SAS భూదాహం..
కాంగ్రెస్ సర్కార్ దాసోహం!
రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగిన కంత్రీ కంపెనీ!
పెద్దల అండతో బరితెగింపు.. కబ్జాకు సహకరించిన అధికారులు!
మొదట భూసేకరణతో గృహాలకు కేటాయించినట్టు నమోదు
పదిహేను రోజుల్లోనే గుంట భూమి ప్రైవేట్ వ్యక్తి పేరిట మార్పు
మరో నాలుగు రోజుల్లోనే ఒకే లావాదేవీతో SAS ఇన్ఫ్రాకు బదలాయింపు
ఆధారాలేవీ లేకుండానే 3.17 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్!
దారి కోసం ఏకంగా తౌతోనికుంటలో రోడ్డు వేసిన SAS ఇన్ఫ్రా
ఈ అరాచకంపై గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వాసుల అభ్యంతరం
అక్రమాలపై చర్చలు మాని, సర్దుబాటుకు ప్రయత్నించిన హైడ్రా
'SAS'కు దారివ్వకుంటే మీ దారి మూస్తామంటూ వార్నింగ్!
ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టును ఆశ్రయించిన అపార్ట్మెంట్ వాసులు.
రేవంత్ రెడ్డికి తెలిసింది..
కూలగొట్టడం, అమ్మడం, ఎత్తుకెళ్లడం, ఎగబెట్టడం.
హిల్ట్ పాలసీ కుంభకోణంలో ఎవరైనా పారిశ్రామికవేత్తలు భాగస్వాములైతే.. మా ప్రభుత్వం వచ్చాక అనుభవించేది మీరే!
పేదలకు ఇళ్లు కట్టడానికి ఉన్న హౌసింగ్ బోర్డు భూములను రేవంత్ రెడ్డి అమ్ముతున్నాడు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కన్నెపల్లి వద్ద ప్రాణహిత నదిలో ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.
మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జూలై నెలలో కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించి, తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే కరువును అధిగమించవచ్చని సలహా ఇచ్చారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపడితే నీటి ప్రవాహాన్ని ఆపి, నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది.. ఇంతటి కరువులో కూడా తెలంగాణ ప్రజలకు, రైతులకు నీళ్లు అందించేవాళ్లం.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI
LIVE: వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరిక. xitter.gq/i/broadcasts/2BlMpgzEj…
రేవంత్ రెడ్డి.. అసలు డీపీఆర్ లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు ఎలా వెళ్లారు?
ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలంటే పూర్తి వివరాలతో కూడిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఉండాలి.. అటు వైపు ఎంత, ఇటు వైపు ఎంత భూమి ముంపునకు గురవుతుందో పూర్తి వివరాలు లేకుండా చర్చలకు ఎలా వెళ్లారు?
దీన్ని బట్టి చూస్తే, ఇది కేవలం కాలయాపన కోసమే వెళ్లినట్టుగా కనిపిస్తోంది.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI
లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- జనగామ ఎమ్మెల్యే @PRR_BRS
♦️ పొంగులేటి ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది!
♦️ సాగునీరు, విద్యుత్ అందక పంట ఎండిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మనోవేదనకు గురై రైతు మృతి
♦️ కలెక్టర్ వేధింపులు, భూభారతి పేరుతో రైతు కుటుంబాన్ని అవమానించడం దారుణం
♦️ రైతు మృతికి బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
♦️ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
♦️ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
♦️ కేసీఆర్ గారు, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తనకు చెందిన నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సరైన సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయింది. విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట చేతికి రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మనోవేదనతో ఆ రైతు మృతి చెందడం బాధాకరం. రైతు మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సదరు రైతుకు ఉన్న చిన్నపాటి సైడ్ వ్యాపారమైన జేసీబీ విషయంలో కూడా కలెక్టర్ కేసులు నమోదు చేసి, చివరికి దాన్ని అమ్ముకునే విధంగా వేధించారు. జనగామ జిల్లాలో భవన నిర్మాణాలకు సంబంధించిన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడం దారుణం. వారి వాహనాలు సీజ్ కావడం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, చివరికి వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితులకు కలెక్టర్ తీరు కారణమవుతోంది. చిరు వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. లక్ష్మణ్ గౌడ్ జేసీబీని అమ్ముకోవడం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వెనుక కూడా కలెక్టర్ వేధింపులే కారణం.
