తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు..
• హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు.
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్, నాన్-కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ, అదనపు బాధ్యతలు (FAC) అప్పగిస్తూ సీఎస్ సంజయ్ జాజు జీవో ఆర్టీ నం. 1740 (తేదీ: 28.11.2026) జారీ చేశారు.
హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ (IAS)ను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ (HMDA పరిధి) ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈ.వి. నర్సింహా రెడ్డి (IAS)ని హెచ్‌ఎండీఏ కొత్త మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించారు. మూసీ ప్రాజెక్ట్ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలు కొనసాగుతాయి.
ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి. అజిత్ రెడ్డి (IDES)కి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ పోస్టులో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను రిలీవ్ చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐ.ఈ.ఎస్.ఎస్.డి. మనోజ్ (IAS)ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD)గా బదిలీ చేశారు.
జలమండలి (HMWS&SB) జేఎండీ మయాంక్ మిట్టల్ (IAS)కు జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన కె. చంద్రకళకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్ & మెట్రో రైల్) బాధ్యతలు ఇచ్చారు. అదనంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) స్పెషల్ కలెక్టర్ (LA)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
వరంగల్ స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పి. రామును విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా బదిలీ చేశారు.
ఇప్పటివరకు విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న వి. శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసి, తన మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
డీలిమిటేషన్ ప్రతిపాదనకు బీఆర్‌ఎస్ మద్దతు..
• తెలంగాణలో 26 లోక్‌సభ సీట్లపై కేటీఆర్ స్పష్టత.!
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమ అభిప్రాయం మొదటి నుంచీ స్థిరంగానే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
పార్లమెంటులో దక్షిణ భారత రాష్ట్రాల సంఖ్యాబలం ఏమాత్రం తగ్గిపోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం వాటాను కాపాడాల్సిన అవసరాన్ని తాము నిరంతరం ప్రస్తావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి పరిణామాన్నీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిలో మార్పు రాకుండా భద్రత కల్పిస్తూ, స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన తమ ప్రధాన ఆందోళనలను పరిష్కరిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాలు 26కు చేరుకుంటాయని ఆయన వివరించారు.
తెలంగాణ శ్రేయస్సునే ప్రధానంగా భావిస్తూ, బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ప్రతిపాదనకు మద్దతుగా ఓటు వేస్తారని కేటీఆర్ వెల్లడించారు.
మహిళా కోటాకు తమ పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందని, దాని అమలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.
5
382
రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు.. హరీష్ రావును కలిసిన జగ్గారెడ్డి.!
• బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి స్వయంగా కలిసి వ్యక్తిగత ఆహ్వానం అందించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు సన్మానం చేశానని, కానీ ఇలా పర్సనల్ ఇన్విటేషన్ ఇవ్వడం ఇదే తొలిసారని జగ్గారెడ్డి తెలిపారు.
• గతంలో తన కుటుంబంలో జరిగిన ఒక కార్యక్రమాన్ని మిస్ అయినా, ఈసారి మాత్రం అలా జరగకూడదనే ఉద్దేశంతోనే స్వయంగా పిలవడానికి వచ్చానని చెప్పడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
• రాజకీయాలు రాజకీయాలేనని, ఈ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేవలం మనస్ఫూర్తిగా పిలవాలనిపించే వచ్చినట్లు వెల్లడించారు.
• హరీష్ రావు బీఆర్ఎస్‌లో అగ్రనేత అని ప్రశంసిస్తూనే, "వారు టాప్ లీడర్.. నేను టాపో, తుప్పో గానీ.." అంటూ జగ్గారెడ్డి తనదైన చమత్కారంతో చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు.
• హరీష్ రావు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ రాజకీయంగా వేర్వేరు పక్షాల్లో ఉన్నా ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు.
• జగ్గారెడ్డి మాట్లాడుతున్న సమయంలో "మీరేం చెబితే అదే హెడ్డింగ్" అంటూ పక్కనున్న వారు సరదాగా అనడంతో హరీష్ రావు సహా అక్కడున్న నేతలంతా చిరునవ్వులు చిందించారు.
