🪔 చీకటిని తరిమికొట్టి వెలుగులను నింపే దీపావళి పండుగ..🪔
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
పరకాల నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali #DiwaliWishes #ChallaDharmaReddy #Parkal #FestivalOfLights
@BRSparty
కార్యకర్తల కుటుంబాలకు అండగా.. కష్టసుఖాల్లో తోడుగా..!!
గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ఇటీవలే మృతిచెందిన పార్టీ కార్యకర్త తగరపు చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
#ChallaDharmaReddy #BRS #Parakala #BRSFamily #Tribute
“నా తెలంగాణ కోటి రతనాల వీణ..” 🎶
నిజాం నిరంకుశ పాలనకు తన కలంతో ఎదురొడ్డి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్షరాల్లో ఆవిష్కరించిన మహాకవి, ప్రజాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు.
తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యం నింపి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడి ఆశయాలు, రచనలు చిరస్మరణీయం.
మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🙏
జై తెలంగాణ! ✊
#DasarathiKrishnamacharyulu #TelanganaPoet #JaiTelangana #TelanganaPride #TelanganaHistory
@BRSparty
4
162
యూరియా కోసం చెప్పుల క్యూలో అన్నదాత.. ఇదేనా రైతు సంక్షేమం?
తెల్లవారకముందే యూరియా కోసం చెప్పులు పెట్టి క్యూలో నిలబడాల్సిన దుస్థితి రైతుది. ఇప్పుడు యూరియాకు యాప్ అంట.. స్మార్ట్‌ఫోన్ లేని రైతుకు ఎరువు అందని పరిస్థితి!
ఒకవైపు కరెంటు లేదు.. సాగునీళ్లు లేవు.. ఎండిపోతున్న పంటను కాపాడుకుందామంటే ఎరువు కూడా దొరకడం లేదు.
కేసీఆర్ పాలనలో ఎరువు రైతు ఇంటి వద్దకు వచ్చింది.. రేవంత్ పాలనలో రైతు బతుకే క్యూలో నిలబడింది!
అన్నదాతను అనుమానిస్తూ, ఎరువు కోసం ఇబ్బందులు పెట్టే ఈ విధానంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
రైతుకు కావాల్సింది యాప్‌లు కాదు.. సమయానికి ఎరువులు, సాగునీరు, నాణ్యమైన కరెంటు!
#RevanthReddy #UttamKumarReddy #BhattiVikramarka #ThummalaNageswaraRao #CongressParty
101
పట్టభద్రుల ఓటరు నమోదుపై సమీక్ష.. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం..! ✊
#ChallaDharmaReddy #BRS #GraduateMLC #Parakala #Telangana
*హామీల పేరుతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్! 🔥*
మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు కుదేలు.. రైతులకు సాగునీరు లేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?
420 హామీలు.. ఆరు గ్యారెంటీలు.. కానీ ప్రజలకు దక్కింది కష్టాలు, కన్నీళ్లే! కేసీఆర్‌ను విమర్శించడం, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమిటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం?
పట్టభద్రులారా.. మీ ఓటే మీ గొంతుక!
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి. గతంలో ఓటు హక్కు ఉన్నవారు సైతం నూతన ఓటరు జాబితాలో తిరిగి నమోదు చేసుకోవాలి.
ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి సాంబారి సమ్మారావుతో కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించి, గ్రామాల వారీగా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది.
కాంగ్రెస్ పాలనను ప్రశ్నిద్దాం.. పట్టభద్రుల ఓటు హక్కును కాపాడుకుందాం!
#ChallaDharmaReddy #BRS #Parakala #GraduateMLC #VoterRegistration
ఓట్ల దొంగతనంపై కాంగ్రెస్ ధర్నా.. పక్కనే ఓటుకు నోటు కేసు ఉన్న నేత!
దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్.. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని పక్కనే నిలబెట్టుకోవడం విడ్డూరం.