వందల ఏళ్లుగా ఆ కుటుంబానికి ఉన్న భూమిని ఆన్లైన్లో నమోదు చేయకుండా, భూభారతి పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ కుటుంబాన్ని అవమానించారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాల్సిన కలెక్టర్ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేయడం దారుణం. ఈ ఘటనకు బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల త్యాగాల గురించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. అసలు తెలంగాణ అనే పదాన్నే వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి పచ్చి వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి నేడు ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన ఎవరి మద్దతుతో, ఏ డబ్బులతో గెలిచారో ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో అత్యంత ఎక్కువ భూమిని నేడు అక్రమంగా సంపాదించుకుని దేశంలోనే అత్యంత పెద్ద భూ బకాసురుడిగా ఉన్న పొంగులేటి, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేయడం సూర్యుడిపై ఉమ్మివేసిన చందంగా ఉంది. ఉద్యమకారుల కుటుంబాలపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే మొసలి కన్నీరు కార్చడం మానుకుని ఆ కుటుంబాలను ఆదుకోవాలి.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడే ముందు వారి కుటుంబాలకు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్‌పై, కేసీఆర్ కుటుంబంపై నీచమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలను ప్రజలు సహించరని పేర్కొన్నారు.
రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై బీఆర్ఎస్ పోరు
రామగుండంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచిన నాటి నుండి అక్రమంగా పేదల ఇండ్లను కూల్చుతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ అక్రమ కూల్చివేతలను భరించాలి?
చిరు వ్యాపారస్తుల దుకాణాలను, పేదల ఇండ్లను, బీఆర్ఎస్ పార్టీ గద్దెలను, శిలాఫలకాలను, కనిపించిన ప్రతి అభివృద్ధి పనిని తుడిచివేయాలని, బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటే ఇంకా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటాం?
మంచితనంతో, సహనంతో, ఓపికతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని ఇన్ని రోజులు ఓపిక పట్టినం..!
కుట్ర పన్ని, ఇష్టానుసారంగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు కనిపించకుండా మాయం చేయాలనే ఉద్దేశంతో కూల్చివేతలు చేస్తున్నారు!
ఇక ఊరుకునేది లేదు!
ఎట్లైతే గట్ల జై తెలంగాణ! ✊🏻
- మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లావఝ్జల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నాను.
పురస్కారాలు అందుకున్న చమన్ సింగ్, సంగిశెట్టి శ్రీనివాస్, తిరునగరి దేవకీదేవి, కవ్వంపల్లి స్వామి గార్లకు శుభాకాంక్షలు.
గోదావరి గొంతుక, ప్రజా కవి మల్లావఝ్జల సదాశివుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితిని ఎత్తిచూపేందుకు రాసిన 'తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి' అనే పాట నేటి తెలంగాణ పరిస్థితికి కూడా అద్దంపడుతుంది.
ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ @TheDeshapathi గారికి, వికాస సమితి బృందానికి, మల్లావఝ్జల సదాశివుడు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI మీడియా సమావేశం xitter.gq/i/broadcasts/2mdAdmWXQ…
🚨 బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం!
💰 వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
🏛️ 41 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం 82 ఎకరాలు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం!
⚠️ వాటిని దక్కించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్!
❌ కుల సంఘాలను తప్పించి, ట్రస్టుల రద్దుకు నిర్ణయం!
📋 వాటి స్థానంలో భవన నిర్వహణ కమిటీల ఏర్పాటు!
🤐 పేరుకే కమిటీలు.. పెత్తనం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే!
📢 సర్కార్ ముందు మోకరిల్లేలా నిబంధనలతో జీవో నంబర్ 14 జారీ!
రేవంత్ పట్టించుకోలే.. రామన్న మాటిచ్చి నిలబెట్టుకున్నాడు!
నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని కొడుకుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
👉 మస్కట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన మహిళ
👉 రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మి కుటుంబానికి కేటీఆర్ భరోసా
👉 తెలంగాణ భవన్లో కేటీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మి
ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసం చేయడంతో మస్కట్‌లో చిక్కుకుపోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాట నిలబెట్టుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఆ కుటుంబంలో ఆనందం నింపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫసల్వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి, భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించడంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా యజమాని (కఫీల్) ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తనను విదేశాలకు పంపించిన ఏజెంట్ కూడా ఫోన్‌కు స్పందించకుండా, తిరిగి భారత్‌కు పంపించేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు లక్ష్మి కుటుంబానికి తెలిపింది. ఈ క్రమంలో ఆమె వైఫై, సిమ్ కార్డు సేవలు కూడా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరకు పక్కింటి వారి ఇంటర్నెట్ సహాయంతో తన కుమారుడు రాజును సంప్రదించి అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
తల్లి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన కుమారుడు రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్‌ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్ నెల రోజుల్లోనే పాస్‌పోర్టు సమస్యను పరిష్కరించి, తల్లిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తానని రాజుకు భరోసా ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో లక్ష్మి సురక్షితంగా భారత్‌కు తిరిగి చేరుకున్నారు.
స్వదేశానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం లక్ష్మి ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో అండగా నిలిచి, కుమారుడికి ఇచ్చిన మాటను నెల రోజుల్లోనే నిలబెట్టుకున్న కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తుప్పుడు లక్ష్మి మాట్లాడుతూ..