• 21 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నప్పటికీ, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడం ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
• ప్రత్యర్థి పార్టీల సీనియర్ నేతలు ఎలాంటి భేషజాలు లేకుండా ఆప్యాయంగా, సరదా వాతావరణంలో ముచ్చటించుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర దృశ్యంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..
• జగ్గారెడ్డి నివాసానికి హరీష్ రావు!
అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి నివాసానికి వెళ్లారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హరీష్ రావు, జగ్గారెడ్డిల కలయిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణంపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది.
ఇది మర్యాదపూర్వక కలయికా, లేక వ్యక్తిగత లేదా స్థానిక అంశాలకు సంబంధించిన భేటీనా అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ సమావేశానికి సంబంధించి ఇరువురు నేతల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..
• జగ్గారెడ్డి నివాసానికి హరీష్ రావు!
అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి నివాసానికి వెళ్లారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హరీష్ రావు, జగ్గారెడ్డిల కలయిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణంపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది.
ఇది మర్యాదపూర్వక కలయికా, లేక వ్యక్తిగత లేదా స్థానిక అంశాలకు సంబంధించిన భేటీనా అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ సమావేశానికి సంబంధించి ఇరువురు నేతల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
టోల్ వద్ద ఐడీ అడిగినందుకే వేటు.!
ఐఏఎస్ అధికారి కోపానికి ఐదుగురు సిబ్బంది ఉపాధి గల్లంతు!
• విజయవాడ బైపాస్ పరిధిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద గురువారం చోటుచేసుకున్న ఘటనలో ఐదుగురు చిరుద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు.
• సీఎంవో కార్యదర్శి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనం టోల్ వద్దకు రాగా, ఫీజు లేకుండా గేటు ఎత్తాలని ఆయన డ్రైవర్ సిబ్బందిని కోరారు.
• కారు ముందు భాగంలో అధికారిక ఫ్లాగ్ లేకపోవడం, డ్రైవర్ స్పష్టంగా వివరించకపోవడంతో ఆయన్ని టోల్ సిబ్బంది గుర్తించలేకపోయారు.
• టోల్ మినహాయింపు నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు (ID) చూపించాలని వారు అడగడంతో మిశ్రా ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు.
• సీఎంవో అధికారి అని తెలిపినా ఐడీ కార్డు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, టోల్ ఇన్‌ఛార్జి తక్షణమే క్షమాపణలు కోరినా శాంతించలేదు.
• కేవలం సారీ చెబితే సరిపోదని, తానెవరో చూపిస్తానంటూ హెచ్చరించి దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే కారులో ఉండిపోయారు.
• అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ప్రతినిధులను, టోల్ నిర్వాహకులను తన కార్యాలయానికి పిలిపించి.. ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరినీ తొలగించాలని హుకుం జారీ చేశారు.
• కావాలని కారు ఆపలేదని నిర్వాహకులు వివరణ ఇచ్చినా ఆయన వినకపోవడంతో ముగ్గురు టోల్ కలెక్టర్లు, ఒక సూపర్‌వైజర్, షిఫ్ట్ ఇన్‌ఛార్జిని గురువారమే విధుల నుంచి తప్పించారు.
ప్రజాధనంతో మంత్రికి కార్పొరేట్ వైద్యం..
• రూ.18.76 లక్షల బిల్లుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.!
పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులంటూ ప్రచారం చేసే పాలకులు, తమ ఆరోగ్యానికి మాత్రం ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగత వైద్య చికిత్స కోసం ఏకంగా రూ.18,76,168 మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 27న జీవో ఆర్టీ నం. 612ను జారీ చేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో అక్టోబర్ 14–17, అక్టోబర్ 21–26 తేదీల మధ్య రెండు విడతలుగా పొందిన చికిత్సల కోసం ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తున్నారు.
4 వెస్సెల్ సెరిబ్రల్ యాంజియోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రామ్, డ్యూరల్ ఏవీఎఫ్ ఎంబోలైజేషన్ చికిత్సలకు గానూ రూ.4,10,909 మరియు రూ.14,65,259 చొప్పున రెండు బిల్లులకు ఆమోదముద్ర పడింది.
