YSRCP Italy (@YSRCP_Italy) header
YSRCP Italy (@YSRCP_Italy) profile picture
Joined August 2025
Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)Photo by YSRCP Italy (@YSRCP_Italy)
YSR❤️
5
29
1
287
8,758
AP Phase 1 Local war between: Other 264 vs JSP 164 🤡
5
36
449
YSRCP Italy retweeted
🚨BIG EXPOSE కుప్పం టీడీపీ కార్యకర్తల దాడిలో మరణించిన వైసీపీ నాయకుడు రాజేంద్రన్ పార్టీ గుర్తింపు కార్డును సైతం బయటపెట్టిన వైసీపీ రాజేంద్రన్ టీడీపీ కార్యకర్త అని, తమ కార్యకర్తను తమవాళ్లే చంపుకున్నారంటున్న టీడీపీ
1
120
1
421
7,778
YSRCP Italy retweeted
బాబు అరాచకాలు తట్టుకొని.. కుప్పంలో జెండా ఎగరేసిన YSRCP.. 22 పంచాయతీలు కైవసం - నామినేషన్ల దశ నుంచి పోలింగ్ వరకు అనేక అడ్డంకులు ఎదురైనా పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ సీపీ మద్దతుదారులు గణనీయమైన విజయాలు సాధించారు. - నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, స్క్రూటినీ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం, పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లను అనుమతించకపోవడం వంటి చర్యలకు అధికార పార్టీ పాల్పడింది. - ఆంక్షలనే ఛేదించి వైయస్సార్ సీపీ మద్దతు దారులు భారీ మెజార్టీతో విజయాలు సాధించారు. - చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైయస్సార్ సీపీ మద్దతుదారులు సత్తా చాటడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. - కుప్పం నియోజకవర్గంలోని మొత్తం 95 గ్రామ పంచాయతీలకు గానూ 22 పంచాయతీల్లో వైయస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించడం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. - రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, 1,200కు పైగా పంచాయతీల్లో వైయస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అమరావతికి అతి సమీపంలో ఉన్న గన్నవరం నియోజకవర్గంలోనూ 84 గ్రామ పంచాయతీల్లో 39 పంచాయతీలను కైవసం చేసుకుంది. - కూటమి ప్రభుత్వ పాలనపై గ్రామీణ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి ఈ ఫలితాలు సంకేతమా? అనే చర్చకు తెరలేచింది. - పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమనే చర్చ మొదలైంది. కుప్పం మండలం: * కొత్తపల్లె * గణేష్‌పురం * మోట్లచేను * వనగుట్టపల్లె * గోనుగూరు గుడుపల్లె మండలం: - చీకటిపల్లె - పొగరుపల్లె - ఓఎన్ కొత్తూరు - గుండ్లసాగరం రామకుప్పం మండలం: - రామకుప్పం (600 ఓట్ల మెజార్టీ) – మండల కేంద్రం - నారాయణపురం తండా - బల్ల - కెంచనబల్ల (వైసీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి విజయం) శాంతిపురం మండలం: - కెనుమాకులపల్లె (400 ఓట్ల మెజార్టీ) – మండల కేంద్రం - ఎంకే పురం - అనికెర - కోనేరుకుప్పం - సొన్నేగానిపల్లె - దండికుప్పం - చెంగుబల్ల - కోలమడుగు - రాళ్లబూదుగూరు
1
5
34
724
YSRCP Italy retweeted
🚨Delimitation Updates డీలిమిటేషన్‌ బిల్లుపై మారుతున్న రాజకీయ సమీకరణాలు ♦️ మరోసారి బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు ♦️ ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సంపూర్ణ మద్దతు ♦️ ప్రాంతీయ సమతుల్యతకు రక్షణ కల్పిస్తే వైయస్సార్‌సీపీ మద్దతు? ♦️ వైఖరిని పునఃపరిశీలిస్తున్న డీఎంకే, శరద్‌పవార్‌ ఎన్సీపీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏప్రిల్‌లో లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ లభించకపోవడంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బిల్లుకు ఆమోదం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన, జేడీయూ, ఏక్‌నాథ్‌ షిండే శివసేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీ, లోక్‌ జనశక్తి పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి, ప్రాంతీయ సమతుల్యతకు రక్షణ కల్పించాలన్న షరతుతో వైయస్సార్‌సీపీ బిల్లుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందనేది సమాచారం. గతంలో బిల్లును వ్యతిరేకించిన డీఎంకే కూడా తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాతినిధ్య నిష్పత్తి తగ్గకుండా రక్షణ కల్పించాలన్న షరతుతో తన వైఖరిని పునఃపరిశీలిస్తోంది. శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ సవరించిన బిల్లును పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనుంది. గత ఏప్రిల్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన, డీఎంకే, శరద్‌పవార్‌ ఎన్సీపీలు బిల్లును వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్లకు మద్దతిస్తూనే, వాటి అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఏప్రిల్‌ 17న లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన 352 ఓట్లు లభించకపోవడంతో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. గత ఏప్రిల్‌తో పోలిస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీల్లో మారుతున్న సమీకరణాలు, ప్రాంతీయ పార్టీల నుంచి షరతులతో కూడిన మద్దతు సంకేతాల నేపథ్యంలో కేంద్రం మరోసారి డీలిమిటేషన్‌ బిల్లును తెరపైకి తీసుకొస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కేంద్రం ప్రకటించిన లక్ష్యం. అయితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎలాంటి రక్షణ కల్పిస్తారు? రాష్ట్రాలవారీగా లోక్‌సభ స్థానాల కేటాయింపునకు ఏ ప్రాతిపదికను అనుసరిస్తారు? అన్న అంశాలపైనే ప్రాంతీయ పార్టీల తుది నిర్ణయం ఆధారపడి ఉంది.
🚨 Delimitation Updates డీలిమిటేషన్‌పై బీజేపీ ఆకస్మిక అడుగులు? ▪️ 2029 ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రయత్నాలు ▪️ మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపెట్టిన డీలిమిటేషన్‌ ▪️ గతంలో వీగిపోయిన బిల్లుకు మరోసారి ఆమోదం పొందే ప్రయత్నం ▪️ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై కొనసాగుతున్న ఆందోళన - లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని బీజేపీ ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. నవంబర్‌ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్‌ 2 నుంచి రాజ్యసభ సమావేశాల నిర్వహణకు కేంద్రం చర్యలు చేపట్టింది. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను మరోసారి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. - వాస్తవానికి 2026 తర్వాత నిర్వహించే తొలి జనగణన గణాంకాలు ప్రచురితమైన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. కానీ, కొత్త జనగణన గణాంకాల కోసం వేచి చూడకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్‌ చేపట్టేందుకు గత ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. - ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్యను గరిష్ఠంగా 850కి పెంచాలన్నది గతంలో కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదన. నియోజకవర్గాల సంఖ్య పెంపుతో పాటు వాటి సరిహద్దులు, రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం, రిజర్వేషన్లలోనూ మార్పులకు అవకాశం ఏర్పడుతుంది. - 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం. ఇందుకోసం డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావాలన్నది బీజేపీ వాదన. అయితే, ప్రస్తుత నియోజకవర్గాల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకుండా, వాటిని సీట్ల పెంపుతో ఎందుకు ముడిపెడుతున్నారన్నది ప్రతిపక్షాల ప్రశ్న. - జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ఫలితాలను సాధించాయి. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పునఃకేటాయిస్తే, అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, మొత్తం లోక్‌సభ స్థానాల్లో వాటి వాటా తగ్గే ప్రమాదంపై ఆందోళన కొనసాగుతోంది. - నియోజకవర్గాల పునర్విభజన కేవలం సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియ మాత్రమే కాదు. నియోజకవర్గాల భౌగోళిక స్వరూపం, ఓటర్ల కూర్పు, రిజర్వేషన్లు, రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం కూడా మారతాయి. ఈ ప్రక్రియను బీజేపీ తన ఎన్నికల ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నది ప్రతిపక్షాల అభ్యంతరం. - ఈ ఏడాది ఏప్రిల్‌ 16న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌కు సంబంధించిన మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌ 17న రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. - అప్పట్లో బిల్లును వ్యతిరేకించిన డీఎంకే, ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి రక్షణ కల్పించాలన్న షరతుతో ఈ పార్టీలు సహకరించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్రం మరోసారి బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. - 2029 ఎన్నికలకు ముందే కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళా రిజర్వేషన్ల అమలు, జనాభాకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్యం పెంపు కేంద్రం చెబుతున్న కారణాలు కాగా, ఎన్నికల రాజకీయ ప్రయోజనాలు కూడా దీని వెనుక ఉన్నాయన్నది ప్రతిపక్షాల వాదన. విపక్షాల నుంచి ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్నలు: ▪️ కొత్త జనగణన పూర్తయ్యే వరకు కేంద్రం ఎందుకు వేచి చూడలేకపోతోంది? ▪️ 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు డీలిమిటేషన్‌ చేయాల్సిన అవసరం ఏమిటి? ▪️ మహిళా రిజర్వేషన్ల అమలును లోక్‌సభ సీట్ల పెంపుతో ఎందుకు ముడిపెడుతున్నారు? ▪️ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పిస్తారా? ▪️ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలతో, రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులు ఎందుకు జరపకూడదు?
1
1
8
1,477
YSRCP Italy retweeted
🚨 DSR Infinity: చంద్రబాబు కుటుంబానికి ₹1,200 కోట్ల సంపద సృష్టించే అవకాశం! ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం తన కుటుంబ సంపదను పెంచుకోవడంలో బిజీగా ఉన్నారు 2000 సంవత్సరంలో కొద్ది కోట్లకు కొనుగోలు చేసిన కొండాపూర్‌లోని 11 ఎకరాల భూమి.. నేడు DSR Infinity పేరుతో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మారింది. ఈ ప్రాజెక్టులో నారా లోకేష్, నారా భువనేశ్వరి వాటా 13.5 లక్షల చదరపు అడుగులకు పైగా ఉంటుందని, దాని విలువ ₹1,200 కోట్లకు పైగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అసలు ప్రశ్న ఒక్కటే.. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కల్పించడంపై చంద్రబాబు దృష్టి ఉందా? లేక తన కుటుంబానికి వేల కోట్ల సంపదను సృష్టించడంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందా? Image credits :- @rezy_in #DSRInfinity #CBN #AndhraPradesh #Unemployment
6
18
1
67
2,393
YSRCP Italy retweeted
దేవుడి ఎదుట అందరూ సమానమేనని, అది సమాజంలో వెల్లివిరియాలని తన కీర్తనల ద్వారా చాటి చెప్పిన మహనీయుడు శ్రీ భక్త కనకదాసు గారు. శ్రీకృష్ణుడిపై తనకున్న అపారమైన భక్తిని సామాన్యులకు అర్థమయ్యే భాషలో కీర్తనలుగా మలిచి, ప్రజల హృదయాలకు చేరువ చేశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్యుడైన శ్రీ భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
24
329
3
1,578
33,022
YSRCP Italy retweeted
అసోంలో భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లికి చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్ కదిమి వేణు మరణం నన్ను కలచివేసింది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వేణుకు నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
26
372
5
1,830
38,718
YSRCP Italy retweeted
Andhra said enough !
6
135
2
833
5,742
😂😂
జనసేనకు సున్నా పంచాయతీలు దక్కిన జిల్లాలు! (రాత్రి 11:00 గంటల సమయానికి…) అల్లూరి జిల్లా – 0 ప్రకాశం జిల్లా – 0 మార్కాపురం – 0 అనంతపురం – 0 అన్నమయ్య జిల్లా – 0 చిత్తూరు జిల్లా – 0 జిల్లాల వారీగా జనసేన ఖాతా తెరవలేని పరిస్థితి!