“నా కొడుకుకు కేటీఆర్ గారు నెల రోజుల్లోనే నిన్ను ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చారు. అన్న ఇచ్చిన మాట ప్రకారం నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. నేను, నా కుటుంబం ఎదుర్కొంటున్న కష్టకాలంలో కేటీఆర్ అన్న మాకు అండగా నిలిచారు. ఆయన చేసిన సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. కేటీఆర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని లక్ష్మి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి భయపడి.. అభివృద్ధి పనుల పైలాన్‌ను తొలగిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రామగుండంలో పేదల ఇళ్లను, చిరు వ్యాపారుల దుకాణాలను, ఫంక్షన్ హాళ్లను కూల్చివేస్తున్నారు.
ఆ బాధిత ప్రజలందరూ ఈరోజు రోడ్లపైకి వచ్చారు.
- మాజీ ఎమ్మెల్యే @korkantichander
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి, గీత రచయిత, గోదావరి గొంతుక "మల్లావఝుల సదాశివుడు" స్మారక పురస్కార ప్రదానోత్సవం
🗓️ తేదీ: 03.11.2026, సాయంత్రం 5:00 గంటలకు
📍 వేదిక: మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీయర్స్ ఆడిటోరియం), ఖైరతాబాద్, హైదరాబాద్
ముఖ్య అతిథిగా శ్రీ @KTRBRS గారు హాజరుకానున్నారు.
సాహితీ ప్రియులందరికీ ఇదే సాదర ఆహ్వానం! 💐
LIVE: ఈఆర్సీ కార్యాలయంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS xitter.gq/i/broadcasts/2EmWAgeBy…
మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర.
ప్రాజెక్ట్ చుట్టుపక్కల పేలుళ్లు నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి బ్లాస్టింగ్ చేస్తున్నారు. రాత్రి పూట జరుగుతున్న ఈ జిలెటిన్ బ్లాస్టింగ్ వల్ల పక్కనే ఉన్న తిప్పారం గ్రామంలోని ఇళ్లకు బీటలు వారుతున్నాయి.
మల్లన్న సాగర్ కట్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి, కుంగదీసి మళ్లీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నింద వేయాలనేదే కాంగ్రెస్ దుష్ట పన్నాగం.
రాజకీయ కక్షతో ప్రజల జీవనాధారమైన తెలంగాణ ప్రాజెక్టులను నాశనం చేయకండి 😡
#MallannaSagar
చెరో విల్లా... చెరువు గుల్ల!
ఎంపీకి ఒకటి! ఎమ్మెల్యేకు ఒకటి!!
అక్రమాల 'ఛాయల'లో అధికార దాసోహం
కోహెడలో 'అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ' పేరిట అరాచకం
చిన్న చెరువు, ఫీడర్ చానళ్ల గొంతు నులిమి విల్లాల నిర్మాణం
మైనింగ్ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా రాళ్ల తరలింపు
నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సర్వేలో బయటపడిన నిజాలు
అక్రమాలపై నీటిపారుదల, మైనింగ్ శాఖ అధికారుల లేఖలు
అనుమతుల రద్దుకు హెచ్ఎండీఏ కమిషనర్‌కు సిఫార్సులు
కన్నెత్తి చూసేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారుల జంకు
అటువైపు వెళ్లకూడదంటూ ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి ధమ్కీలు
విల్లాలతో పాటు భారీగా డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు
ఓఆర్ఆర్ లోపల చెరువు మాయమైనా పట్టించుకోని హైడ్రా
భూములు నిషేధిత జాబితాలో ఉన్నా యథేచ్ఛగా నిర్మాణాలు.
AI For AI
Artificial Intelligence for Agricultural Innovation
రెండేండ్ల తర్వాత అధికారంలోకి వస్తాం.. అధికారంలోకి వచ్చాక తప్పకుండా అన్ని వ్యవస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
LIVE: ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు 📍 గ్రామం: అల్వాల, వనపర్తి జిల్లా. xitter.gq/i/broadcasts/2LPLpoQzr…
Keep Learning Every Day.
Keep Innovating Every Day.
Keep Reinventing Yourself Every Day.
AI అన్నీ చేయలేదు కానీ..
ఎవరైతే ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వరో..
ఎవరైతే ఎప్పటికప్పుడు అప్‌స్కిల్ అవ్వరో..
వాళ్లు మాత్రం వెనక్కి వెళ్లిపోతారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి, గీత రచయిత, గోదావరి గొంతుక "మల్లావఝుల సదాశివుడు" స్మారక పురస్కార ప్రధానోత్సవం
🗓️ తేదీ: 03.11.2026,
సాయంత్రం 5:00 గంటలకు
📍 వేదిక: మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీయర్స్ ఆడిటోరియం), ఖైరతాబాద్, హైదరాబాద్
ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెన్ కేటీఆర్ గారు, విశిష్ట అతిథిగా శ్రీ గోరటి వెంకన్న గారు మరియు ఆత్మీయ అతిథిగా శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు హాజరుకానున్నారు.
సాహితీ ప్రియులందరికీ ఇదే సాదర ఆహ్వానం! 💐


