సామాన్యులు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ సాయం కోసం నెలల తరబడి కాళ్లరిగేలా తిరుగుతుంటే, మంత్రి గారి బిల్లులకు మాత్రం నెల తిరగకముందే శరవేగంగా నిధులు మంజూరు కావడం గమనార్హం.
విశేషమేమిటంటే, ఈ రూ.18.76 లక్షల విడుదలకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖ ప్రత్యేక అనుమతి కూడా అవసరం లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
మంత్రుల వైద్య రీయింబర్స్‌మెంట్ ఖాతా నుంచి ఈ సొమ్మును నేరుగా అపోలో ఆసుపత్రి బ్యాంకు ఖాతాకే జమ చేయాలని రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
సాధారణ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉంటుండగా, కోట్లాది ఆస్తులున్న మంత్రుల కార్పొరేట్ బిల్లులకు మాత్రం ప్రజల పన్నుల సొమ్మును చెల్లించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
353 చేరినా ఇంకా 7 ఓట్ల లోటు.!
• మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులపై పార్లమెంట్‌లో ఉత్కంఠ.
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై పార్లమెంట్ తిరిగి సమావేశమవుతున్న నేపథ్యంలో డీఎంకే, ఎన్సీపీ అనుసరించబోయే వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
అధికార ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 319 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు అందుబాటులో ఉంది. ఒకవేళ డీఎంకే, ఎన్సీపీ పార్టీలు సానుకూలంగా స్పందిస్తే, బిల్లుకు అనుకూలంగా ఉండే ఎంపీల సంఖ్య 353కి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ రెండు పార్టీల అండ లభించినప్పటికీ, బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన 360 ఓట్ల లక్ష్యానికి మరో 7 ఓట్లు తక్కువగానే ఉంటాయి.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో తమిళనాడుకు ఉన్న పార్లమెంట్ ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గిపోకుండా తగిన రక్షణ కల్పించాలని డీఎంకే పట్టుబడుతోంది.
దేశంలోని ప్రతి రాష్ట్రానికి సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా ప్రతిపాదన ఉంటే బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ఎన్సీపీ నేత సుప్రియా సూలే సూచనప్రాయంగా వెల్లడించారు.
ఈ కీలక రాజకీయ పరిణామాల వేళ ఎన్సీపీ నాయకత్వం తమ ఎంపీలందరికీ 3 లైన్ల విప్ జారీ చేసింది. ఈ రెండు పార్టీలు కోరుతున్న సవరణలు, సభలో అవి తీసుకునే తుది వైఖరే ఈ బిల్లుల భవిష్యత్తును నిర్దేశించే అవకాశాలున్నాయి.
కేసీఆర్‌ను దెబ్బతీయబోయి అన్నదాతలను ముంచారు..
• ఓటమి భయంతోనే రేవంత్ అంకెల గారడీ.!
- బీజేపీ ఎంపీ, ఈటల రాజేందర్
కాళేశ్వరం అనుసంధానం పూర్తయిన నాడే, ఇకపై ఈ ప్రాంతంలో ఎన్నడూ కరువు ఛాయలు కనిపించవని తాను అందరికంటే ముందే స్పష్టం చేశానని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
వేసవిలోనూ ప్రాణహిత నదిలో నీటి లభ్యత ఉన్నా, వాటిని ఎత్తిపోసి పంటలకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా దోషిగా చూపాలనే ఆరాటంలో, రేవంత్ రెడ్డి సర్కార్ చివరకు తెలంగాణ రైతాంగాన్నే తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.
కోటి ఓట్లు, 90 అసెంబ్లీ సీట్లు సాధిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలకు దూరంగా ఊహాలోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాబోయే ఎన్నికల్లో తమ పరాజయం వందకు వంద శాతం ఖాయమనే కఠోర సత్యం ఇప్పటికే ముఖ్యమంత్రికి స్పష్టంగా అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు.