1
1
22
439
YSRCP Italy retweeted
జనసేనకు సున్నా పంచాయతీలు దక్కిన జిల్లాలు! (రాత్రి 11:00 గంటల సమయానికి…) అల్లూరి జిల్లా – 0 ప్రకాశం జిల్లా – 0 మార్కాపురం – 0 అనంతపురం – 0 అన్నమయ్య జిల్లా – 0 చిత్తూరు జిల్లా – 0 జిల్లాల వారీగా జనసేన ఖాతా తెరవలేని పరిస్థితి!
59
175
13
1,116
54,383
Gannavaram 2029 లో అందరి లెక్కలు తెలుస్తాడు @DrVVamsi 🔥🔥 YSRCP - 26 TDP - 12 JSP - 1
2
33
227
1,634
YSRCP Italy retweeted
TDP Rural Leaders 😆
2
20
2
204
2,542
YSRCP Italy retweeted
🚨 #CBNTurnedAPIntoBihar కుప్పంలో దారుణంలో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు దారుణం.. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రాజేంద్ర మృతి! కుప్పం మండలం వానగుట్టపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుతో బసవరాజు 25 ఓట్ల మెజారిటీతో గెలుపు అధికారికంగా ప్రకటించిన ఆర్వో.. కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. తమ మాట విననందుకు ఎన్నికల ఆఫీసర్ కారుపై టీడీపీ నేతలు దాడి కారు స్పీడ్‌గా దూసుకెళ్ళడంతో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రాజేంద్ర మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు ఫలితాల్ని తారుమారూ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నం.. ఇంత దారుణమా @ncbn ? #TDPGoons #SaveDemocracyInAP #SadistChandraBabu
13
266
16
590
19,114
బాధల్లోంచి వచ్చిన ఆనందం 😂😂
33
323
9,363
YSRCP Italy retweeted
🚨𝗦𝗨𝗣𝗘𝗥 𝗘𝗫𝗖𝗟𝗨𝗦𝗜𝗩𝗘 🔴 జ‌న‌సేన రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం.. పెద్దిరాజు రిమాండ్‌ రిపోర్టుతో మరిన్ని ప్రకంపనలు ▪️ రుక్మిణి, కేకే ఫిర్యాదులను సీఐడీ పక్కనపెట్టడం వెనుక ఆంతర్యమేంటి? ▪️ బాధితులు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న జనసేన కీలక నాయకుడు ఎవరు? ▪️ ఉద్యోగాల కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించిందెవరు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ▪️ సొంత పార్టీ కార్యాలయంలోనే స్కాంపై గొడవలు జరిగినా పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి రాలేదా? - ఉద్యోగాల కోసం రూ.7 కోట్ల వసూళ్ల స్కాంలో పెద్దిరాజు రిమాండ్‌ రిపోర్టులోని అంశాలు మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. - పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి, చీఫ్‌ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ కోట రుక్మిణి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కళ్యాణం శ్రీనివాస్‌ అలియాస్‌ కేకే నవంబర్‌ 11న ఇచ్చిన ఫిర్యాదులపై కాకుండా, నవంబర్‌ 17న కోయ శ్యాంకిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రమే నిమ్మకాయల పెద్దిరాజును అరెస్టు చేశారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అంటే, కోట రుక్మిణి, కేకే ఇచ్చిన ఫిర్యాదులను సీఐడీ పరిగణనలోకి తీసుకోలేదంటే, వారి మాటలపై విశ్వాసం లేదని అర్థమా? లేదా వాళ్లు ఈ కుంభకోణంలో భాగమని అర్థమా? దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. - నవంబర్‌ 11వ తేదీ రాత్రి 9 గంటలకు ఒకటి, ఆ తర్వాత రాత్రి 9.30 గంటలకు మరొకటి చొప్పున నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను పూర్తిగా ఎందుకు పక్కనపెట్టారు? నవంబర్‌ 17 నాటి కంప్లైంట్‌ను మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? - రుక్మిణి, కేకే ఇచ్చిన కంప్లైంట్లను పరిగణనలోకి తీసుకోలేదంటే.. మరెందుకు ధరణి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు? ఎందుకు చిత్రహింసలు పెట్టారు? ఎందుకు వదిలేశారు? 