
Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitter
Gollapudi, Vijayawada
Joined March 2012
- Tweets39.5K
- Following188
- Followers112K
- Likes1.3K
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు లో జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు గరికపాటి వెంకట శివ నాగేశ్వరరావు (శివ) గారి పెదకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిత్రులు @revanth_anumula గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#TelanganaCM #RevanthReddy #HBDRevanthReddy
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలంతా జ్ఞాన దీపపు వెలుగుల్లో అజ్ఞాన చీకట్లను పారద్రోలుతూ సంతోషంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళి.. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరజిమ్ముతూ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#DiwaliCelebration
#Diwali2026 #HappyDiwali #DevineniUma
KLCE మిత్రులు శ్రీ బండ్ల సాయిబాబు, శ్రీమతి లావణ్య దంపతుల కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు మేఘన, ప్రణీత్ లకు అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది.
ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్న ఉద్యోగులు, ప్రభుత్వ డాక్టర్లు, వృద్దులు, ఎన్నికల సిబ్బంది తదితర వర్గాలు సైతం ఎన్డీయేకే ఓట్లు వేశారు. నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా నిలిచారు. జగన్ హయాంలో ఉద్యోగులకు జరిగిన మోసాలు, అవమానాలు దీనికి ఓ కారణం కాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, తమకు అన్ని విధాలుగా అండగా నిలవడంతోనే ఉద్యోగులు ఎన్డీయేపై తమ నమ్మకం చెక్కుచెదరలేదని చాటారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ లో పాల్గొని గొల్లపూడి సాయిపురం కాలనీలోని 268 వ బూతులో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది
#CheppaamChestunnaam
#APLocalBodyElections #DevineniUma #TDP #Election
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు @boddu_avrc గారు, రాష్ట్ర కార్యదర్శి కనకాల నాగేశ్వరరావు గార్లతో కలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టవలసిన కార్యచరణ గురించి చర్చించడం జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections #Rajamandry #DevineniUma #Jaggampeta #TDP #Election
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, గ్రామాల అభ్యున్నతికి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను 100% స్ట్రైక్ రేట్‌తో గెలిపించాలని కోరడం జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections #Rajamandry #DevineniUma #Jaggampeta #TDP #Election
వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో శాసనసభ్యురాలు @TangiralaSowmy1 గారితో కలిసి కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి.. విద్యావంతులు, ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన అభ్యర్థులను కూటమి ప్రజల ముందుకు తీసుకొచ్చిందని.. వీరులపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న నిమ్మల రాజశేఖర్‌కు గాజు గ్లాసు గుర్తుపై, పొన్నవరం ఎంపీటీసీ అభ్యర్థి చోడగిరి సంధ్యకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.
కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి వేగవంతమవుతుంది ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే స్థానిక ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యం
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న కూటమి అభ్యర్థులకు విశేష ఆదరణ లభిస్తోంది
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ 'చెప్పాం... చేస్తున్నాం... చేస్తాం' అనే నినాదంతో కూటమి అభ్యర్థులు ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు
గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
గత ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి 11 సీట్లకే పరిమితమైంది. అయినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది
ప్రజల మద్దతు సంపూర్ణంగా కూటమి వైపే ఉందని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయం
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #DevineniUma #Nandigama #AndhraPradesh
కేంద్ర మంత్రిగా ఎర్రం నాయుడు గారు రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి
శ్రీకాకుళంలో పుట్టి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఢిల్లీ స్థాయిలో ప్రజావాణి వినిపించిన నేత ఎర్రన్న
చంద్రబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా నాయకులను సమాయత్తం చేసి ముందుకు నడిపారు
అనర్గళమైన తన వాగ్దాటితో ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై నిలిచారు
ఎర్రంనాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘన నివాళులు
@katchannaidu @RamMNK
#YarramNaidu #Vardhanti #Yerranna #DevineniUma
అభివృద్ధిని, సుపరిపాలనను బలపరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ కూటమి అభ్యర్థులను గెలిపించండి
గొల్లపూడిలో ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు సైకిల్ పై, విజయవాడ రూరల్ జడ్పిటిసి అభ్యర్థి నూతలపాటి బాలకి కమలం గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి
#CheppaamChestunnaam
#APLocalBodyElections #Gollapudi #DevineniUma #TDP #Election
అనర్గళమైన వాగ్దాటితో తెలుగు వాడి గొంతుని డిల్లీ స్థాయిలో బలంగా వినిపించిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ... తెలుగుదేశం పార్టీ పటిష్ఠతకు ఎనలేని కృషి చేసి, రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవలో అంకితభావం, నాయకత్వంలో నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రం నాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ ఆయన స్మృతికి నా ఘన నివాళులు.
