క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ..
పటాన్చెరు:
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 22 వ తేదీ నుండి మహారాష్ట్ర లోని షిర్డీ వేదికగా జరగనున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అండర్-14 బాల బాలికల జట్లకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను క్రీడాకారులకు అందజేశారు.
శుక్రవారం సాయంత్రం పటాన్చెరు లోని మైత్రి మైదానం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర జట్టుకు లక్ష 50 వేల రూపాయల సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్, భోజన వసతి, ప్రయాణ ఖర్చులు అందించడం జరిగిందని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
జాతీయస్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమారి, రామ రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.
63
పౌరసరఫరాల శాఖ కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్,
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు..
డీలర్ల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి .
పటాన్చెరు:
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్ గా ఇటీవల నియమితులైన నాగిరెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు గౌరవ వేతనం, క్వింటాలుకు 300 రూపాయల కమిషన్, ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వే బ్రిడ్జిల ఏర్పాటు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, తదితర అంశాలను అమలు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాగిరెడ్డి.. ప్రభుత్వంతో చర్చించి డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, రాష్ట్ర ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
@BRSparty
ఎమ్మెల్సీ రాజు అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు శంబిపూర్ రాజు గురువారం శంబిపూర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
నిరుపేదలకు వరప్రదాయని ముఖ్యమంత్రి సహాయ నిధి
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
56 మంది లబ్ధిదారులకు 24 లక్షల 70 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ..
పటాన్చెరు
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 24 లక్షల 70 వేల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు, ప్రమాదాలు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అనేక నిరుపేద కుటుంబాలు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు
అవసరమైన సంక్షేమ పథకాలను చేరవేయడంలో కట్టుబడి ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.
ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వారి గడప వద్దకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అంశంలో దళారులను ఆశ్రయించ వద్దని విజ్ఞప్తి చేశారు.@TelanganaCMO
నిరుపేదలకు వరప్రదాయని ముఖ్యమంత్రి సహాయ నిధి
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
56 మంది లబ్ధిదారులకు 24 లక్షల 70 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ..
పటాన్చెరు
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 24 లక్షల 70 వేల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు, ప్రమాదాలు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అనేక నిరుపేద కుటుంబాలు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు
అవసరమైన సంక్షేమ పథకాలను చేరవేయడంలో కట్టుబడి ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.
ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వారి గడప వద్దకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అంశంలో దళారులను ఆశ్రయించ వద్దని విజ్ఞప్తి చేశారు.
@BRSparty
6
243
కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్..
గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 29 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేత..
పటాన్చెరు
పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. యజమాన్యంతో చర్చించి నష్ట పరిహారం అందించి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జి. దానయ్య.. గత కొంతకాలంగా పాశమైలారం పారిశ్రామికవాడలోని ల్యాం టఫ్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ.. కుటుంబంతో కలిసి స్థానికంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన.. పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ.. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞప్తి చేశారు. యాజమాన్యంతో చర్చించి.. మృతుడి కుటుంబానికి 29 లక్షల రూపాయలు నష్టపరిహారం మంజూరు చేయించారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్, వాసు తదితరులు పాల్గొన్నారు.
పాటి గ్రామ బతుకమ్మ ఘాట్ అభివృద్ధికి శ్రీకారం..
25 లక్షల రూపాయలతో ఘాట్ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు
ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి గ్రామంలో గల బతుకమ్మ ఘాట్ ను 25 లక్షల రూపాయలతో ఆధునికరిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం సంబంధిత శాఖ అధికారులు, గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులతో కలిసి ఘాట్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పాటి గ్రామ పరిధిలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇబ్బంది కాకూడదన్న లక్ష్యంతో ఆధునిక వసతులతో బతుకమ్మ ఘాట్ ను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఒకే ప్రాంగణంలో అన్ని రకాల వసతులు కల్పించబోతున్నట్లు పేర్కొన్నారు. నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి, గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
@BRSparty
గుమ్మడిదల అభివృద్ధిలో కీలక ముందడుగు..
నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ప్రతి వార్డు అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
గుమ్మడిదల
గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ.. ప్రతి వార్డును అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, దోమడుగు, వీరన్న గూడెం, బొంతపల్లి, గుమ్మడిదల వార్డులలో నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో గల ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు.
నిర్దేశిత గడువులోగా పనిలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కోరారు.
@BRSparty @KTRBRS @BRSHarish
పటాన్చెరులో అభివృద్ధి పరుగులు..
రెండు కోట్ల 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. సమస్యల పరిష్కారమే అజెండా..
ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు
నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పరిధిలోని జెపి కాలనీ, పటాన్చెరు డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తూ.. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
శనివారం పటాన్చెరు మరియు జేపీ కాలనీ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యూజీడిలు, వర్షపునీటి కాలువలు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, కాలనీల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు.
నూతన రహదారుల నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయని, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి కాలువల నిర్మాణంతో మురుగునీరు, వర్షపు నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని, ప్రజల సహకారంతో ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
1
182
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్చెరు
ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి
ఛట్ పూజ సందర్భంగా 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకు పంపిణీ .
@BRSparty @spsangareddy
1
153
చిన్నకంజర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు
ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలలో అందిస్తున్న వసతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు ఏర్పాటు చేయడంతో పాటు.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారికి ఫోన్ లో సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించాలని కోరారు. రైతులకు బకాయి పడిన బోనస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్, రామచందర్, వెంకటేష్, పిఎసిఎస్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
@BRSparty
కార్మిక రంగానికి వెన్నుదన్నుగా బిఆర్టియు..
జెకె ఫెన్నార్ పరిశ్రమకు చెందిన హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు బిఆర్టియులో చేరిక..
కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పరిశ్రమ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బిఆర్టియును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు..
పటాన్చెరు
కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్టియుకు రోజురోజుకూ కార్మికుల నుంచి ఆదరణ పెరుగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. జెకె ఫెన్నార్ పరిశ్రమకు చెందిన హెచ్ఎంఎస్, ఐఎన్టియుసి కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్టియు లో చేరారు. కార్మికులందరికీ కార్మిక సంఘం కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం బిఆర్టియు నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల సాధనకు బిఆర్టియు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు రావాలని సూచించారు.
త్వరలో జరగనున్న పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఆర్టియును భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల మద్దతుతో బిఆర్టియు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
పటాన్చెరు పారిశుధ్యంలో నవశకం..
ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవతో 12 కోట్ల రూపాయలతో 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లు..
తోషిబా సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు..
ప్రతి వార్డు పరిశుభ్రతకు చిరునామాగా నిలవాలి..
ప్రతి డివిజన్ కి స్వీపింగ్ మిషన్, టిప్పర్, జెసిబి..
ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు మైత్రి మైదానం వేదికగా వాహనాల ప్రారంభం..
పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా పారిశుద్ధ సిబ్బందిని పెంచాలి..
ప్రభుత్వానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సూచన..
పటాన్చెరు
అనునిత్యం. అనుక్షణం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయడంలో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సైబరాబాద్ మున్సిపల్ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిళ్ల పరిధిలో పెరుగుతున్న జనాభాకు, కాలనీలకు అనుగుణంగా పారిశుధ్య అవసరాల కోసం తోషిబా పరిశ్రమ సహకారంతో 12 కోట్ల రూపాయలతో పారిశుద్ధ్య వాహనాలు కొనుగోలు చేసి అందించారు.
సోమవారం ఉదయం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్, తోషిబా పరిశ్రమ హెచ్ఆర్ డైరెక్టర్ మారు మోటో చేతుల మీదుగా తొలి విడతలో కొనుగోలు చేసిన 5 టిప్పర్లు, 5 స్వీపింగ్ మెషిన్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2014 నుండి 2023 వరకు పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మూలంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడంతో పాటు వందల సంఖ్యలో నూతన కాలనీలు ఏర్పడ్డాయని తెలిపారు.
ఇందుకు అనుగుణంగా సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిల్స్ పరిధిలోగల తొమ్మిది డివిజన్లలో గల ప్రజలకు పారిశుద్ధ్య అంశంలో మెరుగైన సేవలు అందించడంలో భాగంగా నూతన వాహనాల కొనుగోలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు పరిధిలోని తోషిబా పరిశ్రమ అందించిన 12 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో 10 స్వీపింగ్ మెషీన్లు, పది టిప్పర్లు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ వీటిలో పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు.
మొదటి విడతలో కొనుగోలు చేసిన వాటిలో అమీన్పూర్ సర్కిల్ కు 3 స్వీపింగ్ మిషన్లు, మూడు టిప్పర్లు, పటాన్చెరు సర్కిల్ కు 2 స్వీపింగ్ మిషన్లు, 2 టిప్పర్లు అందించడం జరిగిందని తెలిపారు.
బిహెచ్ఎల్ చౌరస్తా నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు గల జాతీయ రహదారి పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా మరో స్లీపింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రతి కాలనీ పారిశుద్ధ అంశంలో ప్రగతి సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వెయ్యకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త వాహనాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
పారిశుధ్య వాహనాలు కొనుగోలు కోసం 12 కోట్ల రూపాయలు అందించిన తోషిబా పరిశ్రమ యాజమాన్యానికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బందిని నియమించండి..
