Pinned Tweet
నా కళ్ళకు,నీ కలల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా శ్వాసకు,నీ స్పందన వెంబడి వెళ్ళటమే తెలుసు
నా మనసుకు,నీ ఊహల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా పదాలుకు,నీ పాదాల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా కవితకు,నీ వర్ణన మాత్రమే తెలుసు.
రాగద్వేషాలకు అతీతమైనది నిజమైనప్రేమ.
అలాంటి ప్రేమకు,ప్రతీ రోజు ప్రేమికుల రోజే💕
యుగయుగాలుగా తానెవరో తెలుసుకోవాలని మధనపడిన అందం.. సృష్టినంతా గాలించి, చివరికి నీ ముంగిట తానెవరో కనుగొంది...
అహర్నిశలు తనను తాను మలుచుకుంటూ వచ్చిన లావణ్యం, నీలో ఇమిడిన క్షణమే సంతృప్తి చెంది నిశ్చింతగా సేదతీరింది...
అద్భుతం.. దుర్లభం.. మనోహరం.. సృష్టిలో సాటిలేని సౌందర్యం..💖నువ్వు💖
ఏ కవి చెక్కిన శిల్పమో
ఏ శిల్పి వ్రాసిన రసకావ్యమో
ఏ నాట్యకారుడు పాడిన రాగమో
ఏ గానగంధర్వుడు ఆడిన నాట్యమో
ఏ చిత్రకారుడు కట్టిన గోపురమో
ఏ వాస్తుశిల్పి గీసిన చిత్రమో..
అరెరే తప్పుగా చెప్పాడే అనుకోకు
కళలన్నీ కలిసి సాక్షాత్కరించిన సౌందర్యపు కళ నీ అందం..
నీ ముగ్ధ మోహన రూపానికి నా దాసోహం!
అందరిని మట్టితో చేసి, నిన్ను మాత్రం మృదువైన పారిజాతపు కుసుమాల దండలా మలిచాడు ఆ బ్రహ్మయ్య. నిన్ను సృష్టిస్తున్న సమయంలో అక్కడి గంధర్వ కన్యలు రక్తి రాగమైన ఆభేరిలో ఆలపించారు కాబోలు, ఆ ఆరోహణ అవరోహరణల క్రమమంతా నీ దేహంలో ప్రతిబింబిస్తోంది. నమ్మవా? ఓసారి, నా కళ్ళతో నిన్ను నువ్వు చూసుకో❣️
నీ ఊహలతో కోనసాగే నా సాంగత్యం, నిజానికి ఓ ఏకాంతపు చెర..
నీ జ్ఞాపకాల దగ్గిరే ఆగిపోయే నా అంతరంగం, నా మనసుపై పరచుకున్న ఓ అబద్ధపు తెర..
అసంపూర్ణంగా వదిలేసిన ఈ లేఖలోని వ్రాయని వాక్యాలు చదవాలనుకుంటే, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఎందుకంటే, ముగింపులులేని మౌనవాక్యాలు పలకగలిగేవి నా కళ్ళే మరి!
ముగిశాయి అనుకున్న కొన్ని కథలు కొనసాగుతూనే ఉంటాయి ఊపిరి ఆగిపోయే వరకు ...నిజమే!
ఏమో తను మళ్ళీ రావొచ్చేమో ...
ఏమో గుర్రం ఎగరొచ్చేమో ...
ఎవరికి తెలుసు??? 🫶
#HappyValentines💞
NNN వ్రత చింతన కాలే, ఇంద్రియ నిగ్రహం కోల్పోమస్తు!
NNN వ్రత తిష్ట సమస్త యవ్వన పురుషే, పక్కింటి అంకుల్ నవంబర్లో మాత్రమే ఊరెళ్ళమస్తు!
NNN వ్రత ఆచరణ సమయే, సమస్త విఘ్నాలు కలుగమస్తు!
క్లుప్తంగా, నో నట్ నవంబర్ వ్రత భంగం ప్రాప్తిరస్తు!
అస్తు, అస్తు, తథాస్తు!