56 గంటలపాటు ఆమెను ఎందుకు కొట్టారు? - కుంభకోణం 2025 నుంచే ప్రారంభమైతే.. మరెందుకు కోట రుక్మిణి, కేకే అప్పుడు ఫిర్యాదు చేయలేదు? - అప్పటికే ధరణి కృష్ణ జనసేన ఐటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోందని పెద్దిరాజు తన వాంగ్మూలంలో పోలీసులకు తెలిపాడు. కానీ, ధరణి కృష్ణ జూన్‌ 2026 నుంచే పనిచేస్తోందని కోట రుక్మిణి తన ఫిర్యాదులో చెప్పడంలో ఆంతర్యమేంటి? - జులై 2026లో తమకు అందిన అపాయింట్‌మెంట్‌ లెటర్లు, సర్వీసు రిజిస్టర్లు ఫేక్‌ అని ధరణి కృష్ణతో జరిపిన సంభాషణను బాధితులు రికార్డు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ నిరుద్యోగులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న జనసేన కీలక నాయకుడు ఎవరు? - ఇది జరిగిన 13 నెలల తర్వాత, ఇప్పుడు నవంబర్‌ 17న ఒకే ఒక్క వ్యక్తి ద్వారా ఇచ్చిన ఫిర్యాదును మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? అసలు ఏం జరిగింది? - 2026 జులైలో ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు తమకు ఇచ్చిన తప్పుడు అపాయింట్‌మెంట్‌ లెటర్లతో ఎండోమెంట్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెళ్తే, ఆ ఆఫర్‌ లెటర్లు నకిలీవని, సంబంధిత వ్యక్తులెవరూ దేవాదాయ శాఖలో పనిచేయడం లేదని గొల్లప్రోలులోని ఎండోమెంట్‌ అధికారులు చెప్పిన మాట వాస్తవం కాదా? - ఉద్యోగాల పేరుతో మోసం జరిగిందని జులై 2026లోనే దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ, ఆ విషయం వారికి నిర్ధారణ అయినప్పటికీ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదా? ఈ వ్యవహారాన్ని దాచిపెట్టడానికి ఎవరెవరు ప్రయత్నించారు? - పైగా నవంబర్‌ 20వ తేదీన దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కె. రామచంద్రమోహన్‌ సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కు రాసిన లేఖలో బాధితులెవరూ తమను కలవలేదని, ఈ విషయాన్ని తమ కార్యాలయం దృష్టికి తీసుకురాలేదని, మీడియా ద్వారా చూసిన తర్వాతే నవంబర్‌ 19న తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అంటే.. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయని తెలుస్తోంది. - బాధితులంతా ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కోట రుక్మిణికి చెందిన కైరన్‌ కన్సల్టెన్సీస్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వద్దకు వచ్చి, తమ ఉద్యోగాల సంగతి తేల్చాలని, డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. మరి ఈ విషయం రుక్మిణికి తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు? దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదు? అంటే, ఇది ఆమె ప్రమేయాన్ని సూచిస్తున్నట్లు కాదా? - తర్వాత బాధితులంతా 2026 సెప్టెంబరు 16న యూకేలోని కైరెన్‌ కన్సల్టెన్స్‌ సర్వీసెస్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్లు, తిరిగి చెల్లించినట్లు రశీదులు చూపించారు. తన ప్రమేయం లేకపోతే రుక్మిణి దీనిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? - కేంద్ర నిఘా సంస్థ ఐబీ ద్వారా తనకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని గతంలో పలుమార్లు బహిరంగంగా ప్రకటనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అసలు ఈ స్కాం గురించి వివరాలు అందకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు, తాను నివాసం ఉంటున్న సొంత పార్టీ కార్యాలయంలోనే పలుమార్లు ఈ స్కాం విషయంలో గొడవలు చెలరేగినా, తన దృష్టికి రానట్లు ఆయన స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
1
20
74
2,405
సత్యసాయి జిల్లాలో పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన టీడీపీ మూకలు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వైయస్‌ఆర్‌సీపీకి పడిపోతున్నాయనే అనుమానంతో.. ఇంకు తీసుకెళ్లి బాక్స్‌లో పోసిన టీడీపీ గూండాలు. అయినా వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెనుకంజ స్థానిక ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతాయనే.. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉండాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసిన వైయస్ జగన్ గారు కానీ.. సీసీ కెమెరాలు పెడితే తమ దౌర్జన్యాలు సాగవని టీడీపీ నేతలు ఒత్తిడి తేవడంతో ఆ దిశగా ఆలోచించని ఎస్‌ఈసీ #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
1
83
379
5,854