మిగిలిన రెండేళ్ల పాలనలోనైనా అధికార యంత్రాంగం తన మాట వినాలనే ఉద్దేశంతోనే, మళ్లీ గెలుస్తామనే కృత్రిమ భ్రాంతిని కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ తిరిగి గద్దెనెక్కే అవకాశమే లేదని తాను కాదని, స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని తెలిపారు.
కొనుగోళ్ల ఆలస్యమే కొంపముంచిందా.?!
• అకాల వానతో సంగారెడ్డి అన్నదాత ఆగం..
సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఊహించని రీతిలో కురిసిన అకాల వర్షం రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.
సంగారెడ్డితో పాటు కంది, ఆందోల్, చౌటకూర్, పుల్కల్, వట్‌పల్లి, హత్నూర మండలాల్లో ఈ వర్షపు దెబ్బ ఎక్కువగా కనిపించింది.
ఆరబెట్టేందుకు రహదారుల పక్కనా, సేకరణ కేంద్రాల ప్రాంగణాల్లోనూ పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
రోడ్లపై పారిన వాన నీటి ప్రవాహంలో వడ్లు కొట్టుకుపోగా, వాటిని తిరిగి పోగు చేసుకునేందుకు కర్షకులు నానా అవస్థలు పడుతున్నారు.
నెలల తరబడి కష్టపడి పండించి చేతికందిన పంట కళ్లముందే పాడవడాన్ని చూసి రైతులు బోరున విలపిస్తున్నారు.
పంటను కేంద్రాలకు తెచ్చి ఇరవై రోజులు గడిచిపోయినా సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడమే తమ పాలిట శాపంగా మారిందని రైతులు మండిపడుతున్నారు.
సకాలంలో ధాన్యం సేకరించి ఉంటే ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లేది కాదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఇకనైనా ఆలస్యం చేయకుండా తక్షణమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
5
239
🚨 పెద్దపల్లి కాంగ్రెస్ విభేదాలపై ఇన్‌ఛార్జ్ సందీప్ ప్రత్యేక దృష్టి.. మంత్రి అడ్లూరికి గాంధీభవన్ నుంచి పిలుపు!
అందుతున్న సమాచారం ప్రకారం, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంపై రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ సందీప్ ప్రధానంగా దృష్టి సారించారు.
జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య అభిప్రాయభేదాలపై చర్చించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను గాంధీభవన్‌కు రావాలని ఆయన పిలిచినట్లు తెలుస్తోంది.
పెద్దపల్లి వ్యవహారంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత సమస్యలపై సమీక్షించేందుకు ఇన్‌ఛార్జ్ సందీప్ ఇవాళ గాంధీభవన్‌కు రానున్నారు.
వివిధ జిల్లాల్లోని స్థానిక నేతల మధ్య సమన్వయాన్ని పెంచడం, విభేదాలకు తెరదించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరగనున్నాయని సమాచారం.
క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు డిసెంబర్ 15వ తేదీ నుంచి సందీప్ అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈ జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో సమావేశమై పార్టీ స్థితిగతులు, నాయకుల మధ్య ఐక్యతపై చర్చించనున్నారు.
🚨 గాంధీభవన్‌లో కీలక భేటీ.!
కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌ను కలిసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ.
🔹 హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్‌తో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
🔹 రాష్ట్ర పార్టీ వ్యవహారాల నూతన బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్‌కు ఈ సందర్భంగా వారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
🔹 తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ స్థితిగతులపై నేతలు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
🔹 హస్తం పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
🔹 క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంపొందించే దిశగా తమ సూచనలను ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకెళ్లారు.
🔹 పార్టీ శ్రేణులు, నాయకుల మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించాల్సిన అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించారు.
🔹 పార్టీ పురోగతితో పాటు రాబోయే రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై నేతలు సమాలోచనలు జరిపారు.
219
తెలంగాణ నీటి హక్కుల కోసం కేసీఆర్ పోరాటం.. కేంద్ర రికార్డుల్లోనే చరిత్ర.!