@katchannaidu @RamMNK
#YarramNaidu #Vardhanti #Yerranna #DevineniUma
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం బూరులంక గ్రామంలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
27 నెలల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు కూటమికే.. స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి సమర్థవంతమైన స్థానిక ప్రజాప్రతినిధులు అవసరం
కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు.. ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి బలం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించాలి
ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకొని కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి
గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల్లో ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన సమర్థవంతమైన ప్రజాప్రతినిధులు ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలంటే స్థానిక సంస్థల్లో కూడా కూటమి బలంగా ఉండాలి
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి పనులకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో కీలకం
#CheppaamChestunnaam
#APLocalBodyElections #Rajamandry #DevineniUma #Kadiyam #TDP #Election
తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం మురుమండ గ్రామంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు @GORANTLA_BC గారితో కలిసి కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలను కలిసి ప్రభుత్వ పాలనలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది
చెప్పాం… చేస్తున్నాం… అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం!
గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది
రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి పోస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 'చెప్పాం… చేస్తున్నాం…' అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్నాం
గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అవసరం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి
జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections #Rajamandry #DevineniUma #Gorantla #TDP #Election
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కలిసి ఎమ్మెల్యే @MeeNallamilli గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
ప్రజా సంక్షేమమే ప్రాధాన్యం.. గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
బిక్కవోలు మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ఎన్నికల ప్రచారం*
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు అండగా నిలవాలి
సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తోంది
రైతులకు భరోసా, మహిళలకు ఆర్థిక చేయూత, యువతకు ఉపాధి అవకాశాలు, పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది
గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తోంది
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది
గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లో కూడా అభివృద్ధికి కట్టుబడి పనిచేసే కూటమి నాయకత్వం ఉండాలి
రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా ముందుకు సాగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారు
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #Anaparthy #DevineniUma #AndhraPradesh
#3yrsSinceCBNreleased
ప్రజల సహనానికి ఒక హద్దు ఉంటుంది. జగన్ సర్కారు తమను ఎన్ని కష్టాలకు గురిచేసినా ఓపిగ్గా భరిస్తూ వచ్చిన ప్రజలు... తమ కోసం పోరాడుతున్న చంద్రబాబుగారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మాత్రం చూస్తూ ఊరుకోలేకపోయారు. రోడ్డెక్కి పోరాటాలు చేసి తమ నాయకుడిని కాపాడుకున్నారు.
#DevineniUma
అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం
వేదాద్రి ఎత్తిపోతల పథకంతో వచ్చే ఏడాది సాగర్ కాలువలకు కృష్ణమ్మ నీళ్లు
చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి శాఖమూరి అపర్ణ, ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి అరిగెల రమ గార్లకు మద్దతుగా ప్రజలను కలుసుకుని ప్రచారం నిర్వహించడం జరిగింది.
కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు.
ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి నాయకత్వంలో నందిగామ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన వేదాద్రి ఎత్తిపోతల పథకం వైసీపీ పాలనలో మోటర్లు ఆపి మూలన పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించి పనులను పునరుద్ధరిస్తున్నారు. వచ్చే ఏడాది సాగర్ కాలువల్లోకి కృష్ణమ్మ నీళ్లు వచ్చేలా చర్యలు కొనసాగుతున్నాయి.
మునగాలపల్లి, కేతవీరునిపాడు గ్రామాల రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుత్తవారిపాలెం-కేతవీరునిపాడు లిఫ్ట్ ఏర్పాటు చేశాం. ఈ పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందింది.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజల భవిష్యత్తు కోసం స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు ఇవ్వాలి.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #DevineniUma #Nandigama #AndhraPradesh












































