LIVE: వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరిక. xitter.gq/i/broadcasts/2BlMpgzEj…
లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- జనగామ ఎమ్మెల్యే @PRR_BRS
♦️ పొంగులేటి ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది!
♦️ సాగునీరు, విద్యుత్ అందక పంట ఎండిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మనోవేదనకు గురై రైతు మృతి
♦️ కలెక్టర్ వేధింపులు, భూభారతి పేరుతో రైతు కుటుంబాన్ని అవమానించడం దారుణం
♦️ రైతు మృతికి బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
♦️ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
♦️ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
♦️ కేసీఆర్ గారు, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తనకు చెందిన నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సరైన సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయింది. విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట చేతికి రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మనోవేదనతో ఆ రైతు మృతి చెందడం బాధాకరం. రైతు మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సదరు రైతుకు ఉన్న చిన్నపాటి సైడ్ వ్యాపారమైన జేసీబీ విషయంలో కూడా కలెక్టర్ కేసులు నమోదు చేసి, చివరికి దాన్ని అమ్ముకునే విధంగా వేధించారు. జనగామ జిల్లాలో భవన నిర్మాణాలకు సంబంధించిన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడం దారుణం. వారి వాహనాలు సీజ్ కావడం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, చివరికి వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితులకు కలెక్టర్ తీరు కారణమవుతోంది. చిరు వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. లక్ష్మణ్ గౌడ్ జేసీబీని అమ్ముకోవడం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వెనుక కూడా కలెక్టర్ వేధింపులే కారణం.
వందల ఏళ్లుగా ఆ కుటుంబానికి ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా, భూభారతి పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ కుటుంబాన్ని అవమానించారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాల్సిన కలెక్టర్ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేయడం దారుణం. ఈ ఘటనకు బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల త్యాగాల గురించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. అసలు తెలంగాణ అనే పదాన్నే వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి పచ్చి వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి నేడు ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన ఎవరి మద్దతుతో, ఏ డబ్బులతో గెలిచారో ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో అత్యంత ఎక్కువ భూమిని నేడు అక్రమంగా సంపాదించుకుని దేశంలోనే అత్యంత పెద్ద భూ బకాసురుడిగా ఉన్న పొంగులేటి, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేయడం సూర్యుడిపై ఉమ్మివేసిన చందంగా ఉంది. ఉద్యమకారుల కుటుంబాలపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే మొసలి కన్నీరు కార్చడం మానుకుని ఆ కుటుంబాలను ఆదుకోవాలి.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడే ముందు వారి కుటుంబాలకు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్‌పై, కేసీఆర్ కుటుంబంపై నీచమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలను ప్రజలు సహించరని పేర్కొన్నారు.
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లావఝ్జల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నాను.
పురస్కారాలు అందుకున్న చమన్ సింగ్, సంగిశెట్టి శ్రీనివాస్, తిరునగరి దేవకీదేవి, కవ్వంపల్లి స్వామి గార్లకు శుభాకాంక్షలు.
గోదావరి గొంతుక, ప్రజా కవి మల్లావఝ్జల సదాశివుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితిని ఎత్తిచూపేందుకు రాసిన 'తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి' అనే పాట నేటి తెలంగాణ పరిస్థితికి కూడా అద్దంపడుతుంది.
ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ @TheDeshapathi గారికి, వికాస సమితి బృందానికి, మల్లావఝ్జల సదాశివుడు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI మీడియా సమావేశం xitter.gq/i/broadcasts/2mdAdmWXQ…
LIVE: ఈఆర్సీ కార్యాలయంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS xitter.gq/i/broadcasts/2EmWAgeBy…
మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర.
ప్రాజెక్ట్ చుట్టుపక్కల పేలుళ్లు నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి బ్లాస్టింగ్ చేస్తున్నారు. రాత్రి పూట జరుగుతున్న ఈ జిలెటిన్ బ్లాస్టింగ్ వల్ల పక్కనే ఉన్న తిప్పారం గ్రామంలోని ఇళ్లకు బీటలు వారుతున్నాయి.
మల్లన్న సాగర్ కట్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి, కుంగదీసి మళ్లీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నింద వేయాలనేదే కాంగ్రెస్ దుష్ట పన్నాగం.
రాజకీయ కక్షతో ప్రజల జీవనాధారమైన తెలంగాణ ప్రాజెక్టులను నాశనం చేయకండి 😡
#MallannaSagar
LIVE: ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు 📍 గ్రామం: అల్వాల, వనపర్తి జిల్లా. xitter.gq/i/broadcasts/2LPLpoQzr…
ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు, రేవంత్ రెడ్డి మనపై రుద్దిన కరువు!
శ్రీశైలానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కూడా చంద్రబాబు నాయుడు కృష్ణా నీళ్లను తరలించుకుపోతే..
శ్రీశైలం ప్రాజెక్ట్ పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం రేవంత్ రెడ్డి నీళ్లను ఎత్తిపోయలేదు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
కరువు రాబోతోందని జూన్ నెల నుంచే బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నా..
కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పోతున్నాయని మొత్తుకున్నా..
కేవలం మాపై రాజకీయ కక్షతో పంపులను ఆన్ చేయకుండా..
750 టీఎంసీల గోదావరి జలాలను దిగువకు వదిలేసి
రాష్ట్రంలో కరువుకు కారణమైంది కాంగ్రెస్ సర్కారే!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచిన రామన్న🙌❤️
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు పరిస్థితులతో.. పంట దిగుబడి రాదేమోననే ఆవేదనతో, అప్పుల బాధలు తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోథ్ నియోజకవర్గం తలమడుగు మండలానికి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రైతులు కాడే లస్మన్న, గుర్రాల ప్రతాప్ రెడ్డి, పశువుల ఆశన్న, బద్దం రాజేశ్వర్ రెడ్డిల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన కేటీఆర్.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు @AnilJadhav_brs, @drsanjayBRS, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి @JohnsonKTRS, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
LIVE: 🌾 "రైతు గర్జన" సభ
📍 ఆదిలాబాద్
xitter.gq/i/broadcasts/2AMXEqzXA…
LIVE: బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS xitter.gq/i/broadcasts/2evMlrPRq…
An MLA-Chor in tow with a Vote-For-Note-Chor protesting against Vote Chori in Delhi tomorrow!
Just Congress Things…I guess
@RahulGandhi who encouraged defection of 10 BRS MLAs to Congress in Telangana is sitting in a dharna with his ‘Vote for Note’ Champion scamster Revanth Reddy against Vote Chori in the Country
I rest my case 🙏🏽
Long Live Indian Democracy! 🇮🇳
Jai Hind
Jai Telangana
ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే😢
రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి పాలనలో...
కరెంటు కోతలు తీవ్రమై..
పంట కాలువల్లో నీళ్లు రాక..
చేతికికొస్తున్న పంట ఎండిపోతుండటం చూసి తట్టుకోలేక..
జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, తుపత్రాల గ్రామంలో
పెద్దవాగులో పారుతున్న మురుగు నీటినే ట్యాంకర్లతో తోడుకుని,
తమ పంటలను కాపాడుకోవడానికి పొలాలకు పారించుకుంటున్న రైతన్నలు.
#CongressFailedTelangana
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మీడియా సమావేశం
@KaushikReddyBRS @drsanjayBRS xitter.gq/i/broadcasts/2AMXzKgVv…