🔹 తెలంగాణ సాగునీటి ప్రయోజనాల విషయంలో కేసీఆర్ అనుసరించిన పోరాట పంథాకు రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్సే ఆధారం.
🔹 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి ట్రిబ్యునల్ కేటాయింపులు, దాని అసలు ఉద్దేశం, సామర్థ్యం పెంపుపై కేసీఆర్ కేంద్రం ముందు కీలక అభ్యంతరాలు లేవనెత్తారు.
🔹 తొలుత 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రారంభమైన ప్రాజెక్టును 11,500 నుంచి 40,000 క్యూసెక్కులకు, ఆపై 84,000 క్యూసెక్కుల స్థాయికి పెంచడంపై తీవ్రంగా ప్రశ్నించారు.
🔹 కృష్ణా జలాలను బేసిన్ అవతలకు తరలించే ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చట్టబద్ధమైన అనుమతులు, డీపీఆర్ ఆమోదాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
🔹 ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయంలో వెనక్కి తగ్గకపోతే తెలంగాణ కూడా ఆలంపూర్ వద్ద రోజుకు 3 టీఎంసీల ఎత్తిపోతల ప్రాజెక్టును చేపడుతుందని హెచ్చరించారు.
🔹 అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి 1956 చట్టంలోని సెక్షన్-3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
🔹 ఇవన్నీ రాజకీయ ప్రసంగాల్లో చేసిన ఆరోపణలు మాత్రమే కాదు.. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన కేంద్ర జలశక్తి శాఖ అధికారిక మినిట్స్‌లో నమోదైన అంశాలు.
🔹 మరి తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ ఏమిటి? ఏపీ ప్రాజెక్టులపై ఎందుకు స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదు?
🔹 గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే ప్రస్తుత ప్రభుత్వానికి అసలైన పరీక్ష!
🔹 పల్నాడు, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసి, తెలంగాణ హక్కుల కోసం చేతల్లో పోరాడాలి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావర్చిలో రణరంగం.!
• ఉద్యోగాలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణుల దాడి..
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి రెస్టారెంట్‌లో బీఆర్ఎస్ యువ నాయకులు చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దాడి నేపథ్యంలో డైనింగ్ హాల్‌లోని కుర్చీలు, టేబుళ్లు చిందరవందరగా పడిపోగా, ప్లేట్లు మరియు గ్లాసులు పగిలిపోయాయి. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
కొందరు టేబుళ్లపైకి ఎక్కి హంగామా సృష్టించడంతో హోటల్ సిబ్బంది, అక్కడున్న కస్టమర్లు భయంతో పక్కకు పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హోటల్ షట్టర్లు దించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెస్టారెంట్ లోపల ఘర్షణ అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, దాడికి పాల్పడుతున్న వారిని నిలువరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.
నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిర్వహించిన ఈ డిన్నర్ నిరసనలో మన్నె క్రిశాంక్, ముఠా జైసింహ, పాటిమీది జగన్, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ ముసుగు ధరించిన వ్యక్తిని టేబుల్ వద్ద కూర్చోబెట్టి, చికెన్ బిర్యానీ మరియు థమ్సప్ వడ్డిస్తూ బీఆర్ఎస్ నేతలు తమ అసంతృప్తిని వినూత్నంగా చాటుకున్నారు.
ఎన్నికల ముందు సరిగ్గా ఇదే హోటల్ టేబుల్ వద్ద తెలంగాణ యువతతో కలిసి చికెన్ బిర్యానీ తింటూ, థమ్సప్ తాగుతూ తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని మన్నె క్రిశాంక్ మీడియా ముందు గుర్తు చేశారు.
మూడేళ్లు గడిచినా జాబ్ నోటిఫికేషన్ల జాడ లేదని మండిపడ్డ ఆయన, కేవలం భారత్ సమ్మిట్, కాంగ్రెస్ సమ్మిట్‌ల కోసం ఏడాదికొకసారి టూరిస్ట్‌లా హైదరాబాద్‌కు వచ్చి వెళ్తున్నారే తప్ప ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.
ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని శాంతియుతంగా డిమాండ్ చేస్తుంటే ఇలా దాడులకు పాల్పడటం ఏమిటని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
8
330
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. తేదీలు ఇవే.!
ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లను కేంద్ర ప్రభుత్వం కోరింది.
నవంబర్ 30 నాడు లోక్‌సభ తిరిగి సమావేశం కానుంది. డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభల కార్యకలాపాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉంది.
అత్యవసరమైన ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తి చేసేందుకు ఈ భేటీలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల ఆవశ్యకత, అత్యవసర పరిస్థితులకు లోబడి సభా కార్యక్రమాలు కొనసాగుతాయి.
లీవ్ పెట్టి కాదు.. రాజీనామా చేసి వెళ్ళిపో.!
• కృష్ణా జలాల వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..
కృష్ణా జలాల అంశంలో తమ వైపు నుంచి ఒక చిన్న పొరపాటు దొర్లిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా ముందు అంగీకరించారు.
సంబంధిత విభాగంలో ఎస్ఈ (SE)గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారని, ఆయన్ను తెలంగాణలో కొనసాగించడమే తాము చేసిన పెద్ద పొరపాటన్నారు.
ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏడాది కాలంగా తెలిసి ఉన్నప్పటికీ, సదరు అధికారి తమ దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
విషయం తెలిసిన వెంటనే తానే స్వయంగా మల్లికార్జున్‌కు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో మందలించినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.
కేవలం సెలవు పెట్టి వెళ్లడం కాదని, తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని.. ఇక్కడే కొనసాగితే పరిణామాలు బాగుండవంటూ ఆ అధికారికి గట్టి వార్నింగ్ ఇచ్చానన్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై ఉండి కొందరు ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్ని మోసానికి పాల్పడ్డారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
9
531
🚨 గాంధీభవన్‌లో కీలక భేటీ.!
కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌ను కలిసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ.
🔹 హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్‌తో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
🔹 రాష్ట్ర పార్టీ వ్యవహారాల నూతన బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్‌కు ఈ సందర్భంగా వారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
🔹 తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ స్థితిగతులపై నేతలు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
🔹 హస్తం పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
🔹 క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంపొందించే దిశగా తమ సూచనలను ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకెళ్లారు.
🔹 పార్టీ శ్రేణులు, నాయకుల మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించాల్సిన అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించారు.
🔹 పార్టీ పురోగతితో పాటు రాబోయే రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై నేతలు సమాలోచనలు జరిపారు.
శ్రీధర్ బాబు, వంశీకృష్ణ మధ్య మరోసారి ప్రోటోకాల్ విభేదాలు.!?
• శిలాఫలకంపై సీఎం పేరు లేదంటూ ఎంపీ ఫిర్యాదు.!
• మరోసారి ప్రోటోకాల్ పంచాయితీ.. మంథని వేదికగా వేడెక్కిన రాజకీయం.
మంథని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై అధికారిక నిబంధనలు పాటించకపోవడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు.
సదరు శిలాఫలకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల మంత్రుల పేర్లు లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నిర్లక్ష్యంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుకు ఎంపీ ప్రత్యేకంగా లేఖ రాశారు.
ఆ శిలాఫలకంపై సీఎం పేరు, ఫొటోతో పాటు సంబంధిత మంత్రుల పేర్లను తక్షణమే పొందుపరచాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలోనూ అధికారిక ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి హోదాకు, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదని.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు దక్కాల్సిన సముచిత మర్యాదను అందించాలని సూచించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజా హక్కులను, రాజ్యాంగబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను కాపాడేందుకు తన గళం ఎప్పుడూ ముందుంటుందని వంశీకృష్ణ తేల్చిచెప్పారు.
ప్రభుత్వ వేడుకల్లో చోటుచేసుకుంటున్న ఇటువంటి ప్రోటోకాల్ లోపాలను తక్షణమే సరిదిద్ది, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని సీఎస్‌ను కోరారు.
మద్దిమడుగు సీఎం సభలో వరుస అవాంతరాలు.!