The political sparring among parties in Telangana over the Rayalaseema Lift Scheme is obscuring the facts. @ncbn, who should clarify the issue, is staying silent to protect his hotline friendship with the Congress. The Rayalaseema Lift Scheme taken up during our government is not a new project. It has no additional water allocations, new canals, additional reservoirs or additional ayacut. It is like an insurance scheme designed to make more effective use of the same Krishna River water, under the same allocations and through the same canals from Pothireddypadu, for the same Rayalaseema projects that frequently face drought conditions. For several decades, the water reaching the State through the Krishna River has been declining. The lack of inflows from upstream is one problem. Another serious concern is that Telangana releases even the water that does arrive downstream at will, in the name of power generation. For the Pothireddypadu Head Regulator to draw water from Srisailam at its full capacity of 44,000 cusecs, the reservoir level must be at least 880 feet. If it falls below 854 feet, no water can be drawn at all. It is also uncertain how many days the reservoir level will remain above 880 feet. As a result, meeting Rayalaseema’s drinking water and irrigation needs is becoming increasingly difficult. Meanwhile, Telangana is moving ahead with plans to draw water from Srisailam from a level of 800 feet. The planned daily drawdown capacity is 1.5 TMC through the Palamuru-Rangareddy project, 0.5 TMC through Dindi, 0.4 TMC through Kalwakurthy and 0.5 TMC through SLBC. Together, these projects are designed to draw nearly 3 TMC a day. Telangana is also releasing water from the 800-foot level for power generation. It was in these circumstances that the YSRCP government took up the Rayalaseema Lift Scheme as an alternative. When water cannot be drawn from Srisailam through Pothireddypadu, the scheme is intended to lift water and pump it into the existing Pothireddypadu canal system, which carries it to reservoirs already in use. If water has been allocated but cannot be used, what purpose do those allocations serve? Since the scheme provides no additional water allocations or reservoirs, who is harmed by it, and how? Is it fair to portray as a major threat a scheme intended to help secure water for people? Unfortunately, soon after Chandrababu Naidu came to power, work on the nearly completed Rayalaseema Lift Scheme was stopped, apparently because he did not want Jagan to receive credit. Instead of completing the project and firmly explaining its necessity in response to objections, he sacrificed it for the sake of hotline politics. At a time when the region is facing drought-like conditions, this has undermined people’s ability to use water already allocated to them and put Rayalaseema’s lifeline at risk. It is wrong to make unnecessary allegations against a project that harms no one.
11
381
1,039
13,152
🚨Sensitive Content దారుణం 🥲💔 YSRCP మద్దతుదారులపైకి కారు ఎక్కించిన MLA అఖిలప్రియ
1
21
67
634
రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన @ncbn తన హాట్‌లైన్‌ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదే ఈ పథకం. కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్‌ లెవల్‌ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్‌ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్‌ లాంటి రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా? దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్‌ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు. #RayalaseemaLiftIrrigation
77
885
42
2,554
116,932
🚨🚨 నంద్యాల జిల్లా అహోబిలంలో హైటెన్షన్! వైసీపీ మద్దతుదారులపైకి దూసుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ కాన్వాయ్‌లోని స్కార్పియో. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు, ఓ మహిళ పరిస్థితి విషమం. తీవ్ర గాయాలతో కారు కింద చిక్కుకున్న మహిళను పోలీసులు, స్థానికులు బయటకు తీశారు.
5
11
277