9 డివిజన్ల పరిధిలో పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో నూతన సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం మూలంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రతిరోజు చెట్ల సేకరించకపోవడం మూలంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి డివిజన్ పరిధిలో నూతన పారిశుద్ధ సిబ్బందిని తక్షణమే నియమించాలని కోరారు.
పారిశుద్ధ్య వాహనాలతో పాటు జెసిబిలు సైతం అందిస్తున్నామని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో తమను భాగస్వాములను చేసినందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తోషిబా పరిశ్రమ ఎండి మారు మోటో తెలిపారు. అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవ ప్రశంసనీయం..
సీఎంసీ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ కోసం సి ఎస్ ఆర్ నిధులతో వాహనాలు కొనుగోలు చేసి అందించడంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవ ప్రశంసనీయమని శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ అన్నారు.
@BRSparty @TOSHIBA_LS
ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడి కుమారుడి నిశ్చితార్థ వేడుకలకు ప్రముఖుల హాజరు..
రాజకీయ, అధికార, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సందడి.. నూతన వధూవరులకు ఆశీస్సులు..
పటాన్చెరు
పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగాయి.
శుక్రవారం ఉదయం గూడెం సందీప్ రెడ్డికి.. ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వై. నాగిరెడ్డి కుమార్తె హర్ష్యతి తో నిశ్చితార్థ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి, కుమార్తె నైమిష రెడ్డి, ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు సందీప్ రెడ్డి, హర్ష్యతి దంపతులను ప్రముఖులు ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
@BRSparty @BRSHarish @KTRBRS @TelanganaCMO
క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ..
పటాన్ చెరు
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరగనున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి కుస్తీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అండర్-17 బాల బాలికల జట్లకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను క్రీడాకారులకు అందజేశారు.
బుధవారం సాయంత్రం పటాన్చెరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పటాన్చెరు కేంద్రంగా ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర జట్టుకు లక్ష 50 వేల రూపాయల సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్, భోజన వసతి, ప్రయాణ ఖర్చులు అందించడం జరిగిందని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
జాతీయస్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎంఈఓ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీధర్ చారి, మాణిక్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, షకీల్, దస్తగిరి, కోచ్ సంగ్రామ్, పిఈటి గౌసుద్దీన్, క్రీడాకారులు పాల్గొన్నారు.
@BRSparty
35
615
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ..
సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం..
పటాన్చెరు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) గారిని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళవారం సాయంత్రం ఎర్రవల్లి లోని కెసిఆర్ గారి ఫామ్ హౌస్ లో.. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో కలిసి.. శ్రీ కేసీఆర్ గారిని కలిశారు.
ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు శ్రీ గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని శ్రీ కేసీఆర్ గారిని ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఆహ్వానించారు.
అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కెసిఆర్ గారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
@BRSparty @BRSHarish @BRSParty_News
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం..
ప్రభుత్వం స్పందించకపోతే లక్ష మందితో హైదరాబాద్ లో భారీ నిరసన..
పటాన్చెరు శాసనసభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి..
గజ్వేల్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో.. గౌరవ వేతన సాధన సభ.. నూతన రాష్ట్ర కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం..
ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు
పల్లె నుండి పట్నం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని.. సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాష్ట్ర రాజధాని లో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని పటాన్చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన.. రాష్ట్ర స్థాయి గౌరవ వేతన సాధన సభ, రాష్ట్ర కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తుల సంభవించిన, కరోనా లాంటి మహమ్మారి మూలంగా లక్షలాదిమంది చనిపోయిన సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర శ్లాగనీయమన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లక్ష మందితో కలిసి రాష్ట్ర రాజధానిలో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రేషన్ డీలర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, సంఘం ప్రతినిధులు, రేషన్ డీలర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
@BRSparty @BRSHarish
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ
సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం..
పటాన్చెరు
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారిని సోమవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు శ్రీ గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేటీఆర్ గారిని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆహ్వానించారు.
అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
@BRSparty @KTRBRS
మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు..
పటాన్చెరు
దసరా పండుగ సందర్భంగా.. మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి.. పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. ప్రజలు నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. ఇందుకు అనుగుణంగా పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు సుమలత శ్రీకాంత్, ప్రమీల, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
@BRSparty @BRSHarish




























