• నేలకొరిగిన బ్యానర్లు, వెలవెలబోయిన కుర్చీలు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిధిలోని మద్దిమడుగు వేదికగా జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పలు ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రాంగణానికి చేరుకున్న క్రమంలో, రెండు వైపులా నిలబెట్టిన పెద్ద గేట్లు, ఫ్లెక్సీ బ్యానర్లు అకస్మాత్తుగా కుప్పకూలాయి.
అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి, పడిపోయిన గేట్లు, బ్యానర్లను హుటాహుటిన చక్కదిద్దారు.
మరోపక్క, సభకు హాజరైన కొందరు మహిళలు కాసేపు బయటకు వెళ్లి మళ్లీ వస్తామని పోలీసు సిబ్బందిని అడిగారు.
అందుకు వారు నిరాకరించడంతో అసహనానికి గురైన ఓ మహిళ సిబ్బందితో వాదనకు దిగారు.
ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ, ఊహించిన స్థాయిలో ప్రజల హాజరు కనిపించలేదు.
ప్రాంగణంలోని అనేక విభాగాల్లో జనం లేక ఖాళీ కుర్చీలే కనిపించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
#Achampet #Maddimadugu #CMRevanthReddy #Nagarkurnool #TelanganaNews #TelanganaPolitics
🚨 భద్రాద్రి డీపీఆర్ఓపై వేధింపులు, వసూళ్ల ఆరోపణలు.!
కలెక్టర్‌కు కళాకారిణి ఫిర్యాదు, ఆడియో లీక్ కలకలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) హజ్గర్ హుస్సేన్ వ్యవహారశైలిపై సాంస్కృతిక కళాకారిణి షేక్ కౌషల్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఉన్నతాధికారి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పని ప్రదేశంలో నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను క్రమం తప్పకుండా డ్యూటీకి వస్తున్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరు వేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు.
ఈ వేధింపులకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో సంభాషణలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండటం జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కళాకారులకు రావాల్సిన జీతాల విడుదల కోసం ప్రతినెలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సదరు అధికారిపై మరో కీలక ఆరోపణ చేశారు.
వసూళ్ల పర్వం, ఇతర అక్రమాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కలెక్టర్‌ను కోరారు.
ఫిర్యాదు చేసిన కారణంగా తనపై ఎలాంటి ప్రతీకార చర్యలు జరగకుండా రక్షణ కల్పించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
7
434
శ్రీధర్ బాబు, వంశీకృష్ణ మధ్య మరోసారి ప్రోటోకాల్ విభేదాలు.!?
• శిలాఫలకంపై సీఎం పేరు లేదంటూ ఎంపీ ఫిర్యాదు.!
• మరోసారి ప్రోటోకాల్ పంచాయితీ.. మంథని వేదికగా వేడెక్కిన రాజకీయం.
మంథని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై అధికారిక నిబంధనలు పాటించకపోవడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు.
సదరు శిలాఫలకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల మంత్రుల పేర్లు లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నిర్లక్ష్యంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుకు ఎంపీ ప్రత్యేకంగా లేఖ రాశారు.
ఆ శిలాఫలకంపై సీఎం పేరు, ఫొటోతో పాటు సంబంధిత మంత్రుల పేర్లను తక్షణమే పొందుపరచాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలోనూ అధికారిక ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి హోదాకు, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదని.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు దక్కాల్సిన సముచిత మర్యాదను అందించాలని సూచించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజా హక్కులను, రాజ్యాంగబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను కాపాడేందుకు తన గళం ఎప్పుడూ ముందుంటుందని వంశీకృష్ణ తేల్చిచెప్పారు.
ప్రభుత్వ వేడుకల్లో చోటుచేసుకుంటున్న ఇటువంటి ప్రోటోకాల్ లోపాలను తక్షణమే సరిదిద్ది, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని సీఎస్‌ను కోరారు.
🚨 వ్యాపారులకు కేంద్రం శుభవార్త.!
డిసెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లోనే సులభంగా జీఎస్టీ రద్దు.