దేశమంతా ఓట్ల చోరీ కనిపిస్తుంది.. కానీ పక్కనే ఉన్న ఓటుకు నోటు కేసు మాత్రం కనిపించదా?
కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాలి!
#RahulGandhi @INCIndia
#BRS
స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ..
నవంబర్ 22న హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం స్వేరోస్ చేస్తున్న కృషి అభినందనీయం. ఈ సమ్మేళనం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
#ChallaDharmaReddy #Swaero #Parakala #Hanamkonda #Education
@BRSparty @KTRBRS @BRSHarish @KCRBRSPresident
కాంగ్రెస్ సర్కార్‌కు పట్టభద్రులు ఓటుతో బుద్ధి చెప్పాలి.. 🔥
మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలన్నీ హుళక్కి.. రైతులకు సాగునీరు కరువు.. తెలంగాణ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లింది.
కాంగ్రెస్ వైఫల్యాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే సరైన సమాధానం కావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
పరకాల మండలం నాగారం, పరకాల పట్టణం,గీసుగొండ, GWMC పరిధిలోని 15,16,17 డివిజన్లలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై వేర్వేరుగా నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం జరిగింది.
#ChallaDharmaReddy #BRS #GraduateMLCElections #Parakala
#Telangana
నూతన వధూవరులకు ఆశీస్సులు..
పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుగొండ మండలాల పరిధిలో పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
#ChallaDharmaReddy #BRS #Parakala #Sangem #Geesugonda
@BRSparty
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పరకాలలో బీఆర్ఎస్ సమరశంఖం.. ✊
#BRS #ChallaDharmaReddy
#Parakala #Telangana #GraduateMLC
@BRSparty @RakeshReddyBRS @EDRBRS
మృతుల కుటుంబాలకు పరామర్శ..
Gwmc 16వ డివిజన్ నాయకులు పోగుల సంజీవ గారి సోదరుడు కుమార్, ధర్మారం గ్రామ బీఆర్ఎస్ నాయకులు గట్టికొప్పుల పెంటయ్య గారు మృతిచెందగా వారి పార్థివదేహాలను సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
#ChallaDharmaReddy #BRS #Parakala #Telangana #PartyWorkers
@BRSparty
హర్షితకు అభినందనలు..
దామెర మండల కేంద్రానికి చెందిన గుండా హర్షిత మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన సందర్భంగా అభినందించడం జరిగింది. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను.
#ChallaDharmaReddy #BRS #Parakala #Telangana
#Damera
@BRSparty
కాంగ్రెస్ హామీల డొల్లతనాన్ని పట్టభద్రుల్లోకి తీసుకెళ్లాలి!
గీసుగొండ మండలం పీడీఆర్ గార్డెన్స్‌లో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి @EDRBRS,@RakeshReddyBRS,సాంబారి సమ్మారావు లతో కలిసి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
#ChallaDharmaReddy #BRS #Parakala #Telangana
@BRSparty @KTRBRS
@BRSHarish @KCRBRSPresident
కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి పరకాల నియోజకవర్గంలోని దామెర క్రాస్ వద్ద సాగునీరు లేక ఎండిపోయిన దేవాదుల కాలువను పరిశీలించడం జరిగింది. రైతులకు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాం.
#ChallaDharmaReddy #BRS #Devadula #Parakala #Telangana
చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి!
దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని.. ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సంతోషాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
తెలంగాణ ప్రజలందరికీ, పరకాల నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు!
#ChallaDharmaReddy #Vijayadashami #DasaraWishes #BRS #Parakala
ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో..
#ChallaDharmaReddy #BRS #Parakala #Devotional #Dussehra2026
@BRSparty
ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించాను.
భక్తిభావంతో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో పండుగలను జరుపుకోవడం ఆనందదాయకం.
దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ChallaDharmaReddy #BRS #Parakala #Durgamata #Navaratri2026
@BRSparty



























