండి.
4
173
అశ్వాపురం పరిధిలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7.54 లక్షల విలువైన 105 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.9 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
3
429
రామాంజనేయ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు.
మాదకద్రవ్యాల నిర్మూలన, మూఢనమ్మకాల నివారణ, రహదారి భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, CCTV కెమెరాల ఏర్పాట్ల పై ప్రజలకు అవగాహన కల్పించారు.
6
250
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అశ్వారావుపేట మండలం వడ్డెరంగాపురం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన అశ్వారావుపేట పోలీసులు.
91 ఇళ్ల తనిఖీ.. 5 ద్విచక్ర వాహనాలు సీజ్. కోడిపందాలు, పేకాటకు దూరంగా ఉండాలని, గంజాయి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
6
379
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని హత్య చేసి, మృతదేహాలను పాతిపెట్టిన ఘటనలో మణుగూరు పోలీసులు ఐదుగురిని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల విజ్ఞప్తి: మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి.. అనారోగ్యానికి వైద్య చికిత్సే సరైన మార్గం.
సైబర్ మోసంపై ఎస్పీ రోహిత్ రాజు IPS ప్రత్యేక పర్యవేక్షణ.. బాధితుడికి భరోసా!
క్రెడిట్ కార్డు మోసంలో రూ.4.97 లక్షలు కోల్పోయిన బాధితుడికి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల అండ.రూ.1.62 లక్షలు రిఫండ్, మరో రూ.3.35 లక్షలు బ్యాంకు ఖాతాల్లో హోల్డ్.సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి
1
386
నక్సల్ ముక్త్ భారత్‌పై PIB–జిల్లా పోలీసుల మీడియా సదస్సు
రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ , PIB జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని మావోయిస్టు కార్యకలాపాలు, అరెస్టులు, లొంగుబాట్లు, అభివృద్ధి, పునరావాస కార్యక్రమాల వివరాలను వెల్లడించారు
మణుగూరు మండలం బుడుగుల గుత్తి కోయ గుంపులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమంను పోలీసులు నిర్వహించారు. మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ దృక్పథంపై కళాజాత బృందం అవగాహన కల్పించింది.
హేమచంద్రపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలోని కార్యాలయాలు, బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ పనితీరును సమీక్షించి, విధుల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన నైపుణ్యాల పై పలు సూచనలు చేశారు.
6
776
భద్రాచలం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
9
538
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్లల అమలులో నిర్లక్ష్యం వద్దు. ఎన్డిపిఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నెలవారీ నేర సమీక్షలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
1
6
431
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని పట్టుదల, క్రమశిక్షణతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు.
1
9
425
ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం – ముగ్గురు అరెస్ట్
నిందితుల వద్ద చిట్టీల లావాదేవీలకు సంబంధించిన 5 బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.
అనధికారిక ప్రైవేట్ చిట్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ.
7
635
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాకలగూడెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన అశ్వరావుపేట పోలీసులు. 62 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 ట్రాక్టర్లను తనిఖీ చేశారు.మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
8
485
ఇల్లందులో వరుస రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 10 కేసులను ఛేదించిన పోలీసులు. రూ.27.51 లక్షల విలువైన 165 గ్రాముల బంగారం, 2.2 కిలోల వెండి స్వాధీనం.
కేసు చేదనలో కీలక ఆధారాలు సేకరించిన అధికారులను,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
1
7
1,037
ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, శాస్త్రీయ ఆధారాల సేకరణ ద్వారా నేర పరిశోధనను మరింత పటిష్టం చేసి కేసుల ఛేదనలో వేగం, ఖచ్చితత్వం సాధించాలని సిబ్బందికి సూచించారు.
1
19
627
భార్యను హత్య చేసి గోదావరి నదిలో మృతదేహాన్ని పడవేసిన బోడా నరేందర్ ఏఆర్పిసి-623 ను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
1
16
2,579
SP KOTHAGUDEM retweeted
#ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం బుధవారం బేతుపల్లి చెరువు వరద ప్రవాహంలో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లిన ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని ఎన్టీఆర్ఎఫ్ బృందం క్షేమం గా కాపాడింది. ఎనిమిది మంది జాలర్లు చెరువుకు వలలు కట్టేందుకు వెళ్లగా.. వరద ప్రవాహానికి అక్కడే చిక్కుకు పోయారు. స్థానికుల సమాచారంతో రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది సహకారంతో 10 మందితో కూడిన ఎస్టీఆర్ఎఫ్ బృందం, ఒక స్ధానిక గజఈతగాళ్ళు తో కలిసి రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లో రక్షించే చర్యల్లో భాగంగా ముందుగా బోట్లలో వెళ్లిన సిబ్బంది ముగ్గురు జాలర్ల లను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ఐదుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లలో చీకట్లోనే జాలర్లు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉదృతి పెరిగి బోట్లూ నీటిలోనే బోల్తాపడ్డాయి. దీంతో పది మంది ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, స్ధానిక వ్యక్తి వరద ప్రవాహానికి చెల్లా చెదురయ్యారు.
ప్రభుత్వం, మంత్రుల ఆదేశంతో వరద ప్రవాహంలో చిక్కి చెల్లాచెదురైన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. ముందుగా మిగిలిన ఐదుగురు జాలర్లలను క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. చిమ్మని చీకటిలో అర్థరాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో
ఒక ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం గురువారం తెల్లవారు జామున మిగతా వారిని గాలించి ఒడ్డుకు తీసుకువచ్చారు.
వరదలో చిక్కుకున్న 19 మంచి సేఫ్ గా బయట పడినట్టు అయ్యింది.
#జిల్లాకలెక్టర్ దివాకర్ టీఎస్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షణలో నిరంతరం సహాయక చర్యలు కొనసాగాయి. ప్రభుత్వం తరుపున పలు ఆదేశాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ 19 మంది ప్రాణాలు కాపాడిన ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికార యంత్రాంగం తో పాటు #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ రోహిత్ రాజ్ లను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
















