2026 డిసెంబర్ 1వ తేదీ నుంచి జీఎస్టీ (GST) రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి.
ఇకపై రిజిస్ట్రేషన్ రద్దు విధానం మొత్తం ఆన్‌లైన్ వేదికగానే ఆటోమేటిక్ పద్ధతిలో పూర్తవుతుంది.
క్యాన్సిలేషన్ కోసం జీఎస్టీ అధికారుల ఆమోదం కోసమో, వారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమో ఇకపై తప్పుతుంది.
రద్దు కోసం అప్లై చేసుకునే వ్యాపారులు అప్పటివరకు ఉన్న అవసరమైన రిటర్నులన్నింటినీ తప్పనిసరిగా సమర్పించి ఉండాలి.
చెల్లించాల్సిన పన్నులతో పాటు వాటిపై ఉన్న వడ్డీ, పెనాల్టీలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ పూర్తిగా కట్టేసి ఉండాలి.
ప్రస్తుత జీఎస్టీ నియమ నిబంధనలలో అవసరమైన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
అన్ని నిబంధనలు సక్రమంగా పాటించే పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త విధానం వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా మారనుంది.
#GST #GSTUpdates #BusinessNews #TaxUpdates #TeluguNews
కలియుగ దైవం తిరుమల శ్రీవారిపై తన భక్తిని చాటుకుంటూ చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్ భారీ కానుకను అందించారు.
ఏకంగా 121 కిలోల బరువున్న బంగారు ఆభరణాలను ఆయన ఏడుకొండలవాడికి విరాళంగా సమర్పించారు.
శ్రీవారి దివ్య అలంకరణ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మొత్తం 40 రకాల స్వర్ణాభరణాలు ఈ విరాళంలో ఉన్నాయి.
ఈ జాబితాలో బంగారు కిరీటం, శంఖుచక్రాలు, భుజకీర్తులు, నాగాభరణం వంటి అపురూప ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
వీటితో పాటు వడ్డాణం, వరద హస్తాలు, పీతాంబరం, పద్మపీఠం తదితర ఆభరణాలను కూడా స్వామివారికి అందజేశారు.
వేంకటేశ్వర స్వామికి ఇంతటి భారీ స్థాయిలో స్వర్ణాభరణాలు సమర్పించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
శ్రీవారికి భారీ కానుక.. రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్వామివారికి అందించనున్న వ్యాపారవేత్త.. 9 సెట్లుగా 45 రకాల ప్రత్యేక ఆభరణాల రూపకల్పన
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ వ్యాపారవేత్త భారీ స్థాయిలో బంగారు కానుకను సమర్పించనున్నారు. సుమారు రూ.160 కోట్ల అంచనా విలువ కలిగిన 121 కిలోల బంగారాన్ని ఈరోజు ఉదయం 11.35 గంటలకు శ్రీవారికి విరాళంగా అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అత్యంత విలువైన కానుకను స్వామివారికి సమర్పించడం విశేషం.
9 సెట్లుగా 45 రకాల ఆభరణాలు..
స్వామివారి అలంకరణ నిమిత్తం ఈ బంగారాన్ని వివిధ రకాల ఆభరణాలుగా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో కిరీటం, పాదుకలు, సాలగ్రామ హారాలు సహా మొత్తం 45 రకాల ఆభరణాలు ఉన్నాయి. వీటన్నింటినీ 9 ప్రత్యేక సెట్లుగా రూపొందించి స్వామివారి సేవకు సిద్ధం చేశారు.
తిరుమలకు చేరుకున్న కానుక..
ఈ బంగారు ఆభరణాలన్నింటినీ పెద్ద పెట్టెల్లో భద్రపరిచి, ట్రక్కు ద్వారా తిరుమల ఆలయానికి తరలించారు. స్వామివారికి ఇంత భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు విరాళంగా అందడం భక్తుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్ణీత ముహూర్తానికి ముఖ్యమంత్రి సమక్షంలో వీటిని ఆలయ వర్గాల ద్వారా శ్రీవారికి సమర్పించనున్నారు.






