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
గిత్త
ఆ చందమామ నీ మోమేనా చిత్రాంగద
నాపైనే మురిపించవే నీ వెన్నెలా
ఆ నీలిమబ్బు నీ కురులేనా చిత్రాంగద
నాపైనే కురిపించవే నీ ఝల్ల ఇలా
ఆ మల్లెలే నీ బుగ్గలా చిత్రాంగద
నీ పరిమళం వెదజల్లవే ఓ మారిలా
నా గుండెలోని అలజడే నువ్వు చిత్రాంగద
నీ కౌగిలే ప్రసాదించవే జో లాలిలా
చిత్రమే చిత్రాంగద..నీ అందమే🩷
చిత్రమే చిత్రాంగద నీ రూపమే
బహుచిత్రమే చిత్రాంగద నీ వయ్యారమే
నిను అందానికే భాష్యములా అమర్చిన ఆ భాష్యకారుడెవరో
నిను చందానికే భావములా చెక్కిన ఆ శిల్పకారుడెవరో
ఎదలోయల్లో సవ్వడిలా నిను మలచిన ఆ విశ్వకర్మ ఎవడో
ఓ వశీకరణమంత్రంలా నిను అందించిన ఆ మంత్రకారుడెవరో
చిత్రమే చిత్రాంగద..నీ అందమే🩷
అచ్చమైన నీ మోము అందం, అచ్చులు
ఇంద్రియ వాంఛలని మేల్కొలిపే నీ మేను, స్పర్శములు
పొందికైన నీ మెలికలు, సరళములు
సవాలు విసిరే పరువాలు, పరుషములు
వాటి మధ్య నలిగే నీ నడుము, స్థిరములు
ఊపిరి నిలిపేసే నీ సౌందర్యం, ఊష్మాలు
కొండకోనలంటి నీ ఎత్తుపల్లాలు, అంతస్తములు
నువ్వు, అక్షరాలా నా అక్షరమాల!✍️
సరిపోదే శనివారం,నీ సొగసే సొంతమైతే
అలుపెరగదు ఆదివారం,నీ అందం అందొస్తే
శోభనమే సోమవారం,నీతో నే జతకడితే
మంగళమే మంగళవారం,నీ మత్తులో మరిగితే
బాధపడదు బుధవారం,నీ బుగ్గన ముద్దెడితే
గడవదు గురువారం,నీ గోము గుర్తొస్తే
శుభమయమే శుక్రవారం,నీ శ్వాసలో కరిగితే
ఏ రోజు సరిపోదే, సఖీ,నీ చెంతను చేరితే!
నా కథలో రెండు కథనాలు. నాదొకటి. నీదొకటి. నీ కథనంలో నాదొక అనామక పాత్రే కావచ్చు కాని, దేవత లేని ఆలయంలా బోసిపోయిన నా కథనంలో మాత్రం..నా ఆశలపై వెండివానలు కురిపించే కథానాయికవి నువ్వే. నీ రాకతో బోలెడు మలుపులు. అబ్బురపరిచే చిన్నిచిన్ని ఆనందాలు. నిన్న కనిపించని వింతలు, కవ్వింతలు ఇంకెన్నో💖
బంధీయే ప్రతీ మనిషి, ఆశపడినంత వరకు
బంధీయే ప్రతీ మనిషి, సహనం లేనంత వరకు
బంధీయే ప్రతి మనిషి, కోపమున్నంత వరకు
బంధీయే ప్రతి మనిషి, ఎదురుచూసేంత వరకు
బంధీయే ప్రతీ మనిషి, విడిచి వెళ్ళటం నేర్చే వరకు
బంధీయే ప్రతీ మనిషి, తానెవరో తెలుసుకునే వరకు
బంధీయే ప్రతీ మనిషి, తనని తాను కలుసుకునే వరకు🧩
అందరిని మట్టితో చేసి, నిన్ను మాత్రం గులాబీల ఉలితో దట్టమైన ఓ ఎర్రచందనం చెక్కతో చక్కగా చెక్కేసాడు ఆ బ్రహ్మ. ఓ మాట చెబితే అతిశయం అనుకుంటావేమో కానీ చెప్పేస్తాను. నీ ఎద సంపదని చూడగానే, ఆ వక్షోజాల మధ్యనున్న ఇరుకు లోయలో నేనెందుకు ఓ పుట్టుమచ్చగా పుట్టలేదనే ఊహతో ఎంత దిగులేస్తోందో తెలుసా?
అడగగానే దేవత బొమ్మలు ఇచ్చినందుకు, ధన్యవాదాలు @actressbuff3 గారు... వచ్చే జన్మలో నువ్వు కూడా ఎదలోయలో కాకపోయినా కనీసం ఈ దేవత బొడ్డు పక్కన ఒక పుట్టుమచ్చగా పుట్టాలని కోరుకుంటూ 🫂
ఎదో ఓ రోజు, కాల ప్రవాహంలో నేను కూడా కొట్టుకుపోతానని తెలుసు. భవబంధాలన్నీ తెగిపోయే ఆ చిట్టచివరి క్షణాన, ఓ జ్ఞాపకంలా నువ్వు వస్తావని తెలుసు. నేనడిగే ప్రశ్న ఒక్కటే "నా చుట్టూ ఈ కలలన్ని అల్లి, నువ్వెటు మాయమైపోయావు?" నువ్వు బదులివ్వక్కర్లేదు. నీ కళ్ళలోనే జవాబు దొరుకుతుందని నాకు తెలుసు!




































